Monday, June 29, 2009

బలే బలే బాల్యం ...


బలే బలే బాల్యం ...

నాన్న తెచ్హిన రిమోటు రైలు
అమ్మ చేసిన తొక్కుడు లడ్లు
అక్క ఇచ్చిన అయస్కాతం
స్నేహితుడు పంచిన పిప్పరుమెంటు

అమ్మమ్మ చేసిన అరిసెలు
తాతయ్య కొట్టిన ముంజెలు
మావయ్య పాడిన పాటలు
పాలేరు తీయించిన పరుగులు

నాన్న నేర్పిన ఎక్కాలు
మాష్టారు నేర్పిన పద్యాలు
బళ్ళో గీసిన బొమ్మలు
పోటీలో పొందిన బహుమతులు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
స్కూలికి కట్టిన రంగుల జండాలు
దెబ్బలు తగిలిన కబాడీ ఆటలు
కప్పులు తెచ్హిన వక్రుత్వ పోటీలు

జేజమ్మ ఇచ్హిన జామకాయలు
పెద్దమ్మ పెట్టిన పులిహోరన్నం
పెరటిలో దొంగిలించిన మామిడికాయలు
పాత చెరువులో పట్టిన చేపలు

బోరు బావికాడ చేసిన స్నానాలు
నల్లతుమ్మ చెట్టుకింద పట్టిన కుస్తీలు
తోటలో ఏరిన జీడిమామిడి గింజలు
ఇంటివెనుక ఇసుకతో కట్టిన గూళ్ళు

తాతయ్య చెప్పిన రాజుల కధలు
అత్తయ్య తీసుకెల్లిన తెర సినిమా
అమ్మమ్మ వినిపించిన భగవద్గీత
అక్కయ్య ఆడించిన వైకుంపాళి.

పాత సినిమాల్లో పాటలు
అయస్కాంతంతో ఆటలు
ఏటిగట్టుపై ఇసుకలో సైకిలు పోటీలు
వానవెలిసాక నీటికుంటలలొ వేసిన గంతులు

భొగిమంటలకై పోగెసిన దుంగలు
దీపావళికి చేసిన సిసింద్రీలు
హోళీ పండుగకి తగిలిన గుడ్లు
శ్రీరామనవమికి వేసిన పందిళ్ళు

ఇంకా ఇంకా ...ఎన్నో ఎన్నో ...

కళ్ళ వెనుక కాంతి చాయలు
యదపై గుర్తులైన గాయాలు
కంటిపై కునుకెరుగని కలలు
మనసులో మరుపెరుగని ముద్రలు

బాల్యం అంటే కాదు బలి, అది ఎవ్వరికైనా బలే బలే !

Friday, June 19, 2009

నా కలల రాణి!

నా కలల రాణి!
పువ్వులలో నవ్వువో
నవ్వులలో సిరివో

చీకట్లో వెలుగువో
కొవెల్లో దివ్వెవో

కావ్యంలో కన్యవో
కన్యలలో "కావ్య"వో

తారలలో తళుకువో
మబ్బులలో మెరుపువో

తొలకరిలో జల్లువో
జల్లులలో చినుకువో

కడలిలో ముత్యానివో
ముత్యాల మెరుపువో

నాకళ్ళలో వెలుగువో
నాకన్నీటిలో నీలానివో

సుగంధంలో పరిమళానివో
మల్లెలలో సువాసనవో

కొమ్మల్లో కోయిలవో
హరివిల్లులో రంగువో

గోదావరిలో అలవో
నా నిన్నటి కలవో

నాకోసమే పుట్టి; నాకే తెలియకుండా దాగున్నావా ?
కలలోనే కనిపిస్తూ నన్ను కవ్విస్తున్నావా ??

Monday, June 1, 2009

Bangalore to Hogenakkal route - Bike ride - హొగ్నేకల్ ( తమిళకర్ణాటక )

హొగ్నేకల్ ( తమిళకర్ణాటక )
ఇంగ్లీషు లో వివరణ కోసం ఈ లింకు చూడండి.
గమనిక :
కింద "ఫొటో షో" లోడ్ అయ్యే వరకూ వేచి యుండిడి.
నిన్న అంటే 30 మే 2009 మా ఫ్రెండ్స్ తో కలిసి ఒక అద్భుతమయిన జలపాతం చూడటానికి వెళ్ళాము, అదే "హొగ్నేకల్" జలపాతం. అక్కడ ఎవరో దీనిని "భారత నయాగరా " అని అభివర్ణించటం విన్నాను, ఆ మాట అతిశయోక్తి కాదేమో అని అనిపించింది. ఎందుకంటే చూసిన తర్వాత ఎవ్వరయినా ఆ మాట అనాల్సిందే. ఎందుకో తెలీదు నా బండి మీద అలా అలిసిపొయే వరకూ ప్రయాణంచేసి చాలా రోజులయ్యిందనిపించింది;ఎప్పటినుండో హొగ్నేకల్కి వెళ్ళాలని వేచియున్న నాకు ఇదే మంచి తరుణం అనిపించింది. ఒక్క క్షణం కూడా అలోచించకుండా ఈ జలపాతం గురించి గూగుల్లో సమాచారం సేకరించి, అదే విషయాలని కొంచెం మసలా జోడించి స్నేహితులకి ప్లాను అంతా ఈమెయులు చెసేసా. ఎవ్వరూ రిప్లయ్ ఇవ్వకపోయే సరికి పట్టువదలని విక్రమార్కుడిలాగా వెంటనే ఫొనులు మీద ఫొనులు చేసి హింసించి ఈ అఖస్మాత్తు ప్రయాణానికి సిద్దం చెసేసా.మేము మొత్తం ఎనిమిది మంది నాలుగు మోటారు వాహనాల మీద వెళ్ళాలని నిర్ణయించి, బళ్ళని యాత్ర కి ముందు రోజే సిద్దం చేసేసాము.
బెంగళూరు నుండి ఈ ప్రాంతానికి చేరటానికి అతి దగ్గరి మార్గం మేము మా ప్రయాణానికి ఎంచుకున్నాము.

హొగ్నేకల్ గురించి మరిన్ని విషయాలు ఇక్కడ చూడండి :
హొగ్నేకల్


మేము ప్రయాణిచిన మార్గం : బెంగుళూరు - అత్తిబేలి - మత్తిగిరి - దెనకనికొట్టై - హొగ్నేక్కల్
దూరం : బెంగుళూరు - కోరమంగలా నుండీ సరిగ్గా 121 కిలోమీటర్లు
దారి అడవి మార్గం అయినందున మొత్తం ఘాట్ రోడ్డు.
జడపిన్ను మెలికలతో హొయలు ఒలికే ఆ రోడ్డు మీద,
తొలకరిజల్లులతో పరవసించి పచ్హగా మారిన చెట్ల మద్య,
అంతంటులేదు అనంతమే హద్దు అనట్టున్న లోయల మీదుగా ,
నీకూ తోడున్నా అంటూ వస్తున్న స్నేహితుల నడుమ,
నేను లేనిదే నీవు లేవు అని ఘీంకరిస్తున్న మా బైకు శబ్దాలతో,
సెలయేర్ల ప్రక్కగా సాగిన మా ఈ ప్రయాణం నిజంగా ఒక మరుపురాని ఙ్నాపకం.


అప్పుడెపుడో రోజా సినిమాలో చూసిన "నాగ మణి నాగ మణి... " పాట ఇక్కడే చిత్రీకరించారట !
ఇక్కడి నల్లని బండరాళ్ళు వాటిని చుట్టు ముట్టి ఉన్న అందమైన పచన్ని చెట్లు, నిశబ్దంతో ఉన్న ఈ నల్లనిరాళ్ళకి సంగీతం నెర్పేందుకే అన్నట్టు ద్వని చేస్తూ వాటిని కదిలించి కరిగిస్తున్న జలపాతపు ఉరకలూ, పిల్లగాలులకి పోటీగా పిల్లల కేరింతలు.
తెప్పలపై ప్రయాణం, నూనే మసాజులు ,,,ఒకటేమిటి మొత్తం అద్బుతమే.వార్తల్లో తమిళణాడు కీ కర్ణాటక కీ ఈ ప్రాంతం గురించి ఇక్కడి కావేరీ నది గురించి ఎన్ని గొడవలు ఉన్నా, జలపాతపు అందాలూ చూడటానికి వచ్హే యాత్రికులకి ఏమాత్రం ఇబ్బందిలేకుండా అన్ని వసతులూ అందుబాటులోనే ఉన్నాయి.

ఇకపోతే మణిరత్నం దర్శకత్వం చేస్తూన్న "రావణ్" అనే మరో కొత్తచిత్రం లో కొన్ని సన్నివేశాలని "విక్రం", "అభిషేక్" మద్య ఇటీవలే ఇక్కడ చిత్రీకరించారని తెలిసింది.

మొత్తానికి బండి మీద అలుపు వచ్హే లా ప్రాయాణిచాలి అనే నాకోరిక భారీ స్థాయిలోనే నెరవేరింది.
తిరుగు ప్రయాణంలో మమ్ము తడిపి ముద్దాడిన వర్షం కూడా ఎంతో బాగుంది.
ఇదండి నా హొగ్నేక్కల్ ప్రయాణ విశేషాలు .....