2009 ఎలక్షన్ల ఫలితాలు - ఆంధ్రప్రదేశ్
"తెలివి ఏ ఒక్కడి సొత్తూ కాదు" అని రాజశేఖర రెడ్డి విజయం మరొక్కసారి గుర్తు చేసింది.మన రాష్టానికి ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా,అపర చాణిక్యుడిగా పేరుగాంచినా శ్రీ నారా చంద్రబాబుదే కాదు తెలివి, అది మాకూ ఉంది అని రాజశెఖర్రెడ్డి నిరూపించారు."సమైఖ్య ఆంధ్రా" అంటూ అతిగా హడావిడి చేయకపోయినా, వేర్పాటువాదం వల్ల నష్టాలనీ ,తెలివిగా తన మనోగతాన్ని సున్నితంగా ప్రజలకి తెలియచెప్పీ ప్రాంతీయాభిమానాన్ని చాటుకున్నారు.కేవలం "సమైఖ్య ఆంధ్రా" భావమే గెలుపుని తెచ్హిపెట్టింది అని పూర్తిగా నిర్ధారించలేను గానీ తన మనసులో ఉన్న బలమయిన ప్రాంతీయ సమైఖ్య భావం మేలు చేసిందనే అర్దం అవుతుంది.
దుష్టబుద్దితో తెలంగాణా వాదాన్ని పెంచి పోషిస్తున్న కే.సి.అర్ కి, గొర్రెల్లా వెనకా ముందు ఆలోచించక దుష్టుడితో సహవాసంచేసినందుకు తక్కిన నాయకులకీ ప్రజలు సరైన తీర్పే ఇచ్హారు అనిపించింది."దుష్టుడికి దూరంగా ఉండాలి" అన్న కనీస జ్ఞానం ఉండిఉంటే చంద్రబాబు ఈరోజు ఇలా తలదించుకునే అవస్థ వచ్హిఉండేదే కాదు.
వ్యక్తి గా చంద్రబాబుకున్న శక్తి మొత్తం హరించి వేయటంలో కే.సి.అర్ తో పాటు వామ పక్షాలు సైతం తమవంతు తాము కృషి చేసాయనటంలో ఏమాత్రం సందేహంలేదు.వ్యుహాలని పన్నటంలో సిద్దహస్తునిగా పేరుగాంచిన చంద్రబాబు కనీస రాజకీయ ధర్మాలని మరిచి TRSని 45 స్థానలలో పోటీ చెయనివ్వటం నిజంగా అసమంజసం."ఎంత చెట్టుకి అంతే గాలి" అన్న చందాన ఆ దుష్టుడి కి కేవలం 10 స్థానాలే వచ్హి ఎందుకు పనికిరానివిగా అయ్యాయి.
గడిచిన అయిదేళ్ళ కాలంలో బలమైన ప్రతిపక్ష పార్టీగా నిరూపించికోక పోవటం ఒక తప్పయితే, సరైన సమయానికి దుష్టులితో సహవాసంచేసి కేవలం గెలుపే తమ వాంఛ అని ప్రజలకి పూర్తిగా అర్ధమయిపొయేలా చేసారు.చేతులు కాలుతున్నాయని మంట తెలిసాక, అప్పుడు ప్రజాసంక్షేమ పధకాలయిన "కలర్ టీవి","ఉచితం స్కీములు" ఇంకా ప్రతిష్టాత్మకమైన "నగదు బదిలీ" పధకాలను ప్రవేశపెట్టినా కూడా ప్రజల చెవ్వులలోకి కూడా ఇవి దూరలేదు.
అసలు తెలంగాణాలో ఫలితాలని పరికించిచూస్తే ప్రజలకి "తెలంగాణా" రాష్ట్ర వేర్పాటు భావలు చాలా తక్కువ ఉన్నాయేమో అనిపిస్తుంది.కే.సి.అర్ పదే పదే చెప్పుకునే "తెలంగాణా" రాష్ట్ర వేర్పాటు భావాలు నిజంగా ప్రజల మనోగతమే అయితే కనీసం తెలంగాణలో అయినా టి.అర్.ఎస్ ఎక్కువ సీట్లు మెజారిటీతో సొంతంచేసుకుని ఉండేది.కానీ ఫలితాలు దీనికి పూర్తి విరుద్దంగా సమైఖ్య ఆంధ్రా అన్నట్టు కాంగ్రెస్ కే పట్టం కట్టాయి.ఇది కేవలం కే.సి.అర్ తన అధికార దాహం తీర్చుకోవటానికి అడుతున్న నాటకం అని ప్రజలు చెప్పకనే చెప్పారు.మరి ఇకనయినా కే.సి.అర్ తన నక్క జిత్తులు కట్టిపెట్టి(తెలంగాణా వెర్పాటు ఉద్యమాలు వదిలి) ప్రజల కనీస అవసరాలపై ద్రుష్టి సారిస్తే తనకి భవిష్యత్తు ఉంటుంది.లెకపొతే గత మూడు ఎన్నికలఫలితాల మాదిరే తదుపరి ఎన్నికల లో సైతం చుక్కెదురవుతుంది.ఇప్పటికే తన సీట్లు వెళ్ళపై లెక్కించేవిగా ఉన్నాయి ఇదే ధొరణితో ముందుకి వెళ్తే కనీసం ఆ సీట్లు కూడా రాకుండా పోతాడేమో.
మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, డీ శ్రీని వాస్, షబ్బీర్ అలి,జీవన్ రెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, మండలి బుద్దప్రసాద్, పిన్న్నమనేని వెంకటేశ్వర రావు వంటి ఇతర మంత్రివర్గ సభ్యులు ఇంకా కేంద్ర మంత్రి రేణుకా చౌదరి లాంటి వారి వైఫల్యం నుండి ప్రజల అసమ్మత్తి కాంగ్రెస్ పార్టీ పట్ల అర్దం అవుతుంది.కావున రాజశేకర్ రెడ్డి పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళణ చేసి కొత్త మంత్రివర్గంతో అయినా ధనాశ లేకుండా పనిచెయిస్తే సుస్థిరాంధ్రప్రదేశ్ ని మనం చూడగలం.
ఇదిలా ఉండగా 294 స్థానలకి గానూ 292(కనీసం ఒక స్థానం చంద్ర బాబు కి ఒక స్థానం వై యస్ కి అయినా వదిలారు) స్థానాలు కేవలం ప్రజారాజ్యం పార్టీ ఒక్కటే కైవసం చేసుకుంటుందని చిలక జ్యొసం చెప్పిన అల్లూ అరవింద్ అనకాపల్లి నియొజక వర్గంలో పోటిచేసి చిత్తు చిత్తుగా ఓడిపొయారు.అలాగే పాలకొల్లు నియోజక వర్గం నుండీ పోటీ చేసి కనీస ప్రచారం కూడా నిర్వహించకుండా, పొగరుతో, పగటి కలలతో, పొగడ్తలతో, కళ్ళుమూసుకుపొయి ఒక మహిళ చేతులో చిత్తుగా ఓడి పోయి భూమి తన కాళ్ళ కింద ఉంటుందని తెలుసుకుని స్ప్రుహలోకి వచ్హిన చిరంజీవికి ప్రజలు తన విలువ ఎంటో బాగా బుద్ది చెప్పారు. కుల రాజకీయాలు మాకు వద్దు, కులం పేరుతో ఇక పై ఎవడైనా మాలో మాకు కుమ్ములాటలు పెట్టాలని చుస్తే ఇదే శాస్థి అని ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలియచేసిన ఓటర్లకి నిజంగా జోహార్లు."నీకుంటే మాకెంటి? - నీకింకా వస్తే మాకెంటి?" నువ్వు మాకొసం ఏమి చేస్తావ్?ఏమి చేయ గలవ్? అన్న అలోచనలతో ఉన్న ప్రజలకి "ప్రజా రాజ్యం ఒక విష వ్రుక్షం అని తెలియటంతో" అది తీసుకురాబొయే కులాల కుమ్ములాటలని ముందే ఊహించి, పార్టీ వ్యవస్థాపకుల ధనాశని గ్రహించి ఓటర్లు మంచి గుణపాటమే చెప్పారు.
అల్లు అరవింద్ లాంటి అవకాశవాదులకి రాజకీయాలు కూడా ఒక మార్గం అయితే అది నిజంగా రాష్ట్ర అరిష్టానికి దారితీసేదెమో,ఇకనయినా చిరంజీవి తన చుట్టూ ఉన్న వారి చెప్పుడు మాటలు వినక తన వ్యక్తిత్వ వికాసానికి మెరుగులు దిద్దుకుంటే మంచింది."మార్పు" మాకు వద్దు, మెరుగయిన సమాజం చాలు ...సామజికన్యాయం అనే ముసుగుతో మా జీవితాలకి అన్యాయం చెయ్యొద్దూ అంటూ ప్రజలు మౌన-గళం విప్పారు-ప్రజారాజ్యానికి బుద్ది చెప్పారు.
తెలుగుదేశం రాలేదు , కాంగ్రేస్ వచ్చింది అన్నవి పక్కన పెడితే అవాంచిత,అవకాశవాదుల రాజకీయాలకి(ప్రజారాజ్యానికి) సందివ్వకుండా కాంగ్రెస్ పార్టీయే స్వయం ప్రతిపత్తితో ప్రబుత్వం ఎర్పాటుచేయటం ఎన్నో వేల కోట్ల రూపాయలు చేతులు మారకుండా అడ్డుకట్టవేయటం నిజంగా శుభపరిణామం.అవును ఇది సైలెంట్ సునామీనే (మౌన-గళం).
ఎలాగూ కాంగ్రెస్ వారి దాడులు, ఈనాడు పైనా ఆంధ్రజ్యొతి పైనా కొనసాగక తప్పవు కాబట్టి ఇకనయినా మీడియా వారు నాయాకులకు తొత్తులుగా మసలక తమ తమ విధులను గుర్తెరిగి సమాజవికాశానికి తమద్వార పూర్తి స్థాయి వాస్తవాల వెలుగులని చిమ్మాలని అశిస్తాను.
ఇకపోతే కిషన్ రెడ్డీ(BJP),జయ ప్రకాష్ నారయణ (Loksatta) వంటి వాళ్ళు అసెంబ్లీలో ద్రుఢమైన ప్రతిపక్ష పాత్రని పోషిస్తు మెజారిటీ సీట్లున్నా కూడా సరయిన ప్రతిపాక్షం గా వ్యవహరించలేని తెలుగుదేశానికి ఒక మార్గదర్సకంగా ఉంటూ వారి ఆలొచనలలో మార్పు తెస్తూ, ప్రబుత్వాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రాబివ్రుద్దికి కృషి చేస్తారని బావిద్దాం.
మొత్తం శాసన సభ స్థానాలు 294 కాగా ప్రబుత్వ ఏర్పాటుకు కావల్సిన 148 స్థానాలకు గానూ కాంగ్రేస్ పార్టీ సునాయాసంగా 157 స్థానాలు సొంతం చేసుకుని తన సత్తాచాటుకుంది.
అంధ్రాలో మొత్తం లోక్ సభ స్థానలు : 42
పార్టీలు సాధించిన స్థానాలు
కాంగ్రెస్ : 33
తెలుగుదేసం : 4
తెలంగాణా రాష్ట్ర సమితి : 2
ఇతరులు :3
పూర్తి వివరాలు దిగువ లింకు లో
అసెంబ్లీ స్థానాల పూర్తి వివరాలు దిగువ లింకు లో
9 comments:
ప్రతిపక్ష ఓటమికి వోట్లచీలికే కారణమైనా, సమర్ధవంతంగా పనిచేసి ఉంటే ఈ చీలిక పెద్ద అడ్డంకి అయ్యుండేది కాదు.
కిషన్‌రెడ్డీ జయప్రకాష్ వంటివాళ్ళు శాసనసభ్యుల్లో ఏమైనా మార్పు తీసుకురాగలరేమో చూద్దాం.
Good analysis
Really Good !Particularly TRS ki 'entha chettuki anthe gali' baga suit avthundi.Babu garu (NC babu ) nerchukovalsina mottamodati patam.
Next Best: Newspapers -- should work for people but not for politics and politicians
Sontha party pettagane 292 seats vasthayanu kovadam .. vari minds lo 'samajika nyayam ' leka povdame :) .. manchi 'marpu' ravali
A united AP is all what want, but if excited individuals keep on raising their useless promotions for a separate state time to time, gathering some mass - Hope that elites will never support that again.
Moreover lets see desperately for the thing you mentioned in 6th para last sentence. I wish I could see that day barely now as elected feel they got a license to rob.
రాజావారికి, యువరాజా వారికి ఇక పట్టపగ్గాలు లేకుండా పోతాయేమో అని వర్రీగా వుంది - ముఖ్యంగా యువరాజా వారికి.
చదువరి :మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం అండి!! నిర్మాణాత్మక ప్రతిపక్షం ఓటమి కి దూరం అని నా అభిప్రాయం కూడా!!
సూర్యుడు : కృతజ్ఞతలు
మనసు : నిజంగా సామాజిక న్యాయం వారి మనసులో ఉంటే వారి పనితీరులో/వ్యవహార సైలిలో బోలెడంత తేడా ఉండేది.
అనామకుడు: నావరకు నాకు సమైఖ్య అంధ్రా అంటే ఇష్టం ! ఎంతైనా దక్షిణభారతాన అతిపెద్ద రాష్ట్రం కదండి.అదికాక తెలంగాణా లేని అంధ్రా మాప్ ని ఊహించలేకపోతున్న, దాని అందమైన ఆక్రుతి దెబ్బతింటుందెమో అని భయం.
శరత్ 'కాలమ్': ముఖ్యంగా జగన్ గారికి గత ఏడాది సాక్షి గ్రూపులో పేపరూ, టీ.వీ చానల్ రావటం కోతి కి కొబ్బరి కాయ దొరికినట్టు అయ్యింది
I havae tried to comment on your post in telugu.. Alas! i couldnt. First I would like to appreciate you for the effort in writing the blogs in telugu.. I personally feel its tough to write in telugu. Then the content you have put in and the way you presented was fabulous. I have searched hell lot of sites for the district wise winners in this election.. but could not. I feel you should be proud as I have found this only in your blog. I apppreciate your efforts in keeping this blog alive.. You ROCK!!
నాదేమిలేదు నటరాజ్! థాంక్స్ లన్నీ ఈనాడు కి చెప్పాలి..నేను ఇక్కడ ఇచ్హినవన్ని ఈనాడు నుండీ తీసినవే !
Nice expressions sir. Your interest in presenting these results is worth appreciating. And most of the opinions here expressed are what I agree.
The Congress party won not because people supported it, and it's protagonists, but because the opposition parties failed to come up with a proper alternative. More over, Rajasekhar Reddy's policies attracted some people very strongly.
And everybody's vary of Chandrababu's trator mentality, whereas 'if u believe me, I can do anything for u' mentality of the CM came to his rescue.
Post a Comment
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...