Thursday, April 30, 2009

నాకు నచ్హిన కవి - శ్రీ శ్రీ శతజయంతి

సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించి కొత్త వంపులు తెప్పించి విప్లవాన్ని రేకెత్తించిన ఓ మహర్షి నీ శతజయంతి సందర్భంగా ఇదే నా నివాళి. "శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు" అని చాటి చెప్పిన మహనీయా ఇదే నీకు నా నివాళి

"తలవంచుకు వెళ్ళిపొయావా నేస్తం
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి ..."

అంటూ స్నేహితుని తలచుకుంటూ మీరు సాగించిన "మహా ప్రస్థానం " నిజం గా మాకు అలుపు తెప్పించ్హేంత ప్రయాశ ప్రయాణమే ఆయినా మాకు ఆ దారిలో కలిగే అనుభూతులు అనంతం- ఓ మహాత్మా.
"నిన్న వదిలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు !
కావున ఈ నిరాశామయలోకంలో
కధనశంకం పూరిస్తున్నాను ..."
అంటూ మీరు చేసిన శబ్ద తరంగాలు ఇప్పటికీ మా చెవిలో రింగు మంటున్నాయి - ఓ మహాకవి .

" నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను ! "
అని మీరు చెప్పినది, మాకు ఎప్పటికీ స్పూర్తిదాయకమే ! అదే మాలో అవేశానికి అద్యం.
"...సింహములాగూ, సివంగి లాగూ,
ఫిరంగిలాగూ, కురంగి లాగూ,
శంఖములాగూ, సర్పము లాగూ, ..."
అంటూ మాపై ఘర్జించి , తూటాలు పేల్చి, బుసలు కొడితే ఆ భయానికి బీతిచెందాము.
"కుక్కపిల్లా,
అగ్గిపుల్లా,
సబ్బుబిళ్ళా -
హీనం గా చూడకు దేన్నీ !
కవితామయమెనోయ్ అన్నీ !! ..."
అంటూ కవులకీ మీరిచ్హిన ధైర్యం - అది మా అద్రుష్టం
"కూటికోసం, కూలి కోసం
పట్టణంలో బ్రతుకుదామని
బయలుదేరిన బాటసారి ..."
అంటూ మమల్ని కదిల్చి వేసారు ...
"భూతాన్ని,
యఙోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను !
స్మరిస్తే పద్యం
అరిస్తే వాద్యం ..."
ఇంతకన్న పదాలేవి, మిమ్ము స్మరించటానికి ?? ఓ మహాకవి !!
"పొనీ పొనీ పోతే పొనీ ..."
"పతితులారా బ్రష్టులార బాదసర్ప ద్రష్టులార !!! ఏడవకండేడవకండి .."

"కొంత మంది కుర్రవాల్లు పుట్టుకతో వ్రుద్దులు ..."

"పొలాలనన్ని హలాలదున్ని ...."

"మనదీ ఒక బ్రతుకేనా కుక్కలవలే, నక్కలవలే ! ...సందులలో పందులవలే .."
"ఏదేశ చరిత్ర చూచినా ఎమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరయాణత్వం .."
"అంతేలే, పేదల గుండెలు ! అశ్రువులే నిండిన కుండలు ! .."
అంటూ బడుగుల బాధని అర్ధంచేసావు.
ఇలా ఎన్నెనో ..... ఎన్నెనో ..... నన్ను కదిల్చివెసాయి ..ఎన్నో రాత్రులు నన్ను అరిపించాయి ...
ప్రపంచమోక పద్మవ్యుహం !
కవిత్వమోక తీరని దాహం !

Wednesday, April 29, 2009

తెలుగు బ్లాగర్లంతా తెలుగులోనే శోదిద్దాం ...Let's search

నాలాగా మీరు కూడా తెలుగు వాళ్ళా ?? తెలుగులో బ్లాగు దైనా రాస్తున్నరా??? పొనీ మీరు ఎక్కువ తెలుగులో చదవటానికి ఇష్టపడతారా ??? మీకు కావల్సినవన్నీ గూగుల్ లోనే వెతుకుతారా ??? కానీ మీరు గూగుల్ శోధన(Search) తెలుగులో చేస్తున్నరా ?? 

శోధన తెలుగులోనే ఎందుకు చేయాలి ?
అంతర్జాలం లో ఉన్న తెలుగులో ఉన్న విషయాల గూర్చి తెలుగు సెర్చ్ ఇంజన్లలో సెర్చ్ చేయగలిగితే అది కేవలం తెలుగులో ఉన్న సంగతులను మాత్రమే చూపగలదు. అలాకాకుండా మనం మాములు/ఇంగ్లీషు గూగుల్ సేర్చ్ వాడితే అది కేవలం అంగ్లం లో ఉన్న విషయాలని అన్నీ చూపుతుంది. దీనివల్ల మనకి కావల్సిన విషయం తెలుగు లో దొరికే అద్రుష్టం చాల చాల తక్కువ. 

ఒక ఉదాహరణ తో మరింత వివరంగా చూపగలను. మీకు వేటూరి గారి గురించి తెలుగులో కొన్ని విషయాలు కావాలి అనుకుందాం ?
వేటూరి జననం అని ఈ లంకే http://labs.google.co.in/transliterated_search/telugu.html లో టైపు చెయండి. ఇది తెలుగులో శోధన కొరకు. లేదా ఇందులో http://www.google.co.in/(ఇందులో కింద ఉన్న తెలుగు బాష ని సెలెక్ట్ చేయండి).

అలాగే
Veturi jananam అని ఈ లంకే http://www.google.co.in/ లో టైపు చెయండి. ఇది ఇంగ్లీషు లో శోధన కొరకు.
ఉదాహరణ 
పైన లంకెను క్లిక్ చేసి చూడండి.
ఇప్పుడు ఫలితాలని పరిశీలిస్తే మనకి కావల్సిన తెలుగు విషయాలు కేవలం తెలుగు శోధనలోనే సాధ్యం అని తెలుస్తుంది. కాబట్టి ఇకనయినా మనకి కావల్సిన విషయలాలని గూగుల్లో తెలుగులోనే శోదిద్దాం.
సహజంగా అంతర్జాలంలో తెలుగులో పొందుపరిచే విషయాలలో(ముఖ్యంగా బ్లాగులలో, తెలుగులో ప్రచురించే విషయాలన్నీ ) తొంబై శాతం విషయాలు యూనికోడ్ అనే ఫార్మట్ ను ఉపయోగించి స్రుజియించ బడినవే,(లేఖినిని ఉపయోగించి రాశినవి కూడా యూనికోడ్ అనే ఫార్మట్లోనే ఉంటాయి ). అందువల్ల మనకి కావల్సిన తెలుగు సమాచారం కోసం మనం ఇక నుండీ తెలుగులోనే శోధిద్దాం.  

చివరిమాట :
నేను రెండు బ్లాగులు నిర్వహిస్తున్నాను ఒకటి "Krishna's page" (English Special) మరొకటి "మనసు - మాటలు" (తెలుగు ప్రత్యేకం).అప్పుడప్పుడూ నా బ్లాగు కి వచ్హే అథిదుల వివరాలు పరిశీలించే క్రమంలో నేను తెలుసుకున్న నీతి ఎమనగా - కేవలం ఇంగ్లీషు లో రాస్తున్న బ్లాగు () కి మాత్రమే గూగుల్ సోధన అథిదులని తెచ్చి పెడుతుంది. అంతకన్న అందమైన, అతి విలువైన; తెలుగులో రాసి విషయాలని పొందుపరిచిన బ్లాగు కి మాత్రం కేవలం " జల్లెడ " లేదా " కూడలి" వంటి మార్గాల ద్వారా మాత్రమే అథిదులు వస్తున్నారు. తెలుగులో బ్లాగులని నిర్వహిస్తూ జల్లెడ వంటి వెబ్ సైటు లలో సభ్యత్వంలేని ఎంతో మంది తెలుగు రచనకారులు ఈ నవప్రపంచపు వెలుగులని చూడలేక పోతున్నారు. ఇలాంటి తప్పిదాలని మనంతట మనమే సరిదిద్దుకోవాలి - మనకి కావల్సిన ఏ తెలుగు సంబందిత విషయానికైన మనం తెలుగులోనే శోధించాలి దీనిద్వారా "తెలుగు" బాషా ప్రాచుర్యాన్ని, ప్రతిపత్తిని మనం అంతర్జాలంలో మరింతగా ఇనుమడింప చేయగలం. గూగుల్ వెతుకులాట కేవలం ఇంగ్లీషు బాషకే అలవాటుపడ్డ మనం, కావల్సిన ప్రతీ విషయాన్నీ కేవలం ఆంగ్లం లోనే శోధిస్తున్నాం.తద్వారా మనకి కావల్సిన మరియూ అందుబాటులో ఉన్న అతివిలువైన విషయాన్ని కూడా మనం మిస్స్ అవుతున్నాం.కానీ సంకేతికి సంబందిత తదితర విషయాలు కోసం తెలుగులో శోధన మంచి ఫలితాలని అందిచాలంటే మరికొంతకాలం వేచిచూడాల్సిందే !!
కాబట్టి ఇకనైనా తెలుగు బ్లాగర్లంతా తెలుగులోనే శోదిద్దాం ...తెలుగుతనాన్ని సాధిద్దాం
Let's search in Telugu ...Let's do it.

Monday, April 27, 2009

' ఆధినేత ' కాలేకపోయిన ' సామాన్యుడు '

సామాన్యుడు లాంటి ఒక మంచి సినిమాలో నటించిన మన జగపతి బాబు ఈ సారి అధినేతగా ముందుకు వచ్హి నన్ను నిరుత్సాహ పరిచాడు. దర్సకత్వం ' సముద్ర ' అని ముందే తెలిస్తే సినిమా చూడటానికి కొంచెం సందేహించేవాడినేమో? కనీసం ' నవతరంగంలో ' రివ్యూ చదివినా బతికే వాడిని ...మొత్తానికి బలి. అయినా అన్ని తెలుగు సినిమాలని ఆదరించే నాలాంటి అమాయకులకి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదులెండి.

ఆంధ్రాలో ఎన్నికల హడావిడి - వాతావరణంలో వేడి రెండూ కాస్త చల్లబడ్డాయి కధా అని సరదాగా సినిమా కి బయలుదేరాను.మధ్యలో ఎందుకో కాఫీ - డే కనపడితే ఒక Cafe Frappe(Ice cream and coffee blended to smooth, creamy perfection - Irish style) తాగేసి సినిమాకి బయలుదేరదాం అని నా పల్సర్ కి ఒక బ్రేకు వేసా.

అలా కాఫీ ఆర్డరు ఇచ్హానో లేదో ఇంతలో "తూ మేరి అధూరి ప్యాస్ ప్యాస్ ..." అంటూ పాట వినపడింది. ఎదో అలోచనలో ఉన్న నాకు, నా ఫ్రెండు " ఓరే నీ ఫొనేరా రింగ్ అవుతుంది, దాని బాధ చూడు అన్నాడు". ఫొన్ లిఫ్ట్ చెస్తే అవతలివైపు నా మరో ఫ్రెండు... ( ఫ్రె = ఫ్రెండు,నే = నేను )

ఫ్రె : మామా ఎక్కడ ఉన్నవ్ ???
నే : కాఫీ డే రా !!
ఫ్రె : ఏంటి కధ? ఉదయంనుండి ఎమిచేసావ్ ?
నే : ఎముందిరా రొటీన్ వీక్-ఎండ్ రా. బాగా లేట్ గా లేచి ఇందాకే లంచ్ చేసి సినెమాకి అని బయలుదేరాం. మద్యలో కాఫి కి ఆగాం.
ఫ్రె : కొంప తీసి ' అధినేత ' సినిమాకా ??
నే : కొంపలు గట్రా తీయలేదుగని జస్ట్ పర్స్ తీసుకుని బయలుదేరాం రా అంతే ! అయినా బెంగుళూరులో ఇంక కొత్త తెలుగు సినిమాలు ఎమీ లేవు కధరా ?
ఫ్రె : అదిసరే బాబాయ్ ఇప్పుడు నీకు ఆ సినిమా ఆవసరమా అని ?
నే : అదేంటిరా అంత మాట అన్నావ్ ? బెంగుళూరులో ఉంటున్న ఒక అంధ్రుడుగా రిలీజు అయిన తెలుగు సినిమా చుడటం నా హక్కు !!
ఫ్రె : అది కాదు చిన్నా !! ఇప్పుడే ఆ సినిమా హాలులోనుండీ బయటకు వస్తున్నా, అంత విషయం లేదు లేరా !! 
నే : ఏదిఎమయిన " తెలుగు సినిమా నా జన్మ హక్కు " నేను వెళ్తున్నా, ఫోన్ పెట్టెయ్ మళ్ళీ టికెట్లు దొరకవ్ !!
ఫ్రె : ఒరేయ్ అక్కడ అంత విషయం లేదు రా !! హాలు అంతా కా...కుయ్ కుయ్
(వెధవ కంగారు ఎదుటి వాడి మాట సరిగా ఎనాడయినా వింటేనా !!) విని ఉంటే బతికి పోయేవాడిని ...

ఫోన్ పెట్టేసి, బిల్లు కట్టేసి, బండి తోలేసి మొత్తానికి ట్రాఫిక్ బారిన పడకుండా థియేటరు చేరాము.టిక్కెట్లు ఎక్కడ దొరకవో అన్న ఆదుర్దాతో మా ఫ్రెండు ఒరే నువ్వు బైక్ పార్క్ చేసి వచ్హేయ్ నేను టిక్కెట్స్ కొంటాను అన్నాడు !! సరే అని నేను ఆ పని చేసి వచ్హా. టికెట్లు దొరికేసాయి రా !! నో ప్రాబ్లం (ఏదో సాధించేసినట్టు!).నంబరింగ్ లేదు రా, త్వరగా పద, ఫ్యాను కింద కుర్చుందాం అంటూ మావాడు తొందర చేస్తే లోపలికి వెళ్ళాము.

ఫ్యాను కింద కుర్చున్నంత మాత్రాన చల్లగా ఉంటుందనుకున్న మా అమాయకత్వానికి సరి అయిన గుణపాటం ఈ సినిమా అని బయటకి వచ్హేటప్పుడు అర్దం అయ్యింది.

సినిమాలో ముఖ్యాంశాలు :
  • సూపర్ స్టారు కృష్ణ డాన్స్ లకి ట్రేడ్ మార్కుగా చెప్పుకునే మన జగపతి డాన్స్ లు,నడకలు .
  • జగపతి బీచ్ పాటలు బాగుంటాయి కదా కనీసం హేరొయిన్ ని అయినా చుద్దాం అనుకుంటే తప్పులో తలున్నట్టే ! తలలో తప్పేమో ?? ఎదో ఒకటి. 
  • ఆంధ్రా సి.ఎం గారిని ఎర్రని, పచ్హని కోట్లు వేసుకున్న ఒక వెరయిటీ డ్రెస్సులలో చూడాలి అనుకుంటే ఇదే మంచి సినిమా.
  • హేరో కోపం ఫైటు తో కాక విలన్ కొత్త ఇంటి ని ఒక శౌచశాల గా వాడుకుని తగ్గించుకునే ఒక విబ్బిన్నమయిన సన్నివేశం కావాలా ?
  • ఆంధ్రాకి సి.ఎం అయ్యాక అతనికి పెళ్ళయితే ? (రెండో పెళ్ళి కాదు మొదటిదే).
  • శ్రీకాంత్ దేవ పెద్ద కష్టపడకుండా కాపీ సంగీతం అందించారు !! (మొనాలిసా అన్న పాట మద్యలో ఒక ట్యూన్ ఒక పాత పాటని(ఉహ్ ఉహు ..సరిగమ విన్నావ ?? ) స్పురించింది. మిగిలిన పాటలలొ సైతం ) 
  • సినిమా దర్శకుడు దీనికన్నా ముందు ఒకే ఒక్కడు అన్న ఒక అద్బుతమయిన సినిమా ఉంది అని మర్చి పోయాడేమో !
మొత్తానికి సామాన్యులకి ఎన్నికల వేడి తగ్గించకుండా ఎన్నికల ఫలితాల వరకైనా ఈ ' అదినేత ' అలరిస్తాడు అందామంటే నోరురావటం లేదండి!

Tuesday, April 14, 2009

ఎన్నికలకు ఎన్ని కళ్ళో !!!

ఎన్నికలకోసం ఎన్నో కళ్ళతో నాలా ఎదురు చుసే సామాన్య ఓటరు ప్రజలు ఈ భారతావనిలో చాలా మందే ఉంటారు. ఇలాంటోళ్ళకి ఎన్నికలొస్తే వ్రుత్తిరిత్యా పొరుగూరిలో ఉంటున్న నాలాంటి ఔత్సాహిక ఓటరు మనసు ఎంత కుత కుత లాడిపొతుందో నాకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది. ఈ భాధ అంతా కేవలం "ఓటు" అనేది నా ప్రాధమిక హక్కు అన్న స్వార్ధం. ఈ స్వార్ధం లో చాలా అర్దం ఉంది. దీన్ని ఎవ్వర్రు మార్చలేరు.

నాలాగా నాతో బెంగుళూరు లో నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. అందరకీ ఒకే భాధ, ఒకే అలోచన, ఒకే గోల. వెళ్ళాలి ఓటు వెయ్యలి !

నా చిన్నతనంలో కేవలం ఓటు వేయటం కోసం మా అమ్మో, మా మావయ్యో ఇంకా ఎవరయిన చుట్టాలు ప్రయాణాలు చేస్తూంటే నాకు అర్ధం అయ్యేది కాదు అందులోని అంతరార్ధం. ఓటు అన్నది ఎంత ముఖ్యమయిన భాధ్యతగా వాళ్ళు గుర్తించి ఉంటే దాని నిర్వహణకి అంత ప్రయాసపడగలరు ? వారికి ఉన్న ముందు చూపూ, భాద్యత అయినా మా తరానికి లెవేమో అన్న అందోళన నన్ను కదిల్చివేస్తుంది.

రాజకీయాలపైన అవగాహనా,జీవితంపైన అలోచనా ఇంచుమించుగా ఒకేసారి వచ్హే నాలాంటి కుర్రవాళ్ళ పరిస్థితి నిజంగా "అడకత్తెర లో పోక చెక్క" అంటే నమ్మండి. ఒక పక్క ఎలక్షన్ తెదీలు దానికి సంబందించిన మన ప్రియతమ నాయకుల అభ్యర్దనలు మరోపక్క ఆఫీసులో పని.దేనిమీద బుర్ర ఉంచాలో తెలియని పరిస్థితి నాకు.

అర్దికమాంద్యం దెబ్బకి ఆఫీసులో గుండెలు గుప్పెట్లో పెట్టుకుని పని చేసుకునే సాఫ్ట్ వేరు ఇంజనీరుల బాధలే వేరు. ఒక ఈ-మెయులు చదువుదామని చుస్తే ఎలక్షన్లు గురించే, మొబైలు లో మెసేజి కూడా మన చంద్రబాబు పంపిందో లేక బారతీయ జనతాపార్టీ పంపిందో!. ఏది చూస్తున్నా ఎన్నికలకి సంభందించే!! ఇన్ని అలోచనల మధ్య ఆఫీసులో పని చెయ లేక సహొద్యొగులతో కాసేపు అలా మేడపైకి టీ తాగుదామని వెళ్ళినా అక్కడకూడా ఇదే; మనం మాట్లాడక పోయిన మనపక్క టేబుల్లో కూర్చున్నోల్లు "జయలలిత గెలుస్తుందా?" (తమిళంలో - இம்முறை தேர்தலில் ஜெயலலிதா விற்கு வெற்றி உண்டா இம்முறை தேர்தலில் Dr.ஜெயலலிதா விற்கு வெற்றி உண்டா !! )అనో లెకపోతే, కన్నడంలో(ಹೂ ವಿಲ್ ವಿನ್ ಇನ್ ದಿಸ್ ಎಲೆಕ್ಶನ್ಸ್?) ఈ సారి ఎవరు గెలుస్తారనో?? ఎదో ఒక ప్రతీపాదన చేస్తూనే ఉంటారు. అది ఎదో మనల్నే అడిగినట్టూ మనసు దానికి సమధాన్ని మన పక్కన వాళ్ళకి మాటలలో ఇచ్హేస్తుంది.

ఎదో కావల్సివచ్హి ఆఫీసులో పని నిమిత్తమై ఎదో వెబ్ సైటు చుస్తున్నా సరే మన అద్వాని గారి వెబ్ సైటు యాడ్నో లెకపోతే ఇంకో రాజకీయ పార్టీ యాడ్నో ఎదో ఒకటి కంటపడి మరీ చంపేస్తున్నాయి.
మనసాగక ఇంటికి ఫొన్ చెస్తే అంతా ఎన్నికల హడావిడిలో తలమునకలై ఉన్నాం అంటుంటే, ఎదో మిస్స్ అవుతున్నాం అన్న భాధ.

కాసేపు టీవీ చుద్దాం కదా అని టీవీ పెడితే మన మ్రుత్యుంజయుడు జు. NTR ఇక్కడ సైతం తన ఆరొగ్య పరిస్థితి పూర్తిగా నయం కాకపొయిన, మంచం మీద పడుకుని మరీ అదే ఉత్సాహంతో పిచ్హి పిచ్హి గా ప్రచారం చేస్తూ కనపడుతుంటే, మనకి మన బాధ్యత మరింతగా గుర్తువస్తుంది.మాములు రియాలిటి డాన్సు, పాటల కార్యక్రమాలలో సైతం "మీ ఓటు మీరు వేయండి" అని మరీ గుర్తు చేస్తున్నారు.

ఇంత మదనపడే గుండెకి ఈసారి ఓటు అన్నది ముఖ్యం అని అర్దం అయిపొయింది కాబట్టి ఎలాగయిన నాఓటు వినియోగించుకుని తీరాలి అని గట్టి నిర్ణయానికి వచ్హెసా . శాసన సభ ఓటు - లోక్ సత్తా కి మరియు లోక్ సభ ఓటు తెలుగుదేశం కి అని నిర్ణయించుకున్నా.మరి మీరు ??

Monday, April 13, 2009

యువతా!!! బ్లాగ్ అంటె?

యువతా!!! బ్లాగ్ అంటె?( Youth!!! blog means? ) - Inspired by Sri Sri's "బుక్కులు" - "కుక్క పిల్లా, అగ్గి పుల్ల ..." | Krishna's page


ఎదో తెలియని అవేశం, అందులొనే అనందం.ఆనందాన్ని పంచుకుంటెనే దానికర్ధం. ఆ కవితలలో ఘాటు అప్పుడప్పుడు నషాలానికి అంటి కుదురుగా కుర్చోనివ్వటం లేదు.మనసులో అలలు అనే అలోచనలకి సైతం ఉవ్వెత్తున లేచే కెరటం అంత ఊపు నివ్వాలంటే అది నావరకూ శ్రీ శ్రీ కవితలే !!!  

తెలుగు తెలిసిన వారు మాత్రం ఆ పైన ఇచ్హిన లింక్ క్లిక్ చేయగలరు.

Friday, April 10, 2009

ప్రెమే పెళ్ళయుతే ??

If love becomes marriage ?? ( ప్రెమే పెళ్ళయుతే ?? ) | Krishna's page
కొంత కాలం క్రితం నా ఇంకో బ్లాగులో రాసిన తెలుగు టపా కి ఇక్కడ లంకె ఇస్తున్నా , చదివి మీ అభిప్రాయాలు తెలియచేయగలరు.
If love becomes marriage ?? ( ప్రెమే పెళ్ళయుతే ?? ) | Krishna's page

Wednesday, April 8, 2009

బూటు గొప్పా ? పెన్ను గొప్పా ?

బూటు గొప్పా ? పెన్ను గొప్పా ?
"The pen is mightier than the sword" ఈ అంగ్లసామెత నేను చిన్నతనం లో చదివినది. ఎందుకో తెలియదు గాని నాకు ఇది బాగా మనసులో ముద్రించుకుంది. దీని అర్దం ఎమిటంటే రాజు గారి కత్తి తో చేయలేనిది కూడా కవి కలం తో సాధించగలడు అని.ఆది నా మనసులో అంత బలంగా ఉండటంవల్లనే నేను ఎప్పుడూ నా కలానికి పదును పెడుతూ ఉంటా.కానీ ఈ మద్య జరిగిన ఒకటి రెండు వాస్థవ సంఘటనలు మీ-నా బలమయిన నమ్మకాలకు సైతం గుబులు పుట్టిస్తున్నాయి.నాకు జర్నలిస్టులు అంటే బలే గౌరవం. ఒక విషయం క్షుణ్ణంగా తెలుసుకుని, దాన్ని పది మందికి అర్ధం అయ్యెట్టూ చెప్పటంలో వీరికి వీరే సాటి.మనదేశం లోనే కాదూ ఈ ప్రపంచంలోనే ఎంత ముఖ్యమయిన ప్రదేశానికైన సునాయాసంగా ప్రవేసానుమతి లభించేది కేవలం ఈ జర్నలిస్టులకే.వీరు రాసే ప్రతీ అక్షరం ప్రజలకు మేలుకొలుపు. అందుకనే వీరి కలానికి ఉన్న పదును-పాటవము ఇక దేనికీ ఉండదు. ఇది అంటే ఎంతటి వారయినా జడవాల్సిందే. అలాంటిది ఇంత బలం ఉన్న పెన్ను వదిలి ఒక జర్నలిస్టు తన బూటుకి ఎందుకు పనిచెపుతున్నాడు? వీళ్ళు పెన్ను వదిలి బూటు ఎందుకు చేతిలోకి తీసుకుంటున్నారు?

దేనండి నేను చెపుతూన్నది నిన్న జరిగిన సంఘటన గురించి.సరిగ్గా ఇలాంటిదే ఆ మద్య ఇరాక్ లో ఒకటి జరిగింది.

Muntazer al-Zaidi, అనే ఒక ఇరాక్ జర్నలిస్ట్ అమేరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ గారి మీద తన బూటు విసిరి నిరసన వ్యక్తపరిచారు.2003 నాటి ఇరాక్ పై దాడులకు కారణం బుష్ అని, అక్కడి ప్రజల విస్వాసం కావటంతో ఈ జర్నలిస్ట్ చర్యని అక్కడి ప్రజలు శ్లాగించారు.ఈ విధం గా తాను బుష్ పై బూటు విసరటానికి ఎప్పటినుండో తయారవుతున్నాడు అని తన తోటి ఉద్యోగులు చెప్పటం నిజంగా గమనార్హం. ఇది అంతా కేవలం తన దేశ భక్తిగా భావించినా కూడా ఆ విధంగా మరొక దేశాద్యక్షుడిపై బూటు విసరటం అన్నది అదీ తను విధి నిర్వహణలో ఉన్న విషయం మరిచి అన్నది చర్చనీయాంశం.


తేది : 7 ఎప్రిల్ 2009
కేంద్ర హోం మంత్రి చితంబరం గారి మీద ఒక సిక్కు జర్నలిస్టు (Jarnail Singh) తన బూటుని విసిరి తన అసహనాన్ని వ్యక్తపరిచారు. 1984 సిక్కుల పై దాడికి సంబందించిన కేసులో నింధితులకి(Jagdish Tytler, Sajjan Kumar) కోర్టు ఇచ్హిన తీర్పుని చితంబరం విశదీకరిస్తుండగా జరిగిన ఈ సంఘటన కి కారణం కేవలం ఆ శిక్కు జర్నలిస్టుకి తీర్పుపై ఉన్న అస్సమ్మతి భావమే అని అర్దం అవుతుంది.

ఈ రెండు ఘటనలలోనూ జర్నలిస్టుల పనిని పొగిడే వర్గం లేకపోలేదు.నా వరకు నాకు -
"జర్నలిస్టులు వార్తలని అందచేయాలే కానీ వారే వార్త కాకుడదు."
ఇకనయినా జర్నలిస్టులు తమ బాధ్యతెరిగి, తమ హోదా గుర్తుంచుకుని దానికి తగట్టూ నిబద్దతతో పనిచేస్తూ,ఇటువంటి దుశ్చర్యలకి దూరంగా ఉంటారని తమ మంచి పేరు కాపాడుకుంటారనీ భావిద్దాం.


దీనికి సంభందించిన మరిన్ని లంకెలు : [1] [2] [3] [4] [5]

Tuesday, April 7, 2009

ఎందుకు రాస్తున్నా ?

అసలు ఈ "మనసు - మాటలు" ఎమిటీ ?

ఎముంది ఇది నా బ్లాగు.నా మనసునీ, దాని మాటలనీ, అక్షర రూపంలో మీఅందరితో పంచుకుందామనే నా ఈ "మనసు-మాటలు". నా మనసులోని మాటలు మీ మనసులకి దగ్గర అవ్వాలని నా ఆకాంక్ష. నా బ్లాగు నా కొసమే కాదు, ప్రజలందరికీ కాక పొయినా అంతర్జాలం ఉపయొగించే కొద్దిపాటి జనానికైనా కొంతైనా ఉపయొగపడుతుంది అని ఒక చిన్న ఆశ.ఒక సమస్య సాధనలో నేను తెలుసుకున్న సులువయిన మార్గాన్న్ని తోటి వారి అవసరార్దం తెలియచెప్పటం లో ఆనందం అనంతం. నాకు తెలిసినదాన్ని తోటి వారికి తెలియజెప్పాలి - అది వారి విలువైన సమయాన్ని కాపడుతుంది అన్న చిన్న అలోచనే ఈ "మనసు - మాటలు".

ఆసలు అంతర్జాలం ఉపయొగించే వారికి ఎలా ఉపయొగపడుతుంది?
ఈ బ్లాగు అంతర్జాలం లో ఒక బాగం అయినందున, అందునా దీన్ని మన తెలుగు బాష లో రూపొందించినందున ఎదైనా విషయార్దమై వెతుకులాట చెసే వారికి, ఇక్కడ దొరికే కొద్ది పాటి సమచారం అయినా వారి విలువైన సమయాన్ని కాపాడగలుగుతుంది అని నా అభిప్రాయం.

ఏముంది ఈ బ్లాగు లో ?
నా బ్లాగు లో ఇది - అది అంటూ ఒకే ఒక దాని పై కాక నా మనసులో మెదిలే ప్రతీ అలోచనకు అక్షరరూపాన్ని సంతరించుకుంటుంది. నాకున్న బహువిధమైన - బహువిషయముల పట్ల అసక్తి వల్ల నేను పలుఆశాంలపైన ఇక్కడ చర్చించదలిచాను. దీనివల్ల నా బ్లాగు పాటకులకి సైతం విబ్బిన్న విషయాల పై ఒకేదగ్గర సమాధానలు దొరకగలవు.అంతేకాక ఇది పాటకులకి కూడా పూర్తి ఆసక్తి ని కలిగిస్తుంది.ఆనట్టు ఇక్కడ పొందుపరిచే ప్రతీ అక్షరము నా మనసులొని మాట అయినందున నా పాటకులను అదే విషయంపై వారి అభిప్రాయాలని తప్పని సరిగా చెప్పాల్సిందిగా ప్రార్దిస్తున్నాను.ప్రతి టపా పై కనీసం ఒక్క మీ ఆభిప్రాయం అయినా సరే నా అలోచనాఢొరణికి కొత్త దారులను చూపగలదు.తప్పక మీ అభిప్రాయలని తెలియ చెస్తారు అని భావిస్తూ

మీ
కృష్ణ

చిరంజీవి కి కోడి గుడ్లు - బాలయ్య కి చెప్పులు - జగన్ కి గుడ్లు, చెప్పులు - ఎన్.టి.ఆర్ కి యాక్సిడెంటు

చిరంజీవి కి కోడి గుడ్లు - బాలయ్య కి చెప్పులు - జగన్ కి గుడ్లు, చెప్పులు - ఎన్.టి.ఆర్ కి యాక్సిడెంటు
ఎన్నికల కోసం ఎన్నో కళ్ళతో సమాన్య ఓటరు తో పాటు గా ఎన్నో పెద్దతలకాయలు కూడా ఎంతో కుళ్ళు తో ఎదురుచూస్తున్నాయి. "ఇల్లు కాలి ఒకడు బాధ పడుతుంటే, ఛుట్ట కి నిప్పు అడిగినట్టుగా ... "ఓటు వెయడానికి ఓటరు బాద పడుతుంటే" తినటానికి తిండి ఇస్తాం, తాగడనికి బీరు ఇస్తాం, చూడటానికి కలర్ టీ.వి ఇస్తాం అంటూ అఖరికి పోలింగు బూతు కి వెల్లటానికి ఆటో కూడా పంపిస్తాం ఎలాగైన వచ్హి మా చేతి మీదో( కాంగ్రెస్ ), మా సైకిలు మీదో( టి.డి.పి ) , మా రైలు మీదో ( పి.అర్.పి ), ,మా పువ్వు మీదనో ( బి జె. పి )లేకపొతే కనీసం మా ఈల మీద( లోక్ సత్తా ) అయినా ఒక గుద్దు గుద్ది వెల్లండి అంటూ కాల్లా వెల్లా పడుతూ పార్టీ నాయకులు వీది కుక్కల్లా తిరుగుతున్నారు.

ఎర్రటి ఎండల్లో ఎంచక్కా ఏ.సి వేసుకుని ఇంట్లో పడుకోగలిగి కూడా, ఇంకా ఎదో సంపాదించాలి అన్నట్టు తెలిసినా - తెలవక పొయినా, వచ్హినా - రాకపొయినా ఎదో ప్రజల మద్యలోకి వెల్లి మరీ అన్న కోసం ఒకడు, మామ కోసం ఒకడు, తండ్రి కోసం ఇంకొకడు అఖరుకి ఆడపిల్లని ఇచ్హిన పాపానికి సదరు వియ్యంకుని కోసం సైతం చెప్పు దెబ్బలు తినటానికి సిద్దం అవుతున్నారు అంటే వీల్లకి నిజంగా ప్రజల పట్ల ఇంత ప్రెమో లేక వాల్ల వాల్ల బందు గణం అధికారం లోకి వస్తే రాష్త్రాన్ని రాచి రంపాన్న పెడదామనో అర్దం కాని అయొమయ స్థితి లో ప్రజలు బెంబేర్లు ఎత్తుతున్నారు.

ఏ వెర్రి ఓటరు కి ఎమయిందో తెలీదు గాని ఆ నిమిషం లో ఒక్కో నాయకుడుని ఒక్కో లా స్వాగతించారు.
ఎన్.టి.ఆర్ కి యాక్సిడెంటు తో సరిపొతే అంత కన్నా పెద్ద గాయాలు జీవితం లో మర్చిపొలేనివి గా మన చిరంజీవి గారికి కోడి గుడ్లతోనూ, బాలయ్యకి చెప్పులతోనూ, జగన్ బాబు కి వెరె ఎదో తెలీదు గాని మొత్తానికి ప్రజల సత్కారాలు అందాయి.

"కంద కి లేని దురద చేతి కి వచ్హినట్టు" అసలు నాయకులు పుట్టలో పాములు లాగా పనిచూసుకుంటుంటే అభం - శుభం ఎమీ ఎరుగని మన ప్రియతమ సినీ హీరోలు మాత్రం గోర అవమానాలకి గురి అవ్వటం చాలా బాదాకరం.
పాపం మా జయ ప్రకాశ్ గారు అంత ప్రజ్ఞ - పాటవాలు ఉండి ప్రజలకి మేలు మాత్రమే చెయాలనె ద్రుక్పదం ఉండి కూడా- ధనాన్ని వ్రుదా చెయకుండా; అది కూడా ప్రజలకి ఎదొ ఒక లాగా ఉపయోగపడాలి అని ప్రచారం సైతం రైలు లో కానిచ్హేస్తున్నారు. కనీసం పార్టి మొత్తం కాక పొయినా అయన అయినా గెలుపొందాలని అకాంక్షించే కళ్ళు ఎన్నో!!

ఇకనయినా మన మెధావి నాయకులు అయిన రెడ్డిగారి, బాబు గారి మాటలు
వినటం మానేసి మనొళ్ళు, సారీ వాళ్ళ, వాళ్ళ బంధుగణం ఇక నయినా ఎవరి పని వాల్లు చేసుకుంటే చాల బాగుంటుందేమో? కనీసం చెప్పు దెబ్బలు అయినా తప్పుతాయి. మరి మీరు ఎమంటారు ?

Monday, April 6, 2009

మొదటి ఆడుగు - మొదటి టపా

ఓం నమే గణేశాయ నమ:

మొదటి ఆడుగు - మొదటి టపా
ఈ బ్లాగు లో ఇదే నా మొదటి టపా . ఏన్నో రోజుల నుండి పూర్తి స్థాయి తెలుగు బ్లాగు ప్రారంభించాలని కోరిక. ఏందుకో తెలీయదు అది ఈ రొజే కార్యరూపం దాల్చింది. మంచో-చెడో మొదటి ఆడుగు అన్నది చాల ముఖ్యమయినది. ఏది అయితేనెం, ఇక నా అడుగులు, పరుగులు అవ్వాలని ఆకాంక్షిస్తూ నా బ్లాగు ని ప్రారంభిస్తున్నాను . నా పాత బ్లాగు(లు) "క్రిష్ణ పెజి " ని ఆదరించినట్టె ఈ బ్లాగు ని సైతం అదరిస్తారని అశిస్తూ -

మీ

క్రిష్ణ.