Wednesday, April 8, 2009

బూటు గొప్పా ? పెన్ను గొప్పా ?

బూటు గొప్పా ? పెన్ను గొప్పా ?
"The pen is mightier than the sword" ఈ అంగ్లసామెత నేను చిన్నతనం లో చదివినది. ఎందుకో తెలియదు గాని నాకు ఇది బాగా మనసులో ముద్రించుకుంది. దీని అర్దం ఎమిటంటే రాజు గారి కత్తి తో చేయలేనిది కూడా కవి కలం తో సాధించగలడు అని.ఆది నా మనసులో అంత బలంగా ఉండటంవల్లనే నేను ఎప్పుడూ నా కలానికి పదును పెడుతూ ఉంటా.కానీ ఈ మద్య జరిగిన ఒకటి రెండు వాస్థవ సంఘటనలు మీ-నా బలమయిన నమ్మకాలకు సైతం గుబులు పుట్టిస్తున్నాయి.నాకు జర్నలిస్టులు అంటే బలే గౌరవం. ఒక విషయం క్షుణ్ణంగా తెలుసుకుని, దాన్ని పది మందికి అర్ధం అయ్యెట్టూ చెప్పటంలో వీరికి వీరే సాటి.మనదేశం లోనే కాదూ ఈ ప్రపంచంలోనే ఎంత ముఖ్యమయిన ప్రదేశానికైన సునాయాసంగా ప్రవేసానుమతి లభించేది కేవలం ఈ జర్నలిస్టులకే.వీరు రాసే ప్రతీ అక్షరం ప్రజలకు మేలుకొలుపు. అందుకనే వీరి కలానికి ఉన్న పదును-పాటవము ఇక దేనికీ ఉండదు. ఇది అంటే ఎంతటి వారయినా జడవాల్సిందే. అలాంటిది ఇంత బలం ఉన్న పెన్ను వదిలి ఒక జర్నలిస్టు తన బూటుకి ఎందుకు పనిచెపుతున్నాడు? వీళ్ళు పెన్ను వదిలి బూటు ఎందుకు చేతిలోకి తీసుకుంటున్నారు?

దేనండి నేను చెపుతూన్నది నిన్న జరిగిన సంఘటన గురించి.సరిగ్గా ఇలాంటిదే ఆ మద్య ఇరాక్ లో ఒకటి జరిగింది.

Muntazer al-Zaidi, అనే ఒక ఇరాక్ జర్నలిస్ట్ అమేరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ గారి మీద తన బూటు విసిరి నిరసన వ్యక్తపరిచారు.2003 నాటి ఇరాక్ పై దాడులకు కారణం బుష్ అని, అక్కడి ప్రజల విస్వాసం కావటంతో ఈ జర్నలిస్ట్ చర్యని అక్కడి ప్రజలు శ్లాగించారు.ఈ విధం గా తాను బుష్ పై బూటు విసరటానికి ఎప్పటినుండో తయారవుతున్నాడు అని తన తోటి ఉద్యోగులు చెప్పటం నిజంగా గమనార్హం. ఇది అంతా కేవలం తన దేశ భక్తిగా భావించినా కూడా ఆ విధంగా మరొక దేశాద్యక్షుడిపై బూటు విసరటం అన్నది అదీ తను విధి నిర్వహణలో ఉన్న విషయం మరిచి అన్నది చర్చనీయాంశం.


తేది : 7 ఎప్రిల్ 2009
కేంద్ర హోం మంత్రి చితంబరం గారి మీద ఒక సిక్కు జర్నలిస్టు (Jarnail Singh) తన బూటుని విసిరి తన అసహనాన్ని వ్యక్తపరిచారు. 1984 సిక్కుల పై దాడికి సంబందించిన కేసులో నింధితులకి(Jagdish Tytler, Sajjan Kumar) కోర్టు ఇచ్హిన తీర్పుని చితంబరం విశదీకరిస్తుండగా జరిగిన ఈ సంఘటన కి కారణం కేవలం ఆ శిక్కు జర్నలిస్టుకి తీర్పుపై ఉన్న అస్సమ్మతి భావమే అని అర్దం అవుతుంది.

ఈ రెండు ఘటనలలోనూ జర్నలిస్టుల పనిని పొగిడే వర్గం లేకపోలేదు.నా వరకు నాకు -
"జర్నలిస్టులు వార్తలని అందచేయాలే కానీ వారే వార్త కాకుడదు."
ఇకనయినా జర్నలిస్టులు తమ బాధ్యతెరిగి, తమ హోదా గుర్తుంచుకుని దానికి తగట్టూ నిబద్దతతో పనిచేస్తూ,ఇటువంటి దుశ్చర్యలకి దూరంగా ఉంటారని తమ మంచి పేరు కాపాడుకుంటారనీ భావిద్దాం.


దీనికి సంభందించిన మరిన్ని లంకెలు : [1] [2] [3] [4] [5]

12 comments:

Unknown said...

Superrrrrr; old proverb but strong one.
Image 1 is not available. Please add it

చదువరి said...

బుష్షు మీదకు ఆడెవడో బూటు విసిరితే నాకు సమ్మగానే అనిపించింది. కానీ ఎందుకో ఈ ఘటన నచ్చలేదు. మనిషి మీదకు చెప్పులిసరడం అనాగరికమే -పాత్రికేయులైనా, మరెవరైనా!

Hima bindu said...

'.జర్నలిస్టులు ...........వార్త కాకూడదు "....చాల బావుంది .

Unknown said...

The smarter the journalists are,the better the society is...

Krishna said...

గణి గారికి, చదువరికి, చిన్ని గారికి , అల గారికి అందరికీ పేరు పేరు నా క్రుతజ్ఞతలు.

jojo said...

బాగా చెప్పారు. నేను ఈ లైన్లో నే రాద్దామనుకున్నా. ఎందుకో లైన్ తప్పి బూటంటే చేదా.. విసిరే ఉద్దేశం లేదా అని రాశా. కారణం మన తెలుగు మీడియానే. వీరు విలువలకు పాతరేస్తున్న తీరు కంపరం పుట్టిస్తోంది.

Krishna said...

వెన్నెల రాజ్యం గారూ మీ ప్రాస కూడా బాగానే ఉంది.

Kathi Mahesh Kumar said...

చాలా "సిల్లీ" ఘటన.

మురళి said...

పాత్రికేయులు భావోద్వేగాలకు అతీతంగా పని చేయాలి. కానీ 'వాళ్ళూ మామూలు మనుషులే.. భావోద్వేగాలు వాళ్ళకీ ఉంటాయి' అని ఇలాంటి సంఘటనలు నిరూపిస్తూ ఉంటాయి. మీరు రాసిన విధానం బాగుంది.

భాస్కర రామిరెడ్డి said...

పెన్నుతో మాట వినడం లేదని ఇప్పుడు బూట్లు వేస్తున్నరంట !

గీతాచార్య said...

Wat they did is entirely wrong. That Journo could have conained himself.

Vamsi said...

Mee abhiprayam tho nenu yekibhavistanu...kani prastuta praristhulu chustunte...kalam balam e kala gamananni e matram marchaledomo anipistundi...

Post a Comment

వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...