Friday, October 30, 2009

అమాయకంగా అమెరికాయానం...(ఉద్యోగపర్వం - చతుర్దాశ్వాసం )

అమాయకంగా అమెరికాయానం...(ఉద్యోగపర్వం - చతుర్దాశ్వాసం )

ఈ బాగానికి నిజానికి పేరు అలా ఉంది గని అది కేవలం ముగింపు మాత్రమే ! అసలు కధలోకి వస్తే; చచ్హి చెడీ, చమటోడ్చి, చేతి కి బొబ్బలెక్కే లాగా కష్ట పడితేగాని జాబ్ రాలేదండి.ఎంతయిన కష్టపడి సాదించిన ప్రతీ విషయంలోనూ ఎంత ఆనందం ఉంటుందో నేను కొత్తగా ఎవ్వరికి చెప్పనక్కర్లేక పొయినా ఇక్కడ నేను మీతో పంచుకోబోయే ప్రతీ విష్యం నా ఆనందపు అవధులను మీకు అర్దం అయ్యేలాచేస్తాయి.

మొత్తానికి కార్పొరేట్ లో కార్పెట్ మీద కాలు పెట్టేసాం, ఎదో వ్యత్యాసం-ఎదో ఉత్సాహం, ఎదో కనువిందు - ఎంతో ఆనందం, పని తక్కువ- పులకింతెక్కువ. పని లేకపొయినా, పని కాని పని ని పని గా పదిమందికి పదే పదే పనిగట్టుకుని పనిగా చూపించే పనికిరాని వ్యక్తే మెనేజర్ !! అలాంటి అద్భుతమయిన శక్తి కల మా శక్తిమాన్ జాయిన్ అయిన మొదటిరోజునుండే ఆఫీసులో ఫార్మాలిటీలు, పరిచయాలూ, ట్రైనింగ్ తదితర కార్యక్రమాలూ కొలిక్కి రాకుండానే ఎదో పిండి చేయాల్సిన కొండలు బోలెడునట్లు తీసుకొచ్హి ఒక కంప్యూటర్ ముందు పడేసాడు. ఎదో పావలాకి కూడా పనికి రాని పనిని మిలియన్ డాలర్లకి పొందాలనే తపనతో ఒకరికి నలుగురిని ఇచ్హి పగలు-రాత్రి పనున్నా లేకపొయిన ఎదోఒకటి చేసేయమనే వాడు. వాడి ఉత్సాహాన్ని ఎందుకు కాదనాలని ఎదో అలా బండి నడుపుతూ ఉండే వాళ్ళు మిగిలిన వాళ్ళంతా!!

మనకా ఆ కార్పొరేట్ కల్చర్ అంతగా తెలియదేమో విన్న ప్రతీది వింతే, కన్న ప్రతీది కొత్తే. కార్పొరేట్లో కామన్ కాన్సెప్ట్ ఏమిటంటే, కళ్ళ ముందు కావల్సినన్ని కలర్స్ కనపడుతున్నా కూడా మన పక్క సీట్లో కనీసం అమ్మాయి కూడా పడదు.(ఈ బాధ నా ఒక్కడిదీ కాదండోయ్, ఏళ్ళ తరబడి ఇలాంటి బాధ అనుభవిస్తున అనేక మంది యువకులదే!). కాలు పక్కకి తీస్తే "థాంక్స్" కాఫీ కలిపిస్తే "థాంక్స్" దానికీ దీనికి అని లేదు పక్కనోడికి ఎన్ని థాంక్స్ లు చెప్తే అంత కార్పొరేట్ అనుకుంట. మొత్తానికి అలా చీటికి మాటికీ "థాంక్స్" చెప్పటం నెమ్మదిగా అలవాటు అయిపోయింది.

ఇలా ఆఫీసులో ఏమి చేస్తున్నామో మాకే తెలియకుండా ఇంచుమించు ఆరు నెలలు గడిచిపొయాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే నేర్చుకున్న కార్పొరేట్ కల్చర్, ప్రతి ఆదివారం అదే పనిగా తొమ్మిది సార్లు థియేటరులో చూసిన పోకిరి సినిమా తప్ప వెరే ఎమీ కనపడటం లేదు. ఒక్కసారి ఒళ్ళు గగ్గుర్లు పుట్టి నేర్చుకున జావా, డాట్ నెట్, ఓరాకిల్ పాటాలు గిర్రున తిరిగాయి. ఆ అలోచన ఎందుకు ఇంత కష్టపడి ఇవి అన్ని నేర్చుకున్నాం అన్న ఆందోళన మొదలు అయ్యింది.
ఒక రోజు మీటింగు కి పిలిచిన మేనెజరు తలొక 500 రూపాయల విలువగల సొడెక్స్ గిఫ్ట్ కూపన్ ఇచ్హి మన ప్రాజెక్ట్ పూర్తి అయ్యింది ఇక మీరు ఎంజాయ్ చేయండి త్వరలోనే ఇంకో ప్రాజక్ట్కి మూవ్ చెస్తాం అని చెప్పటంతో గుండె గుబేలంది. అలా రీసౌర్స్ పూల్ లో కుడితిలో ఎలక్కలాగా కొట్టుకుంటున్న మాకు యునిక్స్ అనే ఒక ఇంటర్వ్యూ దొరికింది, కాలక్షేపానికి ఫ్రెండు దగ్గర నేర్చుకున్న నాకు అదే అమృతంలా పని చేసింది. మొత్తనికి సులువు గానే కొత్త ప్రాజెక్ట్లో పడ్డాం.
ఎమి జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకునే లోగానే బోలెడంత నేర్చుకున్నాం, క్లయింట్ కాల్స్ లో ఎలా మాట్లాడాలో , కొత్త టాస్క్ లు ఎలా క్రెయేట్ చెయాలో, బిల్లింగ్ ఎల జరుగుతుందో అంతా భలే గమ్మత్తుగా గడిచింది. ప్రతీ నెలా టీం లంచులు, ఆరు నెలలకొకసారి టీం అవుటింగులూ, ఏడాదికి ఒకసారి గిఫ్టులు అబ్బో ఒకటేమిటి అంతా మజాలే, చిన్న చిన్న ప్రాబ్లంస్ సాల్వు చేసినా కూడా క్లయింటు కి నచ్హితే (వాడికి డబ్బులు ఎక్కువ ఉంటే ) పొగడ్తలతో ముంచ్హెత్తేవాడంటే నమ్మండి.

అలా సాఫీ జరుగుతున్న సాఫ్ట్ వేర్ ప్రయాణంలో ఒక్కసారి పెద్ద అల "అమెరికా చాన్స్". అది నాకు అల కాదు పెద్ద సునామిగా కనపదింది. ఎందుకంటే టీంలో అప్పటికే నాకన్న ఎక్కువ అనుభవం ఉన్న (కూడా అమెరికా వెళ్ళని ) వాళ్ళు ఉండటంతో నాకు ఆ అద్రుష్టం దూరమనే అనుకున్నా, కానీ నా అంచనా తప్పౌ అయ్యింది. ఒక రోజు క్లయింటు చాటింగ్ లో పింగ్ చేసి నీకు పాస్ పోర్ట్ ఉందా అని అడిగాడు. ఉంది అని చెప్పటంతో నీకు కొత్త ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెల్లాల్సిన అవసరం ఉంది, వెల్తావా ? అని చాలా సింపుల్ గా అడిగాడు. "కల కానిదీ ... నిజమయినదీ...." అంకుంటూ వెంటనే నేను ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవచ్హా అని అడిగా ! దానికి సమాదానం నువ్వె వచ్హాక చెప్పాలి దానికి బాగా డేటాబేస్ మీద గ్రిప్పు ఉన్నవాళ్ళు కావలి అందుకే నిన్ను పంపుతున్నాం అన్నాడు.

ఇంకేముంది కట్ చేస్తే చెన్నయ్ లో అమెరికా ఎంబసీలో, ఒక తెల్లావిడ ముందు నుంచుని పాస్ పోర్ట్ ఆమే చెతికిచ్హాను. కొన్నాలకే వీసా చేతికందటంతో ఆఫీసులో ఇచ్హిన అమెరికా డాలర్లు జేబులో పెట్టుకుని, పాస్ పోర్ట్ ఒక చేత్తో పట్టుకుని ఇంకో చెత్తో అమ్మ-నాన్నలకీ ఇంక ఫ్రెండ్స్ కీ టాటా చెప్పేసి ప్లయిటు ఎక్కేసాం.
ఇంక ఇలా అమెరికా లో అడుగు పెట్టానో లెదో ; తెలుగు సినిమాలో హీరో ఎంట్రన్సు సీను లాగా ఒకటే ఈదురుగాలి ... అప్పుడు తెలిసింది అక్కడి నవంబరు నెల ఎలా ఉంతుందో.....అబ్బో ఇలా అమెరికాలో నా ఆనందాలు రాసుకుంటూ పొతే ఇంకో టపా అవుతుంది ...ఆ ఆఫీసులు, ఆ రోడ్లు, ఆ పద్దతులు, ఆ మనుషులు, ఆ న్యూయార్క్ బ్రిడ్జ్, ఆ లిబర్టి స్టాట్యూ, అబ్బ అబ్బ ... ఒకటేమిటిలే ఆ రోజులే వేరు ...
ఇదంతా బాగా చెప్పలంటే నా మాటలు చాలవు ... వేటురి గారు రాయలి, రెహ్మాన్ పాడాలి ...అదే న్యూయార్క్ నగరం నిదురోయ వేల నెనొక ఒంటరి ...
మీరు ఈ పాట చూడాల్సిందే !! ఈ కింద లింకు క్లిక్ చెయండి ...
http://krishnabab.blogspot.com/2009/10/newyork-nagaram-telugu-lyrics.html


ఉద్యోగపర్వం
అమాయకంగా అమెరికాయానం...(ఉద్యోగపర్వం - చతుర్దాశ్వాసం )
మాంద్యం దెబ్బ - మరో జాబ్ దొరికిందబ్బా !! (ఉద్యోగపర్వం - పంచమశ్వాసం) * Coming soon *

5 comments:

meera said...

So, are u gonna write one more post , describing about America?

Anonymous said...

Raamaayanam lo pidakala veta ...
most of "Newyork nagaram nidaroyavela" song shot in Swiss :-)

Will be waiting for reading your experiences in USA

Bhãskar Rãmarãju said...

రాయయ్యా! రాసి అవతలనూకు. సదివికూకుంటాం. అమ్రికాలో అంతా ఎడంవైపు నడుత్తారన్టగా, నిజవేనా?

Anonymous said...

ఎదో పిండి చేయాల్సిన కొండలు బోలెడునట్లు తీసుకొచ్హి ఒక కంప్యూటర్ ముందు పడేసాడు.
మీ హ్యూమర్ బాగుంది. కీపిటప్....నూతక్కి

Krishna said...

thanks to భాస్కర్ రామరాజు and nutakki

Post a Comment

వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...