Monday, May 18, 2009

2009 Election Results - Andhra pradesh(2009 ఎలక్షన్ల ఫలితాలు - ఆంధ్రప్రదేశ్ )

2009 ఎలక్షన్ల ఫలితాలు - ఆంధ్రప్రదేశ్
"తెలివి ఏ ఒక్కడి సొత్తూ కాదు" అని రాజశేఖర రెడ్డి విజయం మరొక్కసారి గుర్తు చేసింది.మన రాష్టానికి ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా,అపర చాణిక్యుడిగా పేరుగాంచినా శ్రీ నారా చంద్రబాబుదే కాదు తెలివి, అది మాకూ ఉంది అని రాజశెఖర్రెడ్డి నిరూపించారు."సమైఖ్య ఆంధ్రా" అంటూ అతిగా హడావిడి చేయకపోయినా, వేర్పాటువాదం వల్ల నష్టాలనీ ,తెలివిగా తన మనోగతాన్ని సున్నితంగా ప్రజలకి తెలియచెప్పీ ప్రాంతీయాభిమానాన్ని చాటుకున్నారు.కేవలం "సమైఖ్య ఆంధ్రా" భావమే గెలుపుని తెచ్హిపెట్టింది అని పూర్తిగా నిర్ధారించలేను గానీ తన మనసులో ఉన్న బలమయిన ప్రాంతీయ సమైఖ్య భావం మేలు చేసిందనే అర్దం అవుతుంది.

దుష్టబుద్దితో తెలంగాణా వాదాన్ని పెంచి పోషిస్తున్న కే.సి.అర్ కి, గొర్రెల్లా వెనకా ముందు ఆలోచించక దుష్టుడితో సహవాసంచేసినందుకు తక్కిన నాయకులకీ ప్రజలు సరైన తీర్పే ఇచ్హారు అనిపించింది."దుష్టుడికి దూరంగా ఉండాలి" అన్న కనీస జ్ఞానం ఉండిఉంటే చంద్రబాబు ఈరోజు ఇలా తలదించుకునే అవస్థ వచ్హిఉండేదే కాదు.

వ్యక్తి గా చంద్రబాబుకున్న శక్తి మొత్తం హరించి వేయటంలో కే.సి.అర్ తో పాటు వామ పక్షాలు సైతం తమవంతు తాము కృషి చేసాయనటంలో ఏమాత్రం సందేహంలేదు.వ్యుహాలని పన్నటంలో సిద్దహస్తునిగా పేరుగాంచిన చంద్రబాబు కనీస రాజకీయ ధర్మాలని మరిచి TRSని 45 స్థానలలో పోటీ చెయనివ్వటం నిజంగా అసమంజసం."ఎంత చెట్టుకి అంతే గాలి" అన్న చందాన ఆ దుష్టుడి కి కేవలం 10 స్థానాలే వచ్హి ఎందుకు పనికిరానివిగా అయ్యాయి.

గడిచిన అయిదేళ్ళ కాలంలో బలమైన ప్రతిపక్ష పార్టీగా నిరూపించికోక పోవటం ఒక తప్పయితే, సరైన సమయానికి దుష్టులితో సహవాసంచేసి కేవలం గెలుపే తమ వాంఛ అని ప్రజలకి పూర్తిగా అర్ధమయిపొయేలా చేసారు.చేతులు కాలుతున్నాయని మంట తెలిసాక, అప్పుడు ప్రజాసంక్షేమ పధకాలయిన "కలర్ టీవి","ఉచితం స్కీములు" ఇంకా ప్రతిష్టాత్మకమైన "నగదు బదిలీ" పధకాలను ప్రవేశపెట్టినా కూడా ప్రజల చెవ్వులలోకి కూడా ఇవి దూరలేదు.

అసలు తెలంగాణాలో ఫలితాలని పరికించిచూస్తే ప్రజలకి "తెలంగాణా" రాష్ట్ర వేర్పాటు భావలు చాలా తక్కువ ఉన్నాయేమో అనిపిస్తుంది.కే.సి.అర్ పదే పదే చెప్పుకునే "తెలంగాణా" రాష్ట్ర వేర్పాటు భావాలు నిజంగా ప్రజల మనోగతమే అయితే కనీసం తెలంగాణలో అయినా టి.అర్.ఎస్ ఎక్కువ సీట్లు మెజారిటీతో సొంతంచేసుకుని ఉండేది.కానీ ఫలితాలు దీనికి పూర్తి విరుద్దంగా సమైఖ్య ఆంధ్రా అన్నట్టు కాంగ్రెస్ కే పట్టం కట్టాయి.ఇది కేవలం కే.సి.అర్ తన అధికార దాహం తీర్చుకోవటానికి అడుతున్న నాటకం అని ప్రజలు చెప్పకనే చెప్పారు.మరి ఇకనయినా కే.సి.అర్ తన నక్క జిత్తులు కట్టిపెట్టి(తెలంగాణా వెర్పాటు ఉద్యమాలు వదిలి) ప్రజల కనీస అవసరాలపై ద్రుష్టి సారిస్తే తనకి భవిష్యత్తు ఉంటుంది.లెకపొతే గత మూడు ఎన్నికలఫలితాల మాదిరే తదుపరి ఎన్నికల లో సైతం చుక్కెదురవుతుంది.ఇప్పటికే తన సీట్లు వెళ్ళపై లెక్కించేవిగా ఉన్నాయి ఇదే ధొరణితో ముందుకి వెళ్తే కనీసం ఆ సీట్లు కూడా రాకుండా పోతాడేమో.

మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, డీ శ్రీని వాస్, షబ్బీర్ అలి,జీవన్ రెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, మండలి బుద్దప్రసాద్, పిన్న్నమనేని వెంకటేశ్వర రావు వంటి ఇతర మంత్రివర్గ సభ్యులు ఇంకా కేంద్ర మంత్రి రేణుకా చౌదరి లాంటి వారి వైఫల్యం నుండి ప్రజల అసమ్మత్తి కాంగ్రెస్ పార్టీ పట్ల అర్దం అవుతుంది.కావున రాజశేకర్ రెడ్డి పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళణ చేసి కొత్త మంత్రివర్గంతో అయినా ధనాశ లేకుండా పనిచెయిస్తే సుస్థిరాంధ్రప్రదేశ్ ని మనం చూడగలం.

ఇదిలా ఉండగా 294 స్థానలకి గానూ 292(కనీసం ఒక స్థానం చంద్ర బాబు కి ఒక స్థానం వై యస్ కి అయినా వదిలారు) స్థానాలు కేవలం ప్రజారాజ్యం పార్టీ ఒక్కటే కైవసం చేసుకుంటుందని చిలక జ్యొసం చెప్పిన అల్లూ అరవింద్ అనకాపల్లి నియొజక వర్గంలో పోటిచేసి చిత్తు చిత్తుగా ఓడిపొయారు.అలాగే పాలకొల్లు నియోజక వర్గం నుండీ పోటీ చేసి కనీస ప్రచారం కూడా నిర్వహించకుండా, పొగరుతో, పగటి కలలతో, పొగడ్తలతో, కళ్ళుమూసుకుపొయి ఒక మహిళ చేతులో చిత్తుగా ఓడి పోయి భూమి తన కాళ్ళ కింద ఉంటుందని తెలుసుకుని స్ప్రుహలోకి వచ్హిన చిరంజీవికి ప్రజలు తన విలువ ఎంటో బాగా బుద్ది చెప్పారు. కుల రాజకీయాలు మాకు వద్దు, కులం పేరుతో ఇక పై ఎవడైనా మాలో మాకు కుమ్ములాటలు పెట్టాలని చుస్తే ఇదే శాస్థి అని ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలియచేసిన ఓటర్లకి నిజంగా జోహార్లు."నీకుంటే మాకెంటి? - నీకింకా వస్తే మాకెంటి?" నువ్వు మాకొసం ఏమి చేస్తావ్?ఏమి చేయ గలవ్? అన్న అలోచనలతో ఉన్న ప్రజలకి "ప్రజా రాజ్యం ఒక విష వ్రుక్షం అని తెలియటంతో" అది తీసుకురాబొయే కులాల కుమ్ములాటలని ముందే ఊహించి, పార్టీ వ్యవస్థాపకుల ధనాశని గ్రహించి ఓటర్లు మంచి గుణపాటమే చెప్పారు.

అల్లు అరవింద్ లాంటి అవకాశవాదులకి రాజకీయాలు కూడా ఒక మార్గం అయితే అది నిజంగా రాష్ట్ర అరిష్టానికి దారితీసేదెమో,ఇకనయినా చిరంజీవి తన చుట్టూ ఉన్న వారి చెప్పుడు మాటలు వినక తన వ్యక్తిత్వ వికాసానికి మెరుగులు దిద్దుకుంటే మంచింది."మార్పు" మాకు వద్దు, మెరుగయిన సమాజం చాలు ...సామజికన్యాయం అనే ముసుగుతో మా జీవితాలకి అన్యాయం చెయ్యొద్దూ అంటూ ప్రజలు మౌన-గళం విప్పారు-ప్రజారాజ్యానికి బుద్ది చెప్పారు.

తెలుగుదేశం రాలేదు , కాంగ్రేస్ వచ్చింది అన్నవి పక్కన పెడితే అవాంచిత,అవకాశవాదుల రాజకీయాలకి(ప్రజారాజ్యానికి) సందివ్వకుండా కాంగ్రెస్ పార్టీయే స్వయం ప్రతిపత్తితో ప్రబుత్వం ఎర్పాటుచేయటం ఎన్నో వేల కోట్ల రూపాయలు చేతులు మారకుండా అడ్డుకట్టవేయటం నిజంగా శుభపరిణామం.అవును ఇది సైలెంట్ సునామీనే (మౌన-గళం).

ఎలాగూ కాంగ్రెస్ వారి దాడులు, ఈనాడు పైనా ఆంధ్రజ్యొతి పైనా కొనసాగక తప్పవు కాబట్టి ఇకనయినా మీడియా వారు నాయాకులకు తొత్తులుగా మసలక తమ తమ విధులను గుర్తెరిగి సమాజవికాశానికి తమద్వార పూర్తి స్థాయి వాస్తవాల వెలుగులని చిమ్మాలని అశిస్తాను.

ఇకపోతే కిషన్ రెడ్డీ(BJP),జయ ప్రకాష్ నారయణ (Loksatta) వంటి వాళ్ళు అసెంబ్లీలో ద్రుఢమైన ప్రతిపక్ష పాత్రని పోషిస్తు మెజారిటీ సీట్లున్నా కూడా సరయిన ప్రతిపాక్షం గా వ్యవహరించలేని తెలుగుదేశానికి ఒక మార్గదర్సకంగా ఉంటూ వారి ఆలొచనలలో మార్పు తెస్తూ, ప్రబుత్వాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రాబివ్రుద్దికి కృషి చేస్తారని బావిద్దాం.

మొత్తం శాసన సభ స్థానాలు 294 కాగా ప్రబుత్వ ఏర్పాటుకు కావల్సిన 148 స్థానాలకు గానూ కాంగ్రేస్ పార్టీ సునాయాసంగా 157 స్థానాలు సొంతం చేసుకుని తన సత్తాచాటుకుంది.

అంధ్రాలో మొత్తం లోక్ సభ స్థానలు : 42
పార్టీలు సాధించిన స్థానాలు
కాంగ్రెస్ : 33
తెలుగుదేసం : 4
తెలంగాణా రాష్ట్ర సమితి : 2
ఇతరులు :3
పూర్తి వివరాలు దిగువ లింకు లో

అసెంబ్లీ స్థానాల పూర్తి వివరాలు దిగువ లింకు లోFriday, May 15, 2009

రెపే విదుదల !! సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ - 'ముఖ్యమంత్రి 2009'

రెపే విదుదల !! మీ అభిమాన థియేటర్లలో
సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ - "ముఖ్యమంత్రి 2009".

భారీ బడ్జెట్ తో, బ్రహ్మండమైన సెట్టింగులతో (ఫిట్టింగులతో ), తలమెరిసిన (కధా) నాయకులతో, ఊహించలేని పొత్తులతో (మలుపులతో ) అత్యంత వ్యయ ప్రయాసలతో భారీ సెక్యూరిటీతో పూర్తి స్థాయి సాంకేతిక విలువలతో(మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ కధా).

ఒళ్ళు గగురుపుట్టించే పోరాటాలు, దిమ్మ తిరిగిపొయే డైలాగులూ,భారీ ఉద్వేగానికి గురిచేసే సీన్లు, కడుపుబ్బ నవ్వించే కామెడీ, కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతలు ...ఒకటెంటి ఇలా అన్నీ కలబోసిన అంధ్రా అవకాయ లాగా ఉరిస్తూ మనముందుకు రాబోతోందీ "ముఖ్యమంత్రి 2009".

సినిమా పేరు : ముఖ్యమంత్రి 2009
బడ్జెట్ : ఒక్క అంధ్రా లో సుమారు 5000 కోట్లు
దర్సకత్వం : సుబ్బారావు (ఎలక్షన్ కమీషనర్)
సహాయ సహకారం : మహంతి (DGP)
బ్యానర్ : అంధ్రా ఎలక్షన్ టాకీస్
నిర్మాత : ప్రజలు
పబ్లిసిటీ : ఎవరి టీ.వి చాన్నళ్ళో వాళ్ళు, ఎవరి పత్రికల్లో వాళ్ళు
నటవర్గం : కాంగ్రెస్ , తెలుగు దేశం, టి.ఆర్.ఎస్ , పి.అర్.పి,వామ పక్షాలు తదితరులు
విదుడల తేది : 16 మే 2009
పంపిణీ దారులు : మీడియా

ఇది కేవలం పెద్దలకి మాత్రమే చిత్రం . 'A'

"నేనూ
గాని ఒకసారి ముఖ్యమంత్రి అయ్యానంటే" అంటూ ముందుగానే నటనా చాతుర్యాన్ని
స్టేజీలపై చూపిన నేతలు, అసలు ఎంతబాగ చేసారో రేపు తెలియబోతోంది.


ఇప్పుడే అందిన వార్త : TV9 వారు ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ (Microsoft Surface)ని ఉపయోగించి తెలియచెయబోతున్నరు.ఇండియాలోనే, మీడియా రంగంలో మొట్టామొదటిగా సర్ఫేసును వాడనున్న ఘనత TV9దనే చెప్పాలి.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్
(Microsoft Surface)గురించిన మరింత సమాచారాన్ని ఈ లింక్ లో చూడ గలరు.

Monday, May 4, 2009

నవతరంగం లో నా మొదటి వ్యాసం

నవతరంగం లో నా మొదటి వ్యాసం
నవతరంగం లో నా మొదటి వ్యాసం ఈ రోజుకి కుదిరింది మొత్తానికి మిత్రుడు సినిమాతో నా కాతా తెరిచాను ఈ సైటులో మీరు కూడా ఒక చూపుచూడండి కింద లింక్ క్లిక్ చేయండి

Friday, May 1, 2009

మిత్రులతో "మిత్రుడు" ! - "Mithrudu" Review

మే 1 - కార్మికుల దినోత్సవం సందర్భంగా నాతో పాటు మా స్నేహితులందరికి ఆఫీసులకి సెలవు కారణంగా, అంతా కలిసి ' మిత్రుడు ' సినిమాకి వెళ్ళాము.ఉదయం ఆట 10:30 కి అని ప్రకటించటంతో ముందుగానే అక్కడికి చేరిన మాకు షో 11 గంటలకి అనిచెప్పటంతో కొంత నిరాశ ఎదురయినా ఆ కాస్త సమయంలో మరికొందరు స్నేహితులు హాలుకి రావటంతో కొంత త్రుప్తిచెందాం. ఇక సినిమాలోకి వస్తే ' మిత్రుడు ' అందరికి ఎక్కడ శత్రువు అవుతాడో అన్నభయంతో ఉన్న నాకు కొంత ఊరట కలిగించిందనే చెప్పాలి.  

ఒక్క మాటలో : కధ కొత్తగా లేకపోయినా కధనంలో మలుపులు, కధానాయక వలపులు, హాస్యంలో చెణుకులు, మలేషియా మెరుపులూ, బాలయ్య నెమ్మదయిన అరుపులూ మొత్తానికి మనకి ' మిత్రుడు ' అయ్యాయి.

ఈమద్య కొత్తగా పరిచయమవుతున్న అందరి దర్శకులమాదిరిగా ' మహాదేవ్ ' కూడా కధకన్నా కధనానికే పెద్దపీట వేశారనిపించింది.ఒక్కమాటలో చెప్పాలంటే దర్శకుడిగా మొదటి అవకాశమే బాలయ్యవంటి పెద్దహేరోతో వచ్హినా కూడా కధా కధనాలపైననే అసక్తి కనబరిచారనిపించింది. ఎందుకంటే బాలయ్య బ్రాండు సినిమాలలో కనిపించే పదునైనా, పొడుగైన సంభాషణలూ ఈ సినిమాలో కనపడలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలం తర్వాత వర్షాకాలం కోసం ఎదురుచుసే ఆశాజీవుల్లా,బాలయ్య అసాధ్యమైన (తొడ కొడితే ట్రైను వెన్నక్కి వెళ్ళిపోయే) సన్నివేశాలకై ఎదురుచుసే అసామన్య ప్రేక్షకులకు కొంత గొడ్డలిపెట్టు ఈ ' మిత్రుడు '. ఎందుకంటే ఇందులో అటువంటి అసందర్బ, అసాద్యమైన సన్నివేసాలు ఎమీ లేవు కాబట్టి. ఈ సినిమా బాలయ్య కాకుండా ఏ కధానాయకుడు చేసినా సామాన్య ప్రెక్షకుడు ఒకేలా రంజింపబడతాడు. బాలయ్య, ఆదిత్యా అనే పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశారు గాని, ఆ పాత్ర బాలయ్యకి పిసరంతైనా న్యాయం చెయలేదు అనిచెప్పొచ్హు . కధ ప్రధమాంకం అంతా మలేషియాలో సాగుతుంది. కేవలం మలేషియా అందాలని చుపించాలనే అలోచనలేకుండా కధానుగుణంగా మాత్రమే ముఖ్య సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారనిపించింది.బాలయ్య పదునయిన సంభాషణలకే కాదు, కేవలం హావాభావలతో కూడి తక్కువ మాటలు గలిగిన అభినయం కూడా ప్రేక్షకులని మెప్పిస్తుంది. ప్రియమణి తన ప్రేమించిన వాడిని పెళ్ళిచేసుకుంటే తన జాతకరిత్యా అతనికి మ్రుత్యుఘండమున్నదని తెలియడంతో మ్రుత్యుఘండమున్న బాలయ్య(ఆదిత్య)ని పెళ్ళిచేసుకోవాలని ప్రయత్నిచి విజయంసాదిస్తుంది. కాని తను నిజానికి ప్రేమించిన వాడు మంచివాడు కాదని, తన తండ్రి నిశ్చయించిన వరుడు బాలయ్యే అని తెలియడంతో ప్రియమణి ఇంకా తండ్రి రంగ నాధ్ అనందిస్తారు. ఇకపోతే రంగనాధ్ కి సంఘంలో ఉన్న మంచి పేరు ప్రతిష్టని చూసి ప్రియమణిని తన కోడలు చేసుకోవాలని అశించే విలన్ పాత్రలో ప్రదీప్ రావత్ బాగానే నటించారు. అదేవిందంగా కధలో మలుపులలో భాగంగా నమ్మకంగా రంగనాధ్ పక్కనే ఉండే సెక్రెటరీ పాత్రలో చంద్ర మోహన్ అలాగే చంద్ర మోహన్ కొడుకుగా ప్రియమణిని మోసగించి ప్రేమించే పాత్రలో దీపక్ నటన కూడా బాగుంది. ద్వితియార్దంలో వచ్హే చాలా పాత్రలు కొద్ది క్షణాలే కనపడినా కూడా "ఆకాశం నుంచి ..." అనే పాటలో బాగానే అలరించారు.ఆదిత్య పాత్రకి తాతయ్య గా బాలయ్య(పాత నటుడు), మిగిలిన బందువుల పాత్రలలో సన,ఆహుతి ప్రసాద్,సురేఖ,చలపతి రావు, శ్రీనివాశ్ రెడ్డి తదితరులు కేవలం గతం సన్నివేశాలలోనే కనపడతారు. ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణ భగవాన్ మరియూ బ్రహ్మానంధం కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. పాటలు అన్నీ బాగున్నాయి.మణి శర్మ అందించిన సంగీతం కూడా సినిమా విజయానికి దోహదం చేస్తుంది.ప్రియమణికి స్నేహితురాలిగా తమిళ అమ్మాయిగా ముద్దు ముద్దు గా తమిళం తెలుగు కలిపి మాట్లాడుతూ తక్కాలీ(తమిళంలో టమోటా అంట!) పాత్రలో శ్రీలత బాగ నవ్వించింది.  

సినిమా ఇంకా బాగుండాలంటే : బాలయ్య కేశాలంకరణ, దుస్తులు ఇంకా మెరుగుపరిచుంటే బాగుండేది.

కొస మెరుపు: సినిమా కి ' మిత్రుడు ' అన్న పేరు ఏవిధంగా పెట్టారో మాకెవరికీ అర్ధంకాలేదు !బాలయ్య దరించే కడియం అతన్ని కాపాడటం మాత్రం కొంచెం కామెడీనే.

సూచన : ఎన్నికలు వేడి తగింది కాబట్టి ఎండల వేడి తట్టుకోవటానికి ఇంకా వేసవి సెలవల్ని అస్వాదించటానికైనా ఒక్కసారి ' మిత్రుడు ' సినిమా చూడొచ్చు .