సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించి కొత్త వంపులు తెప్పించి విప్లవాన్ని రేకెత్తించిన ఓ మహర్షి నీ శతజయంతి సందర్భంగా ఇదే నా నివాళి. "శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు" అని చాటి చెప్పిన మహనీయా ఇదే నీకు నా నివాళి
"తలవంచుకు వెళ్ళిపొయావా నేస్తం
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి ..."
అంటూ స్నేహితుని తలచుకుంటూ మీరు సాగించిన "మహా ప్రస్థానం " నిజం గా మాకు అలుపు తెప్పించ్హేంత ప్రయాశ ప్రయాణమే ఆయినా మాకు ఆ దారిలో కలిగే అనుభూతులు అనంతం- ఓ మహాత్మా.
"నిన్న వదిలిన పోరాటంఅంటూ మీరు చేసిన శబ్ద తరంగాలు ఇప్పటికీ మా చెవిలో రింగు మంటున్నాయి - ఓ మహాకవి .
నేడు అందుకొనక తప్పదు !
కావున ఈ నిరాశామయలోకంలో
కధనశంకం పూరిస్తున్నాను ..."
" నేను సైతంఅని మీరు చెప్పినది, మాకు ఎప్పటికీ స్పూర్తిదాయకమే ! అదే మాలో అవేశానికి అద్యం.
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను ! "
"...సింహములాగూ, సివంగి లాగూ,అంటూ మాపై ఘర్జించి , తూటాలు పేల్చి, బుసలు కొడితే ఆ భయానికి బీతిచెందాము.
ఫిరంగిలాగూ, కురంగి లాగూ,
శంఖములాగూ, సర్పము లాగూ, ..."
"కుక్కపిల్లా,అంటూ కవులకీ మీరిచ్హిన ధైర్యం - అది మా అద్రుష్టం
అగ్గిపుల్లా,
సబ్బుబిళ్ళా -
హీనం గా చూడకు దేన్నీ !
కవితామయమెనోయ్ అన్నీ !! ..."
"కూటికోసం, కూలి కోసంఅంటూ మమల్ని కదిల్చి వేసారు ...
పట్టణంలో బ్రతుకుదామని
బయలుదేరిన బాటసారి ..."
"భూతాన్ని,ఇంతకన్న పదాలేవి, మిమ్ము స్మరించటానికి ?? ఓ మహాకవి !!
యఙోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను !
స్మరిస్తే పద్యం
అరిస్తే వాద్యం ..."
"పొనీ పొనీ పోతే పొనీ ..."
"పతితులారా బ్రష్టులార బాదసర్ప ద్రష్టులార !!! ఏడవకండేడవకండి .."
"కొంత మంది కుర్రవాల్లు పుట్టుకతో వ్రుద్దులు ..."
"పొలాలనన్ని హలాలదున్ని ...."
"మనదీ ఒక బ్రతుకేనా కుక్కలవలే, నక్కలవలే ! ...సందులలో పందులవలే .."
"ఏదేశ చరిత్ర చూచినా ఎమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరయాణత్వం .."
"అంతేలే, పేదల గుండెలు ! అశ్రువులే నిండిన కుండలు ! .."
అంటూ బడుగుల బాధని అర్ధంచేసావు.
ఇలా ఎన్నెనో ..... ఎన్నెనో ..... నన్ను కదిల్చివెసాయి ..ఎన్నో రాత్రులు నన్ను అరిపించాయి ...
కవిత్వమోక తీరని దాహం !