Wednesday, December 30, 2009

గోవాలో " శ్రీ " దేవి,చార్మి,విద్యా సాగర్


గోవా లో చార్మి, దేవి శ్రీ ప్రసాద్  


క్రిస్మస్ పండగ అనగానే ఎదో తెలియని ఆనందం, కొత్త సంవత్సరానికి మరీ దగ్గరగా ఉండటంతో ఇది కూడా పెద్దపండగే, పైగా సంవత్సరంలో అఖరు పండగ... మొత్తానికి ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న మా గ్యాంగు అంతా కలిసి సరిగ్గా క్రిస్మస్ కి ముందు రోజే అక్కడికి చేరుకున్నాం, అనుకున్న విధంగానే సాగరతీరానా సాయత్రం వరకూ సేద తీరి ఆ తర్వాత పబ్బులోకి(TITO's) చేరి ఊగి ఊగి అలసిపోయి సుమారు తెల్లవారుజామున మూడు గంటలు ఆ ప్రాంతాన ఇంటికి చేరెందుకు పబ్బు నుండి బయటపడ్డాము. మరికొందరి స్నేహితులకోసం ఎదురుచూస్తూ పబ్బు బయటనే నిద్ర మత్తులో కూర్చుని అటూ ఇటూ అదే పనిగా తుళ్ళుతూ, తూగుతూ తిరుగుతున్న ఆడపిల్లల్ని చూస్తూ అర్దంకాని అనవసర ఆలోచనలతో సతమతవతున్న నాకు ఎక్కడో బాగా తెలిసిన అమ్మాయిలాగ ఒక ఆకారం కనపడింది, వెంటనే పక్కనే ఉన్న స్నేహితుడి కి చూపించి "ఎరా మన మంత్రా చార్మి లా లేదా ? " అని అడిగా , వాడు కూడా అంత మంది అమ్మాయిలలో మాములు ఒక మోస్తరు అమ్మయిలా కనపడటంతో అనుమానంగా చార్మినే అనుకుంటరా అన్నాడు. (నిజానికి చార్మి చాలా సన్నగా ఉంది, బహుసా కొత్త లుక్ కోసమెమో )కనురెప్ప పాటులో మళ్ళీ అనుమానం, ఆ తెల్లచొక్కావాడి ముక్కు అచ్హూ మన దేవి శ్రీ ది లా లేదా అని అన్నా, వెంటనే వాళ్ళు చార్మి - దేవి రా అని ఎగిరి గంతేసాడు ; మరుక్షణం    మేము ఇద్దరం వాళ్ళ  పక్కన ఉన్నాం - ఎముంది కట్ చేస్తే కింద "దేవి తో నేను "  ఇంకా "దేవి తో మా ఫ్రెండు" ఉన్న ఫొటోలు ... ఆ నాకు తెల్సు మీ తరువాతి ప్రశ్న పక్కనే మంత్ర ముద్దుగుమ్మ ని పెట్టుకుని ఆ ఫొటో దిగలేదే అనే కదా ?? ఎముంది అక్కడ దేవి రిక్వస్ట్ ...కాదనలేక పొయాం .. దానితో కేవలం చార్మి కరచాలనం తో సరిపెట్టుకున్నాం, అనట్టు ఇంకో విషయం చెప్పటం మరిచిపొయా చార్మి, దేవీ లతో పాటు, దేవీ తమ్ముడు "విద్యా సాగర్" (గాయకుడు) కూడా వీళ్ళతోనే ఉన్నాడు. బహుశా అన్న కి తమ్ముడు తోడు కాబోలు !!! మొత్తానికి మా గోవా ప్రయాణానికి చార్మి మరింత మేరుగులు అద్ద్దింది . గోవా యాత్రా విశేషాలు పూర్తిగా ఇంగ్లీషు లో ఈ లింకు లో చూడండి .




 

0 comments:

Post a Comment

వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...