Monday, May 3, 2010

పార్టీలో బెన్నీ దయాల్ - సినీ గాయకుడు

  పార్టీలో బెన్నీ దయాల్ - సినీ గాయకుడు
ఇటీవల మా ఫ్రెండు వాళ్ళ కంపెనీ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానిచటంతో, పెద్దగా పని ఎమీ లేక కాళీ కాళీగా ఉండటంతో చేసేది ఎమీ లేక అక్కడికి వెళ్ళటం జరిగింది. అన్ని వార్షికోత్సవాల వలే ఇది కూడా బహుమతుల ప్రదానోత్సవం, ఆటలు , పాటలు ఇంకా డిస్కో వంటి కార్యక్రమాలతో అలరించింది, అన్నిటికన్నా ఇక్కడ బెన్ని దయాల్ చేసిన సంగిత విభావరి ఎక్కువ అలరించింది. ఇంకా చెప్పాలి అంటే చిన్న గొట్టం (దాని పేరు నాకు తెలీదు) వంటి సంగీత వాయిధ్యంతో బెన్నీ చెసిన సంగీతం అబ్బురపరిచింది. ఇంతకీ మీకు బెన్నీ గురించి తెలుసా ??
బెన్నీ సినిమా గాయకుడు ముఖ్యంగా ఏ ఆర్ రెహ్మాన్ సినిమాలకి పాడారు, బాగా తెలియాలంటే ఇటీవల విడుదలయిన "ఏం మాయ చెసావే ? " సినిమాలో కుందనపు బొమ్మ .. పాటా , "ఢిల్లి - 6 (హింది)" లో మసక్కలీ మసక్కలీ .. పాటా .. ఇంకా చాలా పాటలు పాడారు.
పూర్తి వివరాలకోసం బెన్నీ వికీ పేజి ఇక్కడ చూడండి . http://en.wikipedia.org/wiki/Benny_Dayal
బెన్నీ ఒక గాయకుడే కాదూ, గిటార్, మృదంగం వంటి వాయిధ్యాలలో  సైతం అందెవేసిన చెయ్యి.. మొత్తానికి ఆ రోజూ "టాక్ ఆఫ్ ది పార్టీ " బెన్నీ  

Monday, April 26, 2010

ఎవరు యాక్టరు ? ఎవరు ఓవర్ యాక్టరు ? విక్రం Vs అభిషేక్

ఎవరు యాక్టరు ? ఎవరు ఓవర్ యాక్టరు ? విక్రం Vs అభిషేక్ 
హెల్లో!!
నాలాగా మీరూ కూడా మణిరత్నం గారి కొత్తసినిమా "రావణ్" (హిందిలో) "విలన్" తెలుగులో కోసం ఎదురుచూస్తున్నారా ?
నెనయితే ఎప్పటినుండో ఎదురుచూస్తున్నా, సినిమా కధ రామాయణం నుండీ ప్రేరేపింపబడిందని నా ఊహ ! గతంలో కూడా మణిరత్నం తన చిత్రాలు లేదా అందులోని పాత్రలు మన ఇతిహాసల/పురాణాల వలనో ఆదర్శంగా తీసుకుని తీసిన సినిమాలే !! అయితే ఇక ఈ రావణ్ ఎలా ఉంటుందో చూడాలి మరి ?
ఈ చిత్రానికి తెలుగు మరియు తమిల భాషలలో విక్రం కధానాయకుడు కాగా హిందీలో మాత్రం మన జూనియర్ బచ్హన్ అభిషేక్ ... అయితే ఒకే పాత్ర వేరు వేరు నటులు చేసినప్పుడు వారీ మద్య తేడాలని గమనించడం సర్వ సాదారణం కధా అదే ఇక్కడా జరిగింది. ..
ఈ మద్యనే విదుదలయిన ఈ సినిమా తెలుగూ మరియూ హిందీ పోస్టర్లు చూసాక,  ఒక చిన్న ధర్మసందేహం  కలిగింది . కింద ఆ పోస్టర్లు చూసి సందేహం మీరెవరయిన తీర్చగలరు..

Doubt : ఎవరు యాక్టరు ? ఎవరు ఓవర్ యాక్టరు ? విక్రం or అభిషేక్ 
అయితే ఇక్కడ మరో సందేహం ఎమిటంటే ఒకే అభినయం ఇద్దరు నటులనుండీ మణిరత్నం ఎందుకు తీసుకోలేదు అన్నది కొసమెరుపు 

Friday, April 9, 2010

యాక్షన్ సినిమా డైరెక్టరుగా మారనున్న "చీ"దంబరం


యాక్షన్ సినిమా డైరెక్టరుగా మారనున్న "చీ"దంబరం
ఇటీవల జరిగిన దంతేవాడ ఘటనపై ప్రజలంతా ఘాటుగా ఉన్న సందర్బంలో మన చీ-దంబరం గారు మరొక గమ్మత్తయిన ప్రకటన విడుదల చేసి ఎదో దూరపు ఆలోచనా దోరణిని వ్యక్తపరిచారు. ఆ గమ్మత్తయిన ప్రకటన మరేదో కాదు - "మానవ రహిత విమానలతో నక్సల్స్ పై దాడి" అసలు నా అనుమానం ఎమిటంటే ఈయన చేసిన వెధవ పనికి ప్రభుత్వమే హోం శాఖ నుండి తప్పించి మరి ఏ సినిమారంగ శాఖకో వేస్తే అక్కడ తన హస్త లాఘవాన్ని చూపడానికిగానూ ముందు నుంచే మెదడు కి పదును పెట్టే పనిలో పడ్డట్టున్నాడు.

ఈయన చేసిన "మానవ రహిత విమానలతో నక్సల్స్ పై దాడి" ప్రకటన పూర్తిగా చదివిన తర్వతా మనవాడు ఎదో పెద్ద యాక్షన్ సినిమా కి కధ రాస్తూ మధ్యలో గవర్నమెంట్ గుర్తుకి వచ్హి  ఈ అర్దరహిత ప్రకటన చేసాడేమో అనిపించింది. కాలిక్యులేటరు పట్టుకునే చేతులతో కత్తులు దూసే పని చెయమంటే అతను మాత్రం ఎమి చేస్తాడు. నా వరకు నాకు ఇతగాడు ఆర్ధికశాఖలో ఉన్ననాల్లు భలే గౌరవం ఉండేది, ఆ తర్వాత మనవాడు చేసిన ప్రతీ పనీ గాలిదుమారమే.
మొన్నటికి మొన్న బాగా తాగి పడుకున్న KCR చిందులకి కంగారుపడిపోయి కలిసి మెలిసి కమ్మగా బ్రతుకుతున్న అంధ్రా ప్రజానికానికి కుంపటి రాచేసే విదంగా కంపరమెత్తే కబురు ఒకటి చెప్పి కామ్ గా కూర్చునాడు. మనోడి మీద అప్పుడే ఒక తీర్మానానికి రావలిసింది తప్పుచేసా.


ఒక అలోచనా, అవగాహన, ప్రణాళిక ఇంకా అంచనా ఎమీ లెకుండా పంపటంవల్లే సి ఆర్ పి ఎఫ్ దళాలని పొట్టనపెట్టుకున్నాడు, అంతా అయిపొయాక "ఇది నా చెతకానితనం"  అని ఒప్పుకుంటే మాత్రం ఎమి ప్రయోజనం. ఎది ఎమయిన అంత ముఖ్యపదవిలో ఉండి చెపట్టే ఆపరేషన్స్ అన్ని ఇలా కొండెక్కిస్తే ప్రభుత్వం పని గాలిలో పెట్టిన దీపం అయిపొతుంది . 


మొత్తానికి చీ-దంబరంగారూ మీ చేతకానితనానికి చెయ్యెత్తి కొట్టంటం బాగోదు కనుక ఇలా చీ అని సరిపెట్టుకుంటున్నాము  ఇకనయిన మీ యాక్షన్ సినిమా కధలో సన్నివేశాలు మా మీద ముఖ్యంగా నక్సల్స్ మీదా ప్రయోగించవద్దు ఒక వేళ అందులో మాకు అర్దంకాని చిదంబర రహస్యాలు ఎమయిన ఉంటే కాస్త అర్దం అయ్యెటట్టు చెప్పి పుణ్యం కట్టుకోండి. 
ఈనాడులో  మన వాడి చిదంబర ప్రకటన ఇక్కడ చూడండి.  [1]

Wednesday, December 30, 2009

గోవాలో " శ్రీ " దేవి,చార్మి,విద్యా సాగర్


గోవా లో చార్మి, దేవి శ్రీ ప్రసాద్  


క్రిస్మస్ పండగ అనగానే ఎదో తెలియని ఆనందం, కొత్త సంవత్సరానికి మరీ దగ్గరగా ఉండటంతో ఇది కూడా పెద్దపండగే, పైగా సంవత్సరంలో అఖరు పండగ... మొత్తానికి ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న మా గ్యాంగు అంతా కలిసి సరిగ్గా క్రిస్మస్ కి ముందు రోజే అక్కడికి చేరుకున్నాం, అనుకున్న విధంగానే సాగరతీరానా సాయత్రం వరకూ సేద తీరి ఆ తర్వాత పబ్బులోకి(TITO's) చేరి ఊగి ఊగి అలసిపోయి సుమారు తెల్లవారుజామున మూడు గంటలు ఆ ప్రాంతాన ఇంటికి చేరెందుకు పబ్బు నుండి బయటపడ్డాము. మరికొందరి స్నేహితులకోసం ఎదురుచూస్తూ పబ్బు బయటనే నిద్ర మత్తులో కూర్చుని అటూ ఇటూ అదే పనిగా తుళ్ళుతూ, తూగుతూ తిరుగుతున్న ఆడపిల్లల్ని చూస్తూ అర్దంకాని అనవసర ఆలోచనలతో సతమతవతున్న నాకు ఎక్కడో బాగా తెలిసిన అమ్మాయిలాగ ఒక ఆకారం కనపడింది, వెంటనే పక్కనే ఉన్న స్నేహితుడి కి చూపించి "ఎరా మన మంత్రా చార్మి లా లేదా ? " అని అడిగా , వాడు కూడా అంత మంది అమ్మాయిలలో మాములు ఒక మోస్తరు అమ్మయిలా కనపడటంతో అనుమానంగా చార్మినే అనుకుంటరా అన్నాడు. (నిజానికి చార్మి చాలా సన్నగా ఉంది, బహుసా కొత్త లుక్ కోసమెమో )కనురెప్ప పాటులో మళ్ళీ అనుమానం, ఆ తెల్లచొక్కావాడి ముక్కు అచ్హూ మన దేవి శ్రీ ది లా లేదా అని అన్నా, వెంటనే వాళ్ళు చార్మి - దేవి రా అని ఎగిరి గంతేసాడు ; మరుక్షణం    మేము ఇద్దరం వాళ్ళ  పక్కన ఉన్నాం - ఎముంది కట్ చేస్తే కింద "దేవి తో నేను "  ఇంకా "దేవి తో మా ఫ్రెండు" ఉన్న ఫొటోలు ... ఆ నాకు తెల్సు మీ తరువాతి ప్రశ్న పక్కనే మంత్ర ముద్దుగుమ్మ ని పెట్టుకుని ఆ ఫొటో దిగలేదే అనే కదా ?? ఎముంది అక్కడ దేవి రిక్వస్ట్ ...కాదనలేక పొయాం .. దానితో కేవలం చార్మి కరచాలనం తో సరిపెట్టుకున్నాం, అనట్టు ఇంకో విషయం చెప్పటం మరిచిపొయా చార్మి, దేవీ లతో పాటు, దేవీ తమ్ముడు "విద్యా సాగర్" (గాయకుడు) కూడా వీళ్ళతోనే ఉన్నాడు. బహుశా అన్న కి తమ్ముడు తోడు కాబోలు !!! మొత్తానికి మా గోవా ప్రయాణానికి చార్మి మరింత మేరుగులు అద్ద్దింది . గోవా యాత్రా విశేషాలు పూర్తిగా ఇంగ్లీషు లో ఈ లింకు లో చూడండి .
 

Sunday, December 13, 2009

సమైఖ్యాంధ్ర పోరాటం - బెంగుళూరు

సమైఖ్యాంధ్ర పోరాటం - బెంగుళూరు
Blog link for the same in English : http://krishnababug.blogspot.com/2009/12/samaikya-andhra-rally-bangalore-paper.html

ఆంధ్ర రాష్ట్రం లో రగిలిన సమైఖ్యాంధ్ర పోరాటం బెంగులూరు వాతావరణాన్ని సైతం వేడి ఎక్కించింది. ఇక్కడ వివిద రంగాలలొ ఉద్యోగాలు నిర్వహిస్తున్న ఆంధ్రా యువత అంతా కలిసికట్టుగా ఒక్క ఆశయానికై నిలబడ్డారు. యువరక్తం సైతం శాంతం వహిస్తూ మహాత్మ గాంధీ విగ్రహం వద్ద స్థానిక MG Road లో కొవ్వొత్తులు వెలిగించి తమ వేదన వెలిబుచ్చారు, ఎక కంఠంతో వారు  "ఒకే బాష - ఒకే రాష్ట్రం " అంటూ నినాదాలు పలికారు. వీరి నిరశనకి నిదర్శనంగా ఈ కింది నినాదాలు పలికారు...
        * ఫొట్టి శ్రీరాములూ అమర్ రహే   
        * తెలుగు వాడి ఆత్మగౌరవం నిలుపుకుందాం - సమైక్య ఆంధ్రని కాపడుకుందాం 
        * ఒకటే బాష - ఒకటే రాష్ట్రం  
        * విభజన వద్దు - సమైఖ్యత ముద్దు 
        * అమ్మ లాంతి ఆంధ్ర ని ముక్కలు చెయ్యొధు.
        * డిల్లీ కపట నాటకాలు కట్టి పెట్టాలి    
        * రాష్ట్రాన్ని విడదీసే రాజకీయ శక్తులు నసించాలి 
        *తెలుగువారి ఐక్యత వర్దిల్లాలి

Eenadu District edition Dec 13 2009

United Andhra Eenadu Dist


Eenadu Main Dec 13 2009
Samaikya andhra Eenadu Main
Saakshi Dec 13 2009


Eenadu Cont ... Dec 13 2009
Eenadu Dist Cont

Photobucket