Monday, April 27, 2009

' ఆధినేత ' కాలేకపోయిన ' సామాన్యుడు '

సామాన్యుడు లాంటి ఒక మంచి సినిమాలో నటించిన మన జగపతి బాబు ఈ సారి అధినేతగా ముందుకు వచ్హి నన్ను నిరుత్సాహ పరిచాడు. దర్సకత్వం ' సముద్ర ' అని ముందే తెలిస్తే సినిమా చూడటానికి కొంచెం సందేహించేవాడినేమో? కనీసం ' నవతరంగంలో ' రివ్యూ చదివినా బతికే వాడిని ...మొత్తానికి బలి. అయినా అన్ని తెలుగు సినిమాలని ఆదరించే నాలాంటి అమాయకులకి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదులెండి.

ఆంధ్రాలో ఎన్నికల హడావిడి - వాతావరణంలో వేడి రెండూ కాస్త చల్లబడ్డాయి కధా అని సరదాగా సినిమా కి బయలుదేరాను.మధ్యలో ఎందుకో కాఫీ - డే కనపడితే ఒక Cafe Frappe(Ice cream and coffee blended to smooth, creamy perfection - Irish style) తాగేసి సినిమాకి బయలుదేరదాం అని నా పల్సర్ కి ఒక బ్రేకు వేసా.

అలా కాఫీ ఆర్డరు ఇచ్హానో లేదో ఇంతలో "తూ మేరి అధూరి ప్యాస్ ప్యాస్ ..." అంటూ పాట వినపడింది. ఎదో అలోచనలో ఉన్న నాకు, నా ఫ్రెండు " ఓరే నీ ఫొనేరా రింగ్ అవుతుంది, దాని బాధ చూడు అన్నాడు". ఫొన్ లిఫ్ట్ చెస్తే అవతలివైపు నా మరో ఫ్రెండు... ( ఫ్రె = ఫ్రెండు,నే = నేను )

ఫ్రె : మామా ఎక్కడ ఉన్నవ్ ???
నే : కాఫీ డే రా !!
ఫ్రె : ఏంటి కధ? ఉదయంనుండి ఎమిచేసావ్ ?
నే : ఎముందిరా రొటీన్ వీక్-ఎండ్ రా. బాగా లేట్ గా లేచి ఇందాకే లంచ్ చేసి సినెమాకి అని బయలుదేరాం. మద్యలో కాఫి కి ఆగాం.
ఫ్రె : కొంప తీసి ' అధినేత ' సినిమాకా ??
నే : కొంపలు గట్రా తీయలేదుగని జస్ట్ పర్స్ తీసుకుని బయలుదేరాం రా అంతే ! అయినా బెంగుళూరులో ఇంక కొత్త తెలుగు సినిమాలు ఎమీ లేవు కధరా ?
ఫ్రె : అదిసరే బాబాయ్ ఇప్పుడు నీకు ఆ సినిమా ఆవసరమా అని ?
నే : అదేంటిరా అంత మాట అన్నావ్ ? బెంగుళూరులో ఉంటున్న ఒక అంధ్రుడుగా రిలీజు అయిన తెలుగు సినిమా చుడటం నా హక్కు !!
ఫ్రె : అది కాదు చిన్నా !! ఇప్పుడే ఆ సినిమా హాలులోనుండీ బయటకు వస్తున్నా, అంత విషయం లేదు లేరా !! 
నే : ఏదిఎమయిన " తెలుగు సినిమా నా జన్మ హక్కు " నేను వెళ్తున్నా, ఫోన్ పెట్టెయ్ మళ్ళీ టికెట్లు దొరకవ్ !!
ఫ్రె : ఒరేయ్ అక్కడ అంత విషయం లేదు రా !! హాలు అంతా కా...కుయ్ కుయ్
(వెధవ కంగారు ఎదుటి వాడి మాట సరిగా ఎనాడయినా వింటేనా !!) విని ఉంటే బతికి పోయేవాడిని ...

ఫోన్ పెట్టేసి, బిల్లు కట్టేసి, బండి తోలేసి మొత్తానికి ట్రాఫిక్ బారిన పడకుండా థియేటరు చేరాము.టిక్కెట్లు ఎక్కడ దొరకవో అన్న ఆదుర్దాతో మా ఫ్రెండు ఒరే నువ్వు బైక్ పార్క్ చేసి వచ్హేయ్ నేను టిక్కెట్స్ కొంటాను అన్నాడు !! సరే అని నేను ఆ పని చేసి వచ్హా. టికెట్లు దొరికేసాయి రా !! నో ప్రాబ్లం (ఏదో సాధించేసినట్టు!).నంబరింగ్ లేదు రా, త్వరగా పద, ఫ్యాను కింద కుర్చుందాం అంటూ మావాడు తొందర చేస్తే లోపలికి వెళ్ళాము.

ఫ్యాను కింద కుర్చున్నంత మాత్రాన చల్లగా ఉంటుందనుకున్న మా అమాయకత్వానికి సరి అయిన గుణపాటం ఈ సినిమా అని బయటకి వచ్హేటప్పుడు అర్దం అయ్యింది.

సినిమాలో ముఖ్యాంశాలు :
  • సూపర్ స్టారు కృష్ణ డాన్స్ లకి ట్రేడ్ మార్కుగా చెప్పుకునే మన జగపతి డాన్స్ లు,నడకలు .
  • జగపతి బీచ్ పాటలు బాగుంటాయి కదా కనీసం హేరొయిన్ ని అయినా చుద్దాం అనుకుంటే తప్పులో తలున్నట్టే ! తలలో తప్పేమో ?? ఎదో ఒకటి. 
  • ఆంధ్రా సి.ఎం గారిని ఎర్రని, పచ్హని కోట్లు వేసుకున్న ఒక వెరయిటీ డ్రెస్సులలో చూడాలి అనుకుంటే ఇదే మంచి సినిమా.
  • హేరో కోపం ఫైటు తో కాక విలన్ కొత్త ఇంటి ని ఒక శౌచశాల గా వాడుకుని తగ్గించుకునే ఒక విబ్బిన్నమయిన సన్నివేశం కావాలా ?
  • ఆంధ్రాకి సి.ఎం అయ్యాక అతనికి పెళ్ళయితే ? (రెండో పెళ్ళి కాదు మొదటిదే).
  • శ్రీకాంత్ దేవ పెద్ద కష్టపడకుండా కాపీ సంగీతం అందించారు !! (మొనాలిసా అన్న పాట మద్యలో ఒక ట్యూన్ ఒక పాత పాటని(ఉహ్ ఉహు ..సరిగమ విన్నావ ?? ) స్పురించింది. మిగిలిన పాటలలొ సైతం ) 
  • సినిమా దర్శకుడు దీనికన్నా ముందు ఒకే ఒక్కడు అన్న ఒక అద్బుతమయిన సినిమా ఉంది అని మర్చి పోయాడేమో !
మొత్తానికి సామాన్యులకి ఎన్నికల వేడి తగ్గించకుండా ఎన్నికల ఫలితాల వరకైనా ఈ ' అదినేత ' అలరిస్తాడు అందామంటే నోరురావటం లేదండి!

8 comments:

చావాకిరణ్ said...

బాగ వ్రాశారు.
నేనింగా ట్రై చేద్దాం అనుకుంటున్నా. నెనర్లు.

OM said...

Nice article babu....

Indian Minerva said...

ఇంటర్వెల్ అవసరాన్ని నొక్కి వక్కాణించిన సినిమాల్లో ఇదొకటి (the other one being billa). అయినా ఇకెన్ని రోజులండి "మిత్రుడు" వస్తున్నాడుగా దాన్ని చూసి ఇవన్నీ మరిచిపోవచ్చు. నేనైతె పిచ్చ వెయిటింగ్. మాంచి కామెడీ చూసి చాలా రోజులయ్యింది.

Kathi Mahesh Kumar said...

హహహ చాలా బాగుంది.

Krishna said...

కిరణ్ గారు, ఎన్నికల ఫలితాలలోపు సాటిలైటు హక్కులు అమ్మెస్తే ఇంచక్కా ఇంట్లోనే చూడొచ్హు.
ఓం గారికి థాంక్స్.
అరుణ్ గారు మీరు ' మిత్రుడు ' కోసం ఇంత ఇది గా వేచి చూస్తున్నారా ?? కాని ఎందుకో ఈసారి మీరు నిరుత్సాహ పడతారనిపిస్తుంది. చుద్దాం బాలయ్య ఎమి చేస్తాడో ?
మహేష్ గారికి కూడా థాంక్స్..నా బ్లాగు దర్శించినందుకు !

Meera said...

Very funny babu.....neelaga entha mandi bali ayipoyaro??

సుజాత వేల్పూరి said...

ఈ వీకెండ్ నా డబ్బులు, టైము చక్కగా సేవ్ చేసినందుకు కృష్ణకు థాంక్స్ చెప్పాలి!

@#Indian minerva#
మరీ అంత మిస్ అవుతున్నారా?

Jagadeeshkuchi said...

I too thought of going to this movie by watching a show on TV9.But after seeing the review,I changed my mind.Anyway thanks for confirming/proving my decision.Good one babu.please keep blogging whenever a telugu movie is released

Post a Comment

వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...