పార్టీలో బెన్నీ దయాల్ - సినీ గాయకుడు
ఇటీవల మా ఫ్రెండు వాళ్ళ కంపెనీ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానిచటంతో, పెద్దగా పని ఎమీ లేక కాళీ కాళీగా ఉండటంతో చేసేది ఎమీ లేక అక్కడికి వెళ్ళటం జరిగింది. అన్ని వార్షికోత్సవాల వలే ఇది కూడా బహుమతుల ప్రదానోత్సవం, ఆటలు , పాటలు ఇంకా డిస్కో వంటి కార్యక్రమాలతో అలరించింది, అన్నిటికన్నా ఇక్కడ బెన్ని దయాల్ చేసిన సంగిత విభావరి ఎక్కువ అలరించింది. ఇంకా చెప్పాలి అంటే చిన్న గొట్టం (దాని పేరు నాకు తెలీదు) వంటి సంగీత వాయిధ్యంతో బెన్నీ చెసిన సంగీతం అబ్బురపరిచింది. ఇంతకీ మీకు బెన్నీ గురించి తెలుసా ?? బెన్నీ సినిమా గాయకుడు ముఖ్యంగా ఏ ఆర్ రెహ్మాన్ సినిమాలకి పాడారు, బాగా తెలియాలంటే ఇటీవల విడుదలయిన "ఏం మాయ చెసావే ? " సినిమాలో కుందనపు బొమ్మ .. పాటా , "ఢిల్లి - 6 (హింది)" లో మసక్కలీ మసక్కలీ .. పాటా .. ఇంకా చాలా పాటలు పాడారు.
పూర్తి వివరాలకోసం బెన్నీ వికీ పేజి ఇక్కడ చూడండి . http://en.wikipedia.org/wiki/Benny_Dayal
బెన్నీ ఒక గాయకుడే కాదూ, గిటార్, మృదంగం వంటి వాయిధ్యాలలో సైతం అందెవేసిన చెయ్యి.. మొత్తానికి ఆ రోజూ "టాక్ ఆఫ్ ది పార్టీ " బెన్నీ

2 comments:
Hello sir, gone through your blog.very interesting.Every flavour mixed in this in a natural way...cinima,personal matters,travels&all others....KVVS MURTHY
Delhi-6 masakkali was sung by mohit chauhan, NOT benny dayal.
Post a Comment
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...