Friday, July 3, 2009

ప్రభుత్వోద్యోగుల మీదా "హస్తం" ముద్రలు - బ్యాంక్ మేనజర్ పై మందా దాడి

ప్రభుత్వోద్యోగుల మీదా "హస్తం" ముద్రలు - బ్యాంక్ మేనజర్ పై మందా దాడి

మందా మనిషిలా ప్రవర్తించలేదు ! అంధ్రా లోని నాగరకర్నూల్ నియోజకవర్గం నుండీ MP గా ఉన్న డాక్టర్ మందా జగన్నాదం ఇటీవల మహబూనగర్ లోని అంధ్రప్రదేశ్ గ్రామీణ వికాశ్ బ్యాంక్ మానేజర్ రవీందర్ రెడ్డి చెంప పగలగొట్టిన సంఘటనలో మందా మనిషిలా ప్రవర్తించలేదు, ఇది కేవలం అతని అధికార దురహంకారం అని అనిపించింది. ఇంత చేసినా మళ్ళీ మీడీయా ముందు ఈ పెద్దాయన ఒక కాకమ్మ కధ చెపుతున్నాడు.

నా ఉద్దేశ్యంలో ఇతగాడికి కాస్త మతి భ్రమించింది ఎమో అని అనుమానం ! ఎందుకంటే చెంప కి చెయ్యి తగిలితే దాన్ని చెంప దెబ్బ అనకుండా కేవలం మాటలు మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నాడు.ఇలాంటి వాళ్ళని మన రాష్త్ర MP అని చెప్పుకోవాలంటే ఈ సభ్య సమాజంలో నాలాంటివాళ్ళకి ఎంత సిగ్గుగా ఉంటుందో నేను ఊహించగలను .ఇంత వెధవ పని చేసిన పెద్దమనిషిని పార్టీ పెద్దలు మందలించక పోగా వెంకేసుకువస్తున్నారు.నాకే గనకా అధికారం ఉండి ఉంటే ఈ వ్యక్తిని వెంటనే పార్టీకీ, ప్రజలకీ కూడా దూరం చేసి ఎదోఒక మానసిక చికిత్సా కేంద్రంలో చేర్చేవాడిని.

ఆ సంఘటన టీవీలో చూసిన మరుక్షణం నాకు భలే కోపం అవేశం వచ్హేసాయి.కాసేపటికి ఇలాంటి మానసిక రుగ్మతలు ఉన్నవారిన మనం నాయకులిగా ఎన్నుకుంది అని జాలి వేసింది. ఇంతా జరిగాక మన జగన్నాదం బేషరతుగా (“Unconditional apology”) క్షమాపణ తెలుపటం అసలు నిజా నిజాలు విచారణ తర్వాత తెలుస్తాయి అని చెప్పటం నాకు మరీ వింతగా తోచింది.నోరు విప్పి పచ్హి అబద్దాలని పిచ్చిగా చెప్పేస్తున్న ఈయన దోరణికి కాంగ్రెస్ హై కామండ్ సైతం తాలం వేయటం అప్రజాస్వామ్యానికి నిదర్శనం.

మన పాలక పక్షానికి చెందిన వ్యక్తి కారణంగా విషయాన్ని పూర్తిగా బయటకి పొక్కనివ్వకుండా ముఖ్యమయిన టీవీ చానళ్ళు కి సైతం డబ్బులిచ్హి మరుసటిరోజే నోరు నొక్కే ప్రయత్నం జరిగింది.అయినా మిగిలిన దెశీచాన్నల్లు వదలకపోవటంతో విసహ్యం తేటతెల్లం అయ్యింది.ఇలాంటీ బాధ్యరాహిత్య చర్యలని ఇంకా కాంగ్రెస్ పార్టీ పెంచి పొషించటం అసమంజసం.వ్రుత్తి రిత్యా డాక్టరు అయిన మందా జగన్నధం గారు తన అరోగ్యం పట్ల అవగాహన లేకపోవటమే కాక బ్యాంకు మెనేజరు మద్యం మత్తులో ఉన్నారని కల్ల బోలి కబుర్లు చెప్తున్నారు.
"నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని నాయకుల్ని ! అగ్గివేసి కడుగు ఈ పార్లమెంటు పెద్దలని ...."
ఇకనయినా కాంగ్రెస్ హై కామండ్ సైతం ఇతనిపై తీవ్రమైనా కఠినమైన చర్యలు చెపడితే బాగుంటుంది.
ఇదంతా చూస్తే కాంగ్రేస్ వారి "హస్తం" సీదా సాదా పేదలితొనే కాక ప్రబుత్వోద్యోగుల చంపల మీదా కూడా మరుపురాని ముద్రలనే మిగిల్చిందనిపిస్తుంది.

5 comments:

Prashanth.M said...

ఆ ఇష్యుకి తెర పడింది కదా, మరి ఎందుకు మళ్ళీ దాన్ని రేకెత్తించడం?

Krishna said...

ప్రశాంత్ గారూ , నేను ప్రచురించటానికి బహుశా బాగా ఆలశ్యం చేసా !!

Anonymous said...

Imagene a scenario with change in charecters
The bank officer is a SC/St and teh MP is a forward caste.
A hundred RTC buses would have gone on fire.
The petty and gully leaders would have been very busy and the news papers would have written boxed news
disgusting politics

This Manda sold his soul and vote recently in parlament and he was given a MP seat by the congress party???
Is he a doctor ? what kind of Doctor, a veternary ???
shame on this ruling party

Anonymous said...

"Is he a doctor ? what kind of Doctor, a veternary ???' అనుకుంటే, మీరు మీరు (మనుష్యులు) అనుకోండి కాని, మా పశువులను, మా వైద్యులను ఇందులోకి లాగకండి. అయినా ఇలాంటి వాళ్లు మనుష్యులలో ఉంటారుకానీ, మా పశువులలో కాదు అధ్యక్షా!!

మాకు కొద్ది రోజులు మేత వేసారని, కొత్తచోటుకు వెళ్లినా, వెతుక్కుంటూ పాత ఇంటికి వస్తాం, అంతే కాని, డబ్బులు తిని ఉన్న ఇంటికి ద్రోహం చేసి, క్రొత్త ఇంటికి పోము అద్యక్షా. (కుల) బలం ఉంది అని, ప్రక్క వాళ్ల మీద ఇలా రెచ్చి పోము కూడా. అది మీలో ఉన్న "కొద్ది" మంది మనుష్యులకే సాధ్యం మరి !!!!

Krishna said...

Yes its really shame on ruling party
being doctor he behaved like a buffalo
i don't know what kinda doctor he is..
he only told in one interview that being a doctor for 14yrs he was able to notice that the bank manager was drunken when the incident happened.

see eenaadu in the below link abt this news
Eenadu link abt jagannatham

Post a Comment

వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...