Friday, April 9, 2010

యాక్షన్ సినిమా డైరెక్టరుగా మారనున్న "చీ"దంబరం


యాక్షన్ సినిమా డైరెక్టరుగా మారనున్న "చీ"దంబరం
ఇటీవల జరిగిన దంతేవాడ ఘటనపై ప్రజలంతా ఘాటుగా ఉన్న సందర్బంలో మన చీ-దంబరం గారు మరొక గమ్మత్తయిన ప్రకటన విడుదల చేసి ఎదో దూరపు ఆలోచనా దోరణిని వ్యక్తపరిచారు. ఆ గమ్మత్తయిన ప్రకటన మరేదో కాదు - "మానవ రహిత విమానలతో నక్సల్స్ పై దాడి" అసలు నా అనుమానం ఎమిటంటే ఈయన చేసిన వెధవ పనికి ప్రభుత్వమే హోం శాఖ నుండి తప్పించి మరి ఏ సినిమారంగ శాఖకో వేస్తే అక్కడ తన హస్త లాఘవాన్ని చూపడానికిగానూ ముందు నుంచే మెదడు కి పదును పెట్టే పనిలో పడ్డట్టున్నాడు.

ఈయన చేసిన "మానవ రహిత విమానలతో నక్సల్స్ పై దాడి" ప్రకటన పూర్తిగా చదివిన తర్వతా మనవాడు ఎదో పెద్ద యాక్షన్ సినిమా కి కధ రాస్తూ మధ్యలో గవర్నమెంట్ గుర్తుకి వచ్హి  ఈ అర్దరహిత ప్రకటన చేసాడేమో అనిపించింది. కాలిక్యులేటరు పట్టుకునే చేతులతో కత్తులు దూసే పని చెయమంటే అతను మాత్రం ఎమి చేస్తాడు. నా వరకు నాకు ఇతగాడు ఆర్ధికశాఖలో ఉన్ననాల్లు భలే గౌరవం ఉండేది, ఆ తర్వాత మనవాడు చేసిన ప్రతీ పనీ గాలిదుమారమే.
మొన్నటికి మొన్న బాగా తాగి పడుకున్న KCR చిందులకి కంగారుపడిపోయి కలిసి మెలిసి కమ్మగా బ్రతుకుతున్న అంధ్రా ప్రజానికానికి కుంపటి రాచేసే విదంగా కంపరమెత్తే కబురు ఒకటి చెప్పి కామ్ గా కూర్చునాడు. మనోడి మీద అప్పుడే ఒక తీర్మానానికి రావలిసింది తప్పుచేసా.


ఒక అలోచనా, అవగాహన, ప్రణాళిక ఇంకా అంచనా ఎమీ లెకుండా పంపటంవల్లే సి ఆర్ పి ఎఫ్ దళాలని పొట్టనపెట్టుకున్నాడు, అంతా అయిపొయాక "ఇది నా చెతకానితనం"  అని ఒప్పుకుంటే మాత్రం ఎమి ప్రయోజనం. ఎది ఎమయిన అంత ముఖ్యపదవిలో ఉండి చెపట్టే ఆపరేషన్స్ అన్ని ఇలా కొండెక్కిస్తే ప్రభుత్వం పని గాలిలో పెట్టిన దీపం అయిపొతుంది . 


మొత్తానికి చీ-దంబరంగారూ మీ చేతకానితనానికి చెయ్యెత్తి కొట్టంటం బాగోదు కనుక ఇలా చీ అని సరిపెట్టుకుంటున్నాము  ఇకనయిన మీ యాక్షన్ సినిమా కధలో సన్నివేశాలు మా మీద ముఖ్యంగా నక్సల్స్ మీదా ప్రయోగించవద్దు ఒక వేళ అందులో మాకు అర్దంకాని చిదంబర రహస్యాలు ఎమయిన ఉంటే కాస్త అర్దం అయ్యెటట్టు చెప్పి పుణ్యం కట్టుకోండి. 
ఈనాడులో  మన వాడి చిదంబర ప్రకటన ఇక్కడ చూడండి.  [1]

9 comments:

Anonymous said...

GOOD POST!

మంచు said...

Good one ;-)

Anonymous said...

మీ పోస్టు బాగుంది కానీ,
ఉన్నన్నాళ్ళు ని "ఉన్ననాల్లు" గా చదూతుంటే ఏదో కంపరంగా ఉంది.

Anonymous said...

I don't agree with your views. What a minister can do? He cleared the operation and in a jungle war setbacks are common on unknown terrain. It is not like a direct war nor US is bombing tribles as in Pakistan with UAVs. India is a democratic, civilized country unlike Pakistan and are answerable to it's citizens.

Hope Police would sharpen their technology and plans and wipe out the thugs aided by barbarian tribals. Home Minister is just instrumental in giving final node.

కెక్యూబ్ వర్మ said...

యిదే థీంతో ఏప్రిల్ 4th న నేనిక్కడ రాసాను, చదవగలరుఃhttp://sahacharudu.blogspot.com/2010/04/2013.html

మీ పోస్టూ బాగుంది. పిచ్చి కుదిరింది తలకు రోకటి చుట్టమన్నట్టుగా వుంది యీయన వ్యవహార శైలి. విమానాలతో బాంబింగ్ చేస్తే మొత్తం ఆ పరిసర ప్రాంతం అంతా నాశనమయి, ప్రజలంతా చనిపోరా? యిటువంటి వెధవ తెలివితేటలగాడిని హోంకు వేసినందుకు ఇటలీ మాతకు అనాలి. వీడికి తందాన తానా అంటూ ఆ బవిరి గెడ్డం PM ఒకడు.

Shiva Bandaru said...

true!

Anonymous said...

నాయన చాలా సుతిమెత్తగా వారి పనితనాన్ని గురించి మీరు చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది.

Krishna said...

Thanks to all commentators

Anonymous said...

me post chaduvuthunte ne navvu vachindi..i mean the way you have expressed, on top of that a "కెక్యూబ్" veeri comment inka super..

Post a Comment

వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...