Monday, April 26, 2010

ఎవరు యాక్టరు ? ఎవరు ఓవర్ యాక్టరు ? విక్రం Vs అభిషేక్

ఎవరు యాక్టరు ? ఎవరు ఓవర్ యాక్టరు ? విక్రం Vs అభిషేక్ 
హెల్లో!!
నాలాగా మీరూ కూడా మణిరత్నం గారి కొత్తసినిమా "రావణ్" (హిందిలో) "విలన్" తెలుగులో కోసం ఎదురుచూస్తున్నారా ?
నెనయితే ఎప్పటినుండో ఎదురుచూస్తున్నా, సినిమా కధ రామాయణం నుండీ ప్రేరేపింపబడిందని నా ఊహ ! గతంలో కూడా మణిరత్నం తన చిత్రాలు లేదా అందులోని పాత్రలు మన ఇతిహాసల/పురాణాల వలనో ఆదర్శంగా తీసుకుని తీసిన సినిమాలే !! అయితే ఇక ఈ రావణ్ ఎలా ఉంటుందో చూడాలి మరి ?
ఈ చిత్రానికి తెలుగు మరియు తమిల భాషలలో విక్రం కధానాయకుడు కాగా హిందీలో మాత్రం మన జూనియర్ బచ్హన్ అభిషేక్ ... అయితే ఒకే పాత్ర వేరు వేరు నటులు చేసినప్పుడు వారీ మద్య తేడాలని గమనించడం సర్వ సాదారణం కధా అదే ఇక్కడా జరిగింది. ..
ఈ మద్యనే విదుదలయిన ఈ సినిమా తెలుగూ మరియూ హిందీ పోస్టర్లు చూసాక,  ఒక చిన్న ధర్మసందేహం  కలిగింది . కింద ఆ పోస్టర్లు చూసి సందేహం మీరెవరయిన తీర్చగలరు..

Doubt : ఎవరు యాక్టరు ? ఎవరు ఓవర్ యాక్టరు ? విక్రం or అభిషేక్ 
అయితే ఇక్కడ మరో సందేహం ఎమిటంటే ఒకే అభినయం ఇద్దరు నటులనుండీ మణిరత్నం ఎందుకు తీసుకోలేదు అన్నది కొసమెరుపు 

Friday, April 9, 2010

యాక్షన్ సినిమా డైరెక్టరుగా మారనున్న "చీ"దంబరం


యాక్షన్ సినిమా డైరెక్టరుగా మారనున్న "చీ"దంబరం
ఇటీవల జరిగిన దంతేవాడ ఘటనపై ప్రజలంతా ఘాటుగా ఉన్న సందర్బంలో మన చీ-దంబరం గారు మరొక గమ్మత్తయిన ప్రకటన విడుదల చేసి ఎదో దూరపు ఆలోచనా దోరణిని వ్యక్తపరిచారు. ఆ గమ్మత్తయిన ప్రకటన మరేదో కాదు - "మానవ రహిత విమానలతో నక్సల్స్ పై దాడి" అసలు నా అనుమానం ఎమిటంటే ఈయన చేసిన వెధవ పనికి ప్రభుత్వమే హోం శాఖ నుండి తప్పించి మరి ఏ సినిమారంగ శాఖకో వేస్తే అక్కడ తన హస్త లాఘవాన్ని చూపడానికిగానూ ముందు నుంచే మెదడు కి పదును పెట్టే పనిలో పడ్డట్టున్నాడు.

ఈయన చేసిన "మానవ రహిత విమానలతో నక్సల్స్ పై దాడి" ప్రకటన పూర్తిగా చదివిన తర్వతా మనవాడు ఎదో పెద్ద యాక్షన్ సినిమా కి కధ రాస్తూ మధ్యలో గవర్నమెంట్ గుర్తుకి వచ్హి  ఈ అర్దరహిత ప్రకటన చేసాడేమో అనిపించింది. కాలిక్యులేటరు పట్టుకునే చేతులతో కత్తులు దూసే పని చెయమంటే అతను మాత్రం ఎమి చేస్తాడు. నా వరకు నాకు ఇతగాడు ఆర్ధికశాఖలో ఉన్ననాల్లు భలే గౌరవం ఉండేది, ఆ తర్వాత మనవాడు చేసిన ప్రతీ పనీ గాలిదుమారమే.
మొన్నటికి మొన్న బాగా తాగి పడుకున్న KCR చిందులకి కంగారుపడిపోయి కలిసి మెలిసి కమ్మగా బ్రతుకుతున్న అంధ్రా ప్రజానికానికి కుంపటి రాచేసే విదంగా కంపరమెత్తే కబురు ఒకటి చెప్పి కామ్ గా కూర్చునాడు. మనోడి మీద అప్పుడే ఒక తీర్మానానికి రావలిసింది తప్పుచేసా.


ఒక అలోచనా, అవగాహన, ప్రణాళిక ఇంకా అంచనా ఎమీ లెకుండా పంపటంవల్లే సి ఆర్ పి ఎఫ్ దళాలని పొట్టనపెట్టుకున్నాడు, అంతా అయిపొయాక "ఇది నా చెతకానితనం"  అని ఒప్పుకుంటే మాత్రం ఎమి ప్రయోజనం. ఎది ఎమయిన అంత ముఖ్యపదవిలో ఉండి చెపట్టే ఆపరేషన్స్ అన్ని ఇలా కొండెక్కిస్తే ప్రభుత్వం పని గాలిలో పెట్టిన దీపం అయిపొతుంది . 


మొత్తానికి చీ-దంబరంగారూ మీ చేతకానితనానికి చెయ్యెత్తి కొట్టంటం బాగోదు కనుక ఇలా చీ అని సరిపెట్టుకుంటున్నాము  ఇకనయిన మీ యాక్షన్ సినిమా కధలో సన్నివేశాలు మా మీద ముఖ్యంగా నక్సల్స్ మీదా ప్రయోగించవద్దు ఒక వేళ అందులో మాకు అర్దంకాని చిదంబర రహస్యాలు ఎమయిన ఉంటే కాస్త అర్దం అయ్యెటట్టు చెప్పి పుణ్యం కట్టుకోండి. 
ఈనాడులో  మన వాడి చిదంబర ప్రకటన ఇక్కడ చూడండి.  [1]