హైదరాబాద్ లో హంటింగ్ (ఉద్యోగపర్వం - ద్వితియాశ్వాసం)
కాలేజిలో కటింగ్ ఇచ్హిన పాపానికి ... ఆడ్రస్సు సరిగా రాయకపోతే మనం రాసిన ఉత్తరం మనకే వచ్హినట్టు; మొత్తానికి కాలేజీ ముగుసిన తర్వాత మళ్ళీ నా స్వగ్రుహానికే నా దారి; రహదారిన పడింది. ఇంటికి వెళ్ళిన నాకు అమ్మ వండింది తినటం, టీవీలో వచ్హే సినిమాలు చూడటమే తప్ప అసలు నా జీవితంలో ఎమి జరుగుతుందో తెలిసుకునే తీరికే లేదు.ఎందుకో తెలీదు కలిసిమెలిసి తిరిగిన ఫ్రెండ్స్ గురించి అయినా ఆలోచనే లేదు, ఎందుకని ఒక్కసారిగా నా బ్రెయిన్ అంతగా బ్లాంక్ అయిందో తెలియదు . బహుశా నాలుగేళ్ళు కాలేజీలో ఎదో పొడిచేసానని పొగరేమో !! అదేంటో, అప్పటి నా అంతరంగాన్ని ఇప్పటికీ అన్వేషిస్తూనే ఉన్నా.మొత్తానికి ఒకరోజు మా బాబాయి ఇంటికి వచ్హి చేతికి ఈనాడు పేపరు ఇచ్హి అందులో మా ఊళ్ళోనే ఒక ఇంజరీరింగ్ కాలేజిలో లెక్చరర్ పోస్టులు పడ్డాయి, ఇంటర్వ్యూ కి వెళ్ళు అని పక్క గదిలో ఉన్న మా అమ్మ-నాన్నలకి వినపడేలాగాచెప్పాడు. నో చెప్పటానికి రీసన్ అలోచిస్తుండగా ఎదో నన్ను యెస్ అనిపించింది అదే ..కొంచం ఆలొచిస్తే గతంలో మా లెక్చరర్లు కాలేజిలో చేసిన కామెడీలు గుర్తుకువచ్హాయి. ఆ కామెడి నాకు అనందాన్ని ఇచ్హిందో లేదో గాని నాలో నాకు తెలియని బోలెడంత దైర్యాన్ని ఇచ్హింది, దానికి కారణం ఎన్నో తప్పులు కుప్పలు తెప్పలుగా చెప్పే కొంతమంది లెక్చరర్లని చూడటమూ, ఆ చిరాకులో ప్రతీ సబ్జక్ట్ లోని ముఖ్యమయిన టాపిక్ నీ ఎంతో కష్టపడి బాగా నేర్చుకున్న స్థైర్యం, ఇంకా అన్నిటికన్నా అంత కష్టపడి నేర్చిన మెళుకువలు కేవలం నా మార్కుల చిట్టాలకి బరువు పెంచటమే కాకుండా పాపం సబ్జక్ట్ అర్ధంకాక ఒకే సబ్జక్ట్ పై గజిని దండయాత్రలు చేసే నా మిత్రులకు కూడా నేర్పాడానికి, వాళ్ళు పాస్ అవ్వటానికి దోహదం చేసింది అని చెప్పటంలో నాకు ఎంతో అన్నందం ఉంది. ఇవ్వన్నీ కలిపి నన్ను సి.ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్ పోస్ట్ ఇంటర్వ్యూ కి తీసుకెళ్ళగా, వచ్హిన 36 మందిలో నేను సెలక్ట్ అయ్యానన్ని సాయంత్రానికే తెలవటం భలే ఆనందం వేసింది . అనందంలో నాకు ఒక రాత్రి నిద్ర కరువయితె అయ్యింది కాని నాగురించి నేను ఆలోచించుకునే అవకాశం దొరికింది.
తెల్లవారుజామున నిద్ర లేవటంతోనే నాలో ఎదో తెలియని ఉత్సాహం, గుడికి వెళ్ళివచ్హిన నాకు అమ్మ టిఫిన్ పెడుతూ అడిగింది. "కాలేజిలో ఎప్పుడు జాయిన్ అవ్వాలి ?" అలోచించకుండా అమ్మకి కటువుగానే చెప్పేసా "నేను హైదరాబాద్ వెళుతున్నా" అని.మద్యాహ్నం వరకూ ఓపిక పట్టిన అమ్మ భొజనం పెడుతూ నాన్నగారికి నెమ్మదిగా చెప్ప సాగింది. ఇక్కడే ఉంటే ఇంటిపట్టున ఉండొచ్హు అని చెప్పండి మీరయినా అంది. నాన్న ఎమీ మాట్లడలేదు. హైదరాబాద్ కి ఒక బస్ కి టికెట్ట్ తీసి తెచ్హారు ఆ సాయంత్రం, రెండురోజుల్లో ప్రయాణం, అమ్మ మా అన్నయ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడికి వెల్లమంది. నాకు అక్కడికి వెల్లటం సస్యేమిరా ఇష్టం లేక హైదరాబాదులోనే ఉంటున్నాడు అని తెలిసిన ఒక స్నేహితుడికి ఫోన్ చేయగా ఎమీ తడ పడకుండా వాళ్ళ రూంలో ఉండేందుకు సమ్మతించాడు. ఆ రోజు రానే వచ్హింది ; బస్ ఎక్కిన నాకు అలోచనల అలలు కునుకు పట్టనివ్వలేదు.ఉదయానే హైదరాబదులో దిగిన నేను స్నేహితుని సాయన వాళ్ళ రూం కి చేరాను.అక్కడ మొదలు అయ్యింది నేను, నేను లా బ్రతకటం...
కూకట్ పల్లిలో అదొక పెద్ద ఇల్లు (3 అంతస్తుల బంగళా) కాని అందులో మేము ఉండేది చిన్న పోర్షన్, ఉన్న ఒక్క గదిలోనే నాతో కలిపి అప్పటికే అయిదుగురు, తనకే లేదు మొర్రో అంటే తనకి ఒక డోలు అన్నట్టు నా పుస్తకాలూ, బట్టలు.ఇలా అందరి పుస్తకాలూ బట్టలతోనే రూం సగం నిండి పోయేది.అయినాగని ఆ పుస్తకాల మద్యనే తింటూ, పడుకుంటూ ఉండే అద్రుష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి. అది అసలే వేసవి కాలం కావటం తో అక్కడ నీళ్ళకి భలే యెద్దడి ఉండేది. అప్పటికే నీళ్ళ కోసం తగిన ఏర్పాట్లు చేస్తూ మా వాళ్ళు పెద్ద డ్రమ్ము ఒకటి కొన్నారు, తెల్లవారుజామున కులాయి వదలగానే దాన్ని నింపుకోకపోతే ఆ రోజుకి పాలు తాగిపడుకోవాల్సిందే ఎందుకంటే నీళ్ళుండవు కాబట్టి. అప్పట్లో అసలు నీళ్ళు కొనుకుని కూడా తాగొచ్హు అన్న ఆలోచనే రానంత జాగర్త మాకు డబ్బుల పట్ల. ఇంజరీంగ్ చదువుకునే రోజుల్లూ రాత్రంతా మెల్కువ ఉండి చదవటం అలవాటు అయిన మాకు తెల్లవారు జామున నిద్ర లేవటం అంటే బహుకష్టంగా ఉండేది, మా అద్రుష్టం కొద్ది మా స్నేహితుడు ఒకడికి ఈ పాడు అలవాటు లేదు. వాడే మా అందరికి కాస్తంత పడుకునే భాగ్యం కలిగించేవడు. వాడు మా అందరికి చాల స్పెషల్. మేము అంతా చదువుకునే సమయంలో(ఆ పేరుతో హైదరాబాదు క్షేమ సమాచారాని సమీక్షించెవాళ్ళం) పడుకునేవాడు. మేము పడుకోగానే నిద్రలేచి చదువుకునే వాడు, బహుశా అప్పటికే కాలం విలువ తెలిసిరావటమే వాడి అద్రుష్టం కామోలు.
ఎన్నో నేర్పారు మా స్నేహితులు, అప్పటివరకు మా నాన్న చెప్పిన కంప్యూటెర్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ చెంజ్ అంటే naukari వెబ్ సైట్ అని తెలియని స్తితిలోనే ఉన్నాను అనుకుంట. రోజూ ఇంగ్లీషు వార్తాపత్రికల్లో పడే జాబ్ లకు మాత్రం ఎ-మెయిలు పంపే నేను నౌకరీ కి మారాను.అతి కొద్దికాలంలోనే అలాంటి సైటులనంటిలోనూ సభ్యత్వం నమోదు చేసుకున్నా.బస్ పాస్ తీసుకొవటం దగ్గర నుండీ ఇంటర్వ్యూ లో బుర్ర ఎలా వాడాలో వరకూ ఇలా ఎన్నో తెలిసాయి.
ఉదయానే రూం దగ్గరలో బండి దగ్గర ఇడ్లీలూ లేదా దోశలు తిన్నాక అయిదు రూపాయలిచ్హి ఇంటెర్నెట్ కి వెళ్ళెవాల్లం. ఇంటెర్నెట్లో వేట, అన్ని కంపెనీల వెబ్సైటులలొ "నేనొక నిరుద్యోగ అభాగ్యుడిని బాబూ నాకొక జాబ్ ఇవ్వండీ " అంటూ దరకాస్తు చేసేవాళ్ళ్ళం.ఎవరయినా ఫ్రెండ్ పలానా ప్లేసులో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి అని ఒక్క SMS పంపితే చాలూ క్షణాల్లో పది మందికి తక్కువ కాకుండా గుంపుగా ఆ కంపెనీ గేటు పై దాడి చేసేవాల్లం, వచ్హిన యువజన సంద్రాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లొ గేట్లు సైతం ఆపలేకపొయేవి. మా గోల భరించలేక గేటు మాన్ కి మా రెస్యూం ఇచ్హి వెల్లమని చెప్పెవాల్లు . మరుసటి రోజు అదే కంపెనీ దగ్గరలో బజ్జీలు తింటే తెలిసేది ఆ సెక్యురిటీ వాడు మా రెస్యూంలు అమ్మెసాడు అని.
పాపం వాడికి ఎమి తెలుసు అది కేవలం మా గోల మాత్రమే అనుకున్నడేమో !! అవి మా ముందు జీవితపు మైలు రాళ్ళు అని తెలిస్తే వాటిని చేరవలిసిన దగ్గరకే చేర్చి ఉండే వాడు.అటూ ఇటూ తిరిగి వచ్హినా మా అందరిని కలిపేది మట్టికీ ఒక్కటే ఉండేది అదే అకలి అనుకుంట. అందుకే అందరం కలిసి ఒకే పార్సెల్ బోజనం పంచుకునే వాళ్ళం.ఇక ఇది ఇలా ఉండగా రాత్రి పూట మాత్రం ఒక అరటిపండు మంచి బోజనం అని చెప్పాలి. అప్పటివరకు నాకు అరటిపండు అంటే మా ఊళ్ళో దొరికే చిన్నపాటి పసుపు రంగువి మాత్రమే తెలుసు.కానీ మొట్టమొదట హైదరబాదులో చూసిన ఆ పెద్ద పచ్హని అరటిపండు ఇంచు మించి రాత్రి పూట విందులా మంచి అమృతంలా ఉండేది.
ఇక రాత్రి కి మాత్రం మేము రోజూ తూచా తప్పకుండా కొంతమంది స్పెషల్ ఫ్రెండ్స్ తో గడిపేవాళ్ళం అవి మరి ఎవరో కాధు "కూకట్ పల్లి దోమలు". ఇవి నా ఉద్యోగపర్వంలో ఎంత సహాయం చేసాయి అంటే ఒక్క పూట కూడా నా లక్ష్యాన్ని మరచిపోకుండా కంటి మీద కునుకు పడనీయకుండా తట్టి లేపుతూనే ఉండేవి. వీటి పుణ్యమా అని రాత్రంతా అటూ ఇటూ రోడ్లు అవి సరిగా ఉన్నాయో లెదో సర్వే చెసేసి (తెల్లారితే సి.ఎం కి నివేదిక పంపాలన్నంత భాద్యత గా) తెల్లవారుజామున ఎప్పుడో మొత్తానికి మా స్పెషల్ స్నేహితుల సంగీత విభావరిలో; రూంలో మిగిలి ఉన్న జాగాలోనే ఎవరో ఒకరి కాళ్ళ కింద పడుకుని నా కాళ్ళు ఇంకొకరి తల ముందు పార్కు చేసుకునెవాళ్ళం.
ఇది ఇలా ఉండగా ఆ శోధన సమయమంతా కూడా మాకు మేమె మార్గదర్శకులం- అమ్మ, నాన్న , అక్క , బంధువులు ఎవ్వరూ వద్దు మాకు మేమే దిశా నిర్డేశం అన్న ధీమా !! ఇంటి దగ్గర నుండీ ఫోన్ వచ్హిందంటే మాట్లాడాలంటే భయం. ఎందుకో తెలీదు 21 యేల్లు అడిగినదల్లా ఇచ్హి మా అనందంకోసం వాళ్ళ ఆనందాన్ని సైతం తాకట్టు పెట్టినా కూడా. బహుశా అంతే ప్రేమతో ఇక వాళ్ళు జీవితాంతం మనకోసమే బ్రతుకాల్సివస్తుందేమో అన్న భయమెమో ? వాళ్ళు ఫోన్ చేసినా కేవలం మన బాగోగుల కోసం తపిస్తున్న మాటలే వినపడతాయనేమో ?. మనకోసం ఎవరో ఎదో చేస్తారు అని - ఫలానా వాల్లని కలువు ఈ ఫలానా వాళ్ళని పిలువు అన్నమాటలు వినటం ఇష్టం లేక కొన్నాళ్ళు అసలు ఫోన్ లో మాట్లాడటమే మానేసా. అదలా ఉండగా కంప్యూటర్ ముందు కళ్ళప్పగించుకు చూస్తూ చేసే జాబ్ కి తప్ప వెరే జాబ్ కి మేము ఫిట్ కాదు అని తెలియకేమో అప్పుడప్పుడూ వచ్హే ప్రభుత్వోద్యోగాలకి సైతం కొందరు దరకాస్తు చేసేవాళ్ళు.
ఇదిలా ఉండగా అక్క ఇచ్హిన మూడువేలూ అయిపొయే స్థితి మొదలయ్యింది, దానితో ఎమి చేయాలో తెలియని సందిగ్దం, అప్పుడే ఒక స్నేహితుడు మంచి (మొదటి) అవకాశం ఇచ్హాడు,అదే సిస్టం ఇన్స్టలేషన్ & కాన్ ఫిగరేషన్ పని. మా స్నేహితుడు ఒకడు దుబాయ్ వెల్లబోయే ఒక వ్యక్తికి (.NET) వాళ్ళ ఇంటివద్దనే (Home Tuition) నేర్పేవాడు. వాళ్ళకి ఇన్స్టలేషన్ & కాన్ ఫిగరేషన్ చేస్తే ఎంతో కొంత ఇస్తారనటంతో అందె వచ్హిన అవకాశాన్ని అందిబుచ్హుకున్నా! అదే బహుసా నా మొదటి సంపాదనేమో ! అది అనిమిది వందల రూపాయలు అని గుర్తు. ఒకానోక రోజు కూకట్ పల్లి లో నన్ను చూసిన మా అన్నయ( cousin) ఎక్కడ ఉంటున్నావ్ అని అడగటంతో రూం చూపించక తప్పలేదు. కాని విస్తు పోయిన తను నన్ను ఆలోచించుకునే సమయం లేకుండానే తీసుకెళ్ళి తన రూంలో దింపాడు. ఎదో భంధం .... భలే బాధనిపించింది !
ఆ తర్వాత ఏమి చెయాలో తోచక కాళీ గా కూర్చోలేక మా అన్నయ వాళ్ళ నెట్2ఫోన్ షాపులో పని చెయటం తెలుసుకున్నా అది చాలా తేలికయిన పనే, వచ్హే కస్టమర్లకి వాళ్ళకి కావల్సిన దేశానికి ఫోనులు కలపటం. కేవలం ఏ లయిను ఏ దేశానికో తెలుసుకుని సరిగ్గా కనెక్ట్ చెయటమే ! ఇది ఇలా ఉండగా అవసరాన్ని బట్టీ కొంత సేపు సిస్టం లు సెర్వీస్ చెయటం మరి కొంత సేపు ఇంటెర్నెట్ సెంటర్లో పనిచేయటం(అవన్నీ మా అన్నయ్య షాపులే ) ;ఎదంటే అది కాళీగా ఉండకుండా చేసేవాడిని. అది నిజంగా బిజినెస్ పట్ల నాకు ఒక అవగాహన నేర్పింది అని చెప్పాలి.ఇవ్వన్నీ ఇలా ఉంటే మరో పక్క జాబ్ ప్రయత్నాలు వదలలేదు.
అప్పుడే నా స్నేహితుడు ఒకడు తను చెపుతున్న టూషన్ (Home Tuition) మద్యలో మానాల్సి రావటంతో ఆ అవకాశం నన్ను తీసుకోమని చెప్పాడు.మరో ఆలోచన లేకుండా తన పని కొనసాగించా! వీటన్నిటికీ కారణం కేవలం ఇంటి నుండీ వచ్హాక డబ్బుకోసం ఎట్టిపరిస్తితుల్లోనూ అమ్మ - నాన్నలపై ఆధారపడకూదదు అన్న ధ్రుడమయిన సంకల్పం మాత్రమే .అదలా ఉండగా అత్యంత హంగామ చేస్తూ టీ.వీలో భారీ పబ్లిసిటీ తో వచ్హిన జాబ్ ఫేయిర్ రానే వచ్హింది. అది నిర్వహించిన హైటెక్స్ గ్రౌండ్స్ ఇప్పటికీ కల్లలోనే మెదులుతూ ఉంటుంది. అంత అద్బుతమయిన కట్టడాలని నిజంగా నా కళ్ళతో చూడటం బహుశా అదే మొదటీసారి అనుకుంట ! కానీ అక్కడ నిర్వహించిన సెలక్షన్ ప్రోసెస్ లో వచ్హిన ఆఫర్ కి ఆఫర్ లెటర్ మాత్రం ఇంత వరకు నన్ను చేరలేదు.అదే ఆ జాబ్ ఫెయిర్ కి కొసమెరుపు .
అసలు కధ మలుపు తీరిగింది మాత్రం నేను ఆల్-హబీబ్ అనే ఒక ఇంజనీరిగ్ కాలేజిలో లెక్చరర్ గా చేరిన తర్వాత మాత్రమే! నాకు ఆ రోజు జరిగిన సెలక్షన్ ప్రాసెస్ ఇప్పటికీ గుర్తే ! ఎంతో మంది అనుభవం ఉన్న అధ్యాపకులు ఉద్యొగానికి వచ్హిన శర్మ అనే ఆ కాలేజి ప్రిన్సిపాల్ మాత్రం నా బోధనా విధానం నచ్హిందని నన్ను సెలక్ట్ చేసారు.చెసేది ఎమీ లేక ముందు ఉన్న అవకాశాన్ని వదలలేక జాయిన్ అవ్వటానికి అంఘీకరించా !! ఇక అక్కడ ప్రయాణం ఇంచుమించు ఒక ఆరు నెలలు పైననే జరిగింది, ఈ అనుభవం నిజంగా నా ఇంజనీరింగ్ కోర్ సబ్జక్ట్లన్నీ మళ్ళీ జ్ఞప్తికి తెచ్హింది.ఒక పక్క ఇక్కడ చెపుతూనే అమెరికాకి అంభవజ్ఞులయిన అద్బుతమయిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లని తయారు చేసి అందించిన అమీర్ పేట లోనే (MS SQL server ) నేర్చుకునే వాడిని .ఇలాఉంటూనే అదే కాలేజిలో పడిన కొత్తపోస్టులకి నా ఫ్రెండ్స్ ని రెకమెండ్ చేసె వాడిని, వాళ్ళలో కొందరు నాతో అక్కడే పని చేయటం నిజంగా నాకు బలే అరుదయిన ఆనందాన్ని మిగిల్చింది.
అమీర్ పేట నిజంగా మా పాలిట మరో కల్ప తరువు అనే చెప్పాలి ఎందుకంటే ఈ చెట్టు కింద నీడ మాకు మా పాత స్నేహితులని ఎంతో మందిని కలిపేది, ఈ తరువే మాకు భోలెడంత జ్ఞానాన్ని ఇచ్హేది.ఆశ్చర్యంగా మేము అంతా కలిసే ప్లేసు పేరు కూడా "మైత్రీ వనం" ఇక్కడ కలిసినప్పుడు మేము ఎంత కలత చెంది ఉన్న సరే ఇట్టే మనసు పులకరించేది. అదే కాలేజిలో సెమిస్టర్ ముగియగానే ప్రిన్సిపాల్ నన్ను కాలీ గా ఉంచటం ఇష్టంలేక తనకి పెర్సనల్ సెక్రెటరీ గా ఉంచుకుని తన కూడా ప్రతీ ముఖ్యమయిన పనికి తిప్పుకునే వాడు. కొన్నాళ్ళకి ప్లేస్మెంట్ వ్యవహారాలు అప్పగించాడు. కానీ ఎప్పటి నుండో కంప్యూటర్ భాషలలో నాకున్న పట్టుని గమనించిన సహొద్యోగులు, ఇంకా నాకు బాగా కావల్సిన ఫ్రెండ్స్ కొందరు పట్టు పట్టి నన్ను ఆ ఉద్యోగం మానాల్సిందిగా బలవంతం చేసి నాకు కొత్త మార్గం అవసరం అని బల్ల గుద్ది చెప్పారు. అంతమంది శ్రేయోభిలాషుల ఆశీశులు నన్ను సునాయాసంగానే కొత్త గాలికై వెతికెట్టు చేసాయి.
అప్పటికే బెంగుళూరులో ఒకరొకరుగా స్థిరపడుతున్న ఆప్తమిత్రులు కొందరు "నాకు అప్పటికే చాలా ఆలస్యం అయ్యిందనీ అయినా అక్కడ ప్రయత్నం మంచిదని" నన్ను అప్రయత్నంగానే అక్కడికి రప్పించారు !!! ఆ విధంగా హైదరా బాదులో హంటింగ్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టి బెంగుళూరు మహానగరానికి ఒక రైలు టికెట్టు కొన్నాను.
ఈ విధంగా అప్పటివరకూ
పులిహోరలో పులుపు మాత్రమే తెలిసిన నాకు ... భావార్చి లో బిర్యాని ఘుమఘుమగలు చూపింది మన భాగ్యనగరం.జీవితంలో కష్టాలని ఎంత సులువుగా అదిగమించొచ్హో నేర్చింది ఇక్కడే ! కళ్ళ ముందు ఉన్న అవకాశం విలువ వదలక ముందే తెలుసుకున్న నేను నిజంగా అద్రుష్టవంతున్నే కాక ఆలస్యించిన ఆశా బంఘం అన్న అర్దాన్ని అవలీలగా అర్దం చేసుకున్నా అనుకుంటా !!
ఉద్యోగపర్వం
హైదరాబాద్ లో హంటింగ్ (ఉద్యోగపర్వం - ద్వితియాశ్వాసం )
సిలికాన్ సిటీ లో సెర్చింగ్ (ఉద్యోగపర్వం - త్రుతియాశ్వాసం )
అమాయకంగా అమెరికాయానం...(ఉద్యోగపర్వం - చతుర్దాశ్వాసం )
మాంద్యం దెబ్బ - మరో జాబ్ దొరికిందబ్బా !! (ఉద్యోగపర్వం - పంచమశ్వాసం) * Coming soon *
P.S : ఈ టపా రాస్తున్నంత సేపూ మదిలో మెదిలిన మరెన్నో మదురానుభూతులని ఇక్కడ అసందర్భోచితంగా తోచి కేవలం నా మదిలోనే ఉంచుకున్నాను.కనీసం కుదిరితే మరొక ప్రత్యేక టపాలో పొందుపరచగలను.
14 comments:
awesomee.. really.. no other words dude..
chaala baaga raasaaru.........chaala mandi ni choosanu ila kashta padda vallani.....nijam ga great anni choosaru lifelo inka meeku eduruledu
వేణు గారూ దన్యవాధాలు
గోగినేని వినయ్ గారూ !! నాలాగా నా స్నేహితులు చాలా మంది ఇలా పైకి వచ్హినవాళ్ళే ! కష్టే ఫలీ అన్న దానినే నమ్ముతాను నేను.
hmmm..... babu chala baga rasavu....aa job fair ayite nakinka gurtu undi only resumes teesukuni pampinchina konni vatilo select ayyi offer letter raka poyina college frnds ni pata frnds ni kalavadaniki matram manchi place..sweet memorable moments
అవును దీపా ! అప్పట్లో హైదరాబదులో జరిగిన ఆ జాబ్ ఫెయిర్ ఇంచు మించు ఎక్కడో జాబ్ కోసం వెతుకుంటున్న మన ఫ్రెండ్స్ అందరిని ఒకే దగ్గర కలిపిందనే చెప్పాలి
Hi Krishna babu........(not only u)prathi okka student bayataku ragane pade kastalu ,job kosam searchings ,inka e hyd lo jivitham ento nerchukovadam ivvani marcipoleni anubutulu.....mana life lo santhosha kshanalane kaka kastapadina kshanalanu kuda gurthu unchukovali.....chala baga rasav.....
చదువుతూంటె గుర్తు వస్తున్న ఆ జ్ఞాపకాల వలలో ఇరుకు పోయా, ఒక్కసారి గుందె బరువు ఇక్కింది
రెయల్లీ గ్రేట్ మామా, 10 నిమషాలు ఎవరి తోనూ మట్లాడకుండా నన్ను జ్ఞాపకల జల్లులొ ముంచేసిన నీ రచనకి నా శిరసాభివందనాలు
-త్రివిక్రం శ్రీనివాస్
బాబూ...చాలా బాగా రాసావు...ఒక్క చాలా సరిపోదేమో....?! మనసులోన ఆవేదన ప్రతిబింబించేలా.....ఆ సమయంలో వుద్యోగ ఆవశ్యకత అర్ధమయ్యేలా.....ప్రతి వ్యక్తీ ఆలోచించేలా.....చాలా బాగా రాసావు.. ముందు పోస్ట్ కంటే ఈ పోస్ట్ చాలా చాలా చాలా బాగుందని చెప్పాలి....నీ భావ వ్యక్తీకరణ చాలా నచ్చింది.....ఆ మైత్రీ వనం మన లాంటి వాళ్లకు ఎంత మందికి నేర్పిందో జీవితాన్ని చదవటం...Keep rocking dude!!
శ్వేతా, నువ్వన్నది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ !జీవితం మనకి నేర్పిన పాటాలూ జీవితంలో మనం నేర్చుకున్న పాటాలూ ఎన్నటికీ మరిచిపోని మధురానుబూతుల నిధులే !
శ్రీనూ !! నిన్ను ఒక్కసారిగా అంత ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నా!! అయినా ఆ తీపి బాధ నీకు ఎంతో బాగుందని అర్ధం అవుతుందిలే . మరొక్క సారి కృతజ్ఞతలు
వళీ(దౌబ్లెఒనెసిక్ష్) !! ఇది నిజానికి ఇప్పుడైతే నా అవేదన మాత్రం కానే కాదు, ఇది కేవలం నా మదిలో దాగి ఉన్న తీపి జ్ఞాపకాల గుర్తులు మాత్రమే! మరొక్క సారి కృతజ్ఞతలు
Kaste phali annaru peddalu adi me visyam lo nijam ayindane anukuntunnanu. Memu kastalni face chesam kani mari inta kadu.
Me sudheerga mayina vyasam chusaka naku meru oka "Trivikram Srinivas" ga Kanipistunnaru
Thanks Diwakar :)
ne teepi matalu entho ede undi ,
kasta padevalaku eppudu vijayam swagatham paduthundi,
enno gundello unna jynapakalanu vulik padela chesavu ..
elage ne jynapakalanu matho panchukovale ..
ne matalu vere vallaku batalu kavalane na asha .....
that's so great of you my dear...
cheers :)
Thanks teja
Post a Comment
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...