హొగ్నేకల్ ( తమిళకర్ణాటక )
ఇంగ్లీషు లో వివరణ కోసం ఈ లింకు చూడండి.
గమనిక : కింద "ఫొటో షో" లోడ్ అయ్యే వరకూ వేచి యుండిడి.నిన్న అంటే 30 మే 2009 మా ఫ్రెండ్స్ తో కలిసి ఒక అద్భుతమయిన జలపాతం చూడటానికి వెళ్ళాము, అదే "హొగ్నేకల్" జలపాతం. అక్కడ ఎవరో దీనిని "భారత నయాగరా " అని అభివర్ణించటం విన్నాను, ఆ మాట అతిశయోక్తి కాదేమో అని అనిపించింది. ఎందుకంటే చూసిన తర్వాత ఎవ్వరయినా ఆ మాట అనాల్సిందే. ఎందుకో తెలీదు నా బండి మీద అలా అలిసిపొయే వరకూ ప్రయాణంచేసి చాలా రోజులయ్యిందనిపించింది;ఎప్పటినుండో హొగ్నేకల్కి వెళ్ళాలని వేచియున్న నాకు ఇదే మంచి తరుణం అనిపించింది. ఒక్క క్షణం కూడా అలోచించకుండా ఈ జలపాతం గురించి గూగుల్లో సమాచారం సేకరించి, అదే విషయాలని కొంచెం మసలా జోడించి స్నేహితులకి ప్లాను అంతా ఈమెయులు చెసేసా. ఎవ్వరూ రిప్లయ్ ఇవ్వకపోయే సరికి పట్టువదలని విక్రమార్కుడిలాగా వెంటనే ఫొనులు మీద ఫొనులు చేసి హింసించి ఈ అఖస్మాత్తు ప్రయాణానికి సిద్దం చెసేసా.మేము మొత్తం ఎనిమిది మంది నాలుగు మోటారు వాహనాల మీద వెళ్ళాలని నిర్ణయించి, బళ్ళని యాత్ర కి ముందు రోజే సిద్దం చేసేసాము.బెంగళూరు నుండి ఈ ప్రాంతానికి చేరటానికి అతి దగ్గరి మార్గం మేము మా ప్రయాణానికి ఎంచుకున్నాము.
హొగ్నేకల్ గురించి మరిన్ని విషయాలు ఇక్కడ చూడండి : హొగ్నేకల్
మేము ప్రయాణిచిన మార్గం : బెంగుళూరు - అత్తిబేలి - మత్తిగిరి - దెనకనికొట్టై - హొగ్నేక్కల్
దూరం : బెంగుళూరు - కోరమంగలా నుండీ సరిగ్గా 121 కిలోమీటర్లు
దారి అడవి మార్గం అయినందున మొత్తం ఘాట్ రోడ్డు.
జడపిన్ను మెలికలతో హొయలు ఒలికే ఆ రోడ్డు మీద,
తొలకరిజల్లులతో పరవసించి పచ్హగా మారిన చెట్ల మద్య,
అంతంటులేదు అనంతమే హద్దు అనట్టున్న లోయల మీదుగా ,
నీకూ తోడున్నా అంటూ వస్తున్న స్నేహితుల నడుమ,
నేను లేనిదే నీవు లేవు అని ఘీంకరిస్తున్న మా బైకు శబ్దాలతో,
సెలయేర్ల ప్రక్కగా సాగిన మా ఈ ప్రయాణం నిజంగా ఒక మరుపురాని ఙ్నాపకం.
అప్పుడెపుడో రోజా సినిమాలో చూసిన "నాగ మణి నాగ మణి... " పాట ఇక్కడే చిత్రీకరించారట !
ఇక్కడి నల్లని బండరాళ్ళు వాటిని చుట్టు ముట్టి ఉన్న అందమైన పచన్ని చెట్లు, నిశబ్దంతో ఉన్న ఈ నల్లనిరాళ్ళకి సంగీతం నెర్పేందుకే అన్నట్టు ద్వని చేస్తూ వాటిని కదిలించి కరిగిస్తున్న జలపాతపు ఉరకలూ, పిల్లగాలులకి పోటీగా పిల్లల కేరింతలు.
తెప్పలపై ప్రయాణం, నూనే మసాజులు ,,,ఒకటేమిటి మొత్తం అద్బుతమే.వార్తల్లో తమిళణాడు కీ కర్ణాటక కీ ఈ ప్రాంతం గురించి ఇక్కడి కావేరీ నది గురించి ఎన్ని గొడవలు ఉన్నా, జలపాతపు అందాలూ చూడటానికి వచ్హే యాత్రికులకి ఏమాత్రం ఇబ్బందిలేకుండా అన్ని వసతులూ అందుబాటులోనే ఉన్నాయి.
ఇకపోతే మణిరత్నం దర్శకత్వం చేస్తూన్న "రావణ్" అనే మరో కొత్తచిత్రం లో కొన్ని సన్నివేశాలని "విక్రం", "అభిషేక్" మద్య ఇటీవలే ఇక్కడ చిత్రీకరించారని తెలిసింది.
మొత్తానికి బండి మీద అలుపు వచ్హే లా ప్రాయాణిచాలి అనే నాకోరిక భారీ స్థాయిలోనే నెరవేరింది.
తిరుగు ప్రయాణంలో మమ్ము తడిపి ముద్దాడిన వర్షం కూడా ఎంతో బాగుంది.
ఇదండి నా హొగ్నేక్కల్ ప్రయాణ విశేషాలు .....
11 comments:
Good presentation buddy..... madhyalo aa kavitha bhavundhi.... we(especially you) got good pics ... thanks to PK :)
మాస్టారు సూపర్ గా ఉంది, కానీ
నీల్లలో నల్ల కళ్ళద్దాలు :)
ఇంతేనా? హొగెనెకల్ అని చూడగానే ఎన్నెన్ని విశేషాలు చెప్తారో అని వచ్చాను. అసలు కావేరి అందాలే అందాలు! తల కావేరి నుంచి (తమిళనాడులో కావేరిని చూడలేదు కాబట్టి) కర్ణాటక మొత్తం మీద కావేరి నది ఒక్క చోటైనా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉండదు. ఉరుకులూ, పరుగులూ, ఉరవళ్ళూ పరవళ్ళూ!
హొగెనెకల్ కూడా ఎంతో ఉద్వేగాన్ని కల్గిస్తుంది. అంత సౌందర్యాన్ని ఒక్కసారిగా భరించడం ఇంత చిన్న గుండెకు కష్టమనిపిస్తుంది. శివ సముద్రం ఫాల్స్ కూడా చాలా బాగుంటుంది. దగ్గరేగా, బెంగుళూరుకి,వెళ్లారా? శివసముద్రం కి వెళ్ళేదారిలో ఒక చిన్న చెక్ డాం ఉంటుంది కావేరి మీద. దాని పక్క నుంచే చాలా సేపు ప్రయాణించాల్సి వస్తుంది. వాహనం సొంతదైతే అక్కడ ఆగి ఆ అందాలను తనివి తీరా తాగేసి అప్పుడు వెళ్ళొచ్చు.
బైక్ రైడ్ అంటే ఇంకా బోలెడు వర్ణనలుండొచ్చు కృష్ణ గారూ! ఫొటోలు బాగున్నాయి.
kevvu bayyaaaaaaaa
thats nice
b posting all updates
hey excellent yaar.....
నాగరాజు: చాలా థాంక్స్ ! ప్రదీప్ కి నిజం గా చాలా థాంక్స్ ...ముఖ్యంగా నాకు నిజంగానే మంచి ఫొటోలు తీసాడు.అయినా మీకూ తెలుసుగా ఆ ఫొటోల కోసం ఎంత కష్టపడ్డమో?
విజయ మాధవ : థాంక్స్ అండి! ఫొటో కదండి కొంచం క్రియేటివిటీ చుపించాము అంతే ..నచ్హితే మీరు కూడా ట్రై చేయండి.
సుజాత : నిజానికి చాలా రాయాలనిపించిందండి.కానీ సమయాభావం వల్ల, మరోక బలమయిన కారణం వల్ల కూడా రయలేదండి. కావేరి నది నాకు ఎప్పూడూ అన్యాయమే చేస్తుందండి, నేను మేకదాటు, తలకాడు, ఇంకా శివనసముద్రం ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రతీ చోటా చలా ప్రశాంతంగానే దర్శనమిచ్హింది ,,,దేనికయినా అద్రుష్టం ఉండాల్లెండి !
మీరనట్టు శివనసముద్రం దాని దగ్గర చెక్ డాం అవి అన్నీ చూసానండి . వాతిగురించి నేను నా ఇంకో బ్లాగులో రాసానండి.
చెలెమ్మకి కూడా థాంక్స్
ఇంకా శ్వెతా నీకు స్పెషల్ థాంక్స్ ఎందుకంటే నా బ్లాగు కి రావటం; కామెంటు ఇవ్వటం అన్నీ చాలా ఫాస్ట్ గా చేసేసావ్ !
fotos chala bagunnayi..meeru anni stills pettina opika ga fotos teesina variki nijumga joharlu...madyalo kavitha bagundhi..
Super description and kavita too..
annai kummav po.......kakapothe nuvvu cheppina routelo vellataniki konchem bayam vesthundi....kaani risk chestham anna....chaala chaala thnx....
max yenni stills ivvagalarro anni stills icharu..Nice clicks
First time i saw Telugu blog here. Thank you.
Log onto TicketGoose.com today to discover the new and easy method of booking tickets through the Online Bus Booking service and also enjoy the benefit of several attractive discounts.
Post a Comment
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...