Monday, June 29, 2009

బలే బలే బాల్యం ...


బలే బలే బాల్యం ...

నాన్న తెచ్హిన రిమోటు రైలు
అమ్మ చేసిన తొక్కుడు లడ్లు
అక్క ఇచ్చిన అయస్కాతం
స్నేహితుడు పంచిన పిప్పరుమెంటు

అమ్మమ్మ చేసిన అరిసెలు
తాతయ్య కొట్టిన ముంజెలు
మావయ్య పాడిన పాటలు
పాలేరు తీయించిన పరుగులు

నాన్న నేర్పిన ఎక్కాలు
మాష్టారు నేర్పిన పద్యాలు
బళ్ళో గీసిన బొమ్మలు
పోటీలో పొందిన బహుమతులు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
స్కూలికి కట్టిన రంగుల జండాలు
దెబ్బలు తగిలిన కబాడీ ఆటలు
కప్పులు తెచ్హిన వక్రుత్వ పోటీలు

జేజమ్మ ఇచ్హిన జామకాయలు
పెద్దమ్మ పెట్టిన పులిహోరన్నం
పెరటిలో దొంగిలించిన మామిడికాయలు
పాత చెరువులో పట్టిన చేపలు

బోరు బావికాడ చేసిన స్నానాలు
నల్లతుమ్మ చెట్టుకింద పట్టిన కుస్తీలు
తోటలో ఏరిన జీడిమామిడి గింజలు
ఇంటివెనుక ఇసుకతో కట్టిన గూళ్ళు

తాతయ్య చెప్పిన రాజుల కధలు
అత్తయ్య తీసుకెల్లిన తెర సినిమా
అమ్మమ్మ వినిపించిన భగవద్గీత
అక్కయ్య ఆడించిన వైకుంపాళి.

పాత సినిమాల్లో పాటలు
అయస్కాంతంతో ఆటలు
ఏటిగట్టుపై ఇసుకలో సైకిలు పోటీలు
వానవెలిసాక నీటికుంటలలొ వేసిన గంతులు

భొగిమంటలకై పోగెసిన దుంగలు
దీపావళికి చేసిన సిసింద్రీలు
హోళీ పండుగకి తగిలిన గుడ్లు
శ్రీరామనవమికి వేసిన పందిళ్ళు

ఇంకా ఇంకా ...ఎన్నో ఎన్నో ...

కళ్ళ వెనుక కాంతి చాయలు
యదపై గుర్తులైన గాయాలు
కంటిపై కునుకెరుగని కలలు
మనసులో మరుపెరుగని ముద్రలు

బాల్యం అంటే కాదు బలి, అది ఎవ్వరికైనా బలే బలే !

5 comments:

సుజాత said...

నా చిన్నతనం లో కొన్ని ఇలాటివే ఉన్నాయి!! ఇవ్వన్ని చదువుతుంటే ఎవ్వరికైనా కొన్ని అయినా మదురానుబూతులు ఖచ్హితంగా గుర్తు వస్తాయి. ఇవే చాలా అనుకుంటే మీరు అకరున "ఇంకా ఇంకా ...ఎన్నో ఎన్నో ..." ఊరించారు కుదిరితే దీనికి రెండో బాగం రాయండి.

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగా రాశారు. ఈ కాలం పిల్లలకి అన్ని ఆనందాల్లో ఒక్కటి కూడా లేవు. మరి అంత ఎంజాయ్ చేసెస్తే టాలెంట్ టెస్ట్ లో వెనుకబడిపోరూ!!

Krishna said...

$>శేఖర్ పెద్దగోపు గారు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు పిల్లలు వేసవి సెలవలు వస్తే స్పెషల్ క్లాసులుకి వెల్లటమే తెలుసు. ఇంకా పాపం చలా మందికి అమ్మమ్మలు కూడా సిటీలో ఉండటంతో కేవలం వాళ్ళ ఆనందాలు ఓషంపార్కులకి మాత్రమే పరిమితం అయ్యయెమో !!

$>సుజాత గారూ రెండో బాగం గురించి కూడా అలోచిస్తానులెండి !! క్రుతజ్ఞతలు

Meeravali said...

చాలాబాగుంది బాబు!ఇక్కడ రాసినవి ప్రతి ఒక్కరి చిన్నతనంలో ఏదో ఒకటి వుండే వుంటుంది. ఒక్కసారి చిన్నతనాన్ని , అందులో వున్న ఆనందాన్ని గుర్తు చేసావ్.

Krishna said...

క్రుత్జతలు మీరావళి

Post a Comment

వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...