ఎన్నికలకోసం ఎన్నో కళ్ళతో నాలా ఎదురు చుసే సామాన్య ఓటరు ప్రజలు ఈ భారతావనిలో చాలా మందే ఉంటారు. ఇలాంటోళ్ళకి ఎన్నికలొస్తే వ్రుత్తిరిత్యా పొరుగూరిలో ఉంటున్న నాలాంటి ఔత్సాహిక ఓటరు మనసు ఎంత కుత కుత లాడిపొతుందో నాకు ఇప్పుడిప్పుడే అర్ధం అవుతుంది. ఈ భాధ అంతా కేవలం "ఓటు" అనేది నా ప్రాధమిక హక్కు అన్న స్వార్ధం. ఈ స్వార్ధం లో చాలా అర్దం ఉంది. దీన్ని ఎవ్వర్రు మార్చలేరు.
నాలాగా నాతో బెంగుళూరు లో నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. అందరకీ ఒకే భాధ, ఒకే అలోచన, ఒకే గోల. వెళ్ళాలి ఓటు వెయ్యలి !
నా చిన్నతనంలో కేవలం ఓటు వేయటం కోసం మా అమ్మో, మా మావయ్యో ఇంకా ఎవరయిన చుట్టాలు ప్రయాణాలు చేస్తూంటే నాకు అర్ధం అయ్యేది కాదు అందులోని అంతరార్ధం. ఓటు అన్నది ఎంత ముఖ్యమయిన భాధ్యతగా వాళ్ళు గుర్తించి ఉంటే దాని నిర్వహణకి అంత ప్రయాసపడగలరు ? వారికి ఉన్న ముందు చూపూ, భాద్యత అయినా మా తరానికి లెవేమో అన్న అందోళన నన్ను కదిల్చివేస్తుంది.
రాజకీయాలపైన అవగాహనా,జీవితంపైన అలోచనా ఇంచుమించుగా ఒకేసారి వచ్హే నాలాంటి కుర్రవాళ్ళ పరిస్థితి నిజంగా "అడకత్తెర లో పోక చెక్క" అంటే నమ్మండి. ఒక పక్క ఎలక్షన్ తెదీలు దానికి సంబందించిన మన ప్రియతమ నాయకుల అభ్యర్దనలు మరోపక్క ఆఫీసులో పని.దేనిమీద బుర్ర ఉంచాలో తెలియని పరిస్థితి నాకు.
అర్దికమాంద్యం దెబ్బకి ఆఫీసులో గుండెలు గుప్పెట్లో పెట్టుకుని పని చేసుకునే సాఫ్ట్ వేరు ఇంజనీరుల బాధలే వేరు. ఒక ఈ-మెయులు చదువుదామని చుస్తే ఎలక్షన్లు గురించే, మొబైలు లో మెసేజి కూడా మన చంద్రబాబు పంపిందో లేక బారతీయ జనతాపార్టీ పంపిందో!. ఏది చూస్తున్నా ఎన్నికలకి సంభందించే!! ఇన్ని అలోచనల మధ్య ఆఫీసులో పని చెయ లేక సహొద్యొగులతో కాసేపు అలా మేడపైకి టీ తాగుదామని వెళ్ళినా అక్కడకూడా ఇదే; మనం మాట్లాడక పోయిన మనపక్క టేబుల్లో కూర్చున్నోల్లు "జయలలిత గెలుస్తుందా?" (తమిళంలో - இம்முறை தேர்தலில் ஜெயலலிதா விற்கு வெற்றி உண்டா இம்முறை தேர்தலில் Dr.ஜெயலலிதா விற்கு வெற்றி உண்டா !! )అనో లెకపోతే, కన్నడంలో(ಹೂ ವಿಲ್ ವಿನ್ ಇನ್ ದಿಸ್ ಎಲೆಕ್ಶನ್ಸ್?) ఈ సారి ఎవరు గెలుస్తారనో?? ఎదో ఒక ప్రతీపాదన చేస్తూనే ఉంటారు. అది ఎదో మనల్నే అడిగినట్టూ మనసు దానికి సమధాన్ని మన పక్కన వాళ్ళకి మాటలలో ఇచ్హేస్తుంది.
ఎదో కావల్సివచ్హి ఆఫీసులో పని నిమిత్తమై ఎదో వెబ్ సైటు చుస్తున్నా సరే మన అద్వాని గారి వెబ్ సైటు యాడ్నో లెకపోతే ఇంకో రాజకీయ పార్టీ యాడ్నో ఎదో ఒకటి కంటపడి మరీ చంపేస్తున్నాయి.
మనసాగక ఇంటికి ఫొన్ చెస్తే అంతా ఎన్నికల హడావిడిలో తలమునకలై ఉన్నాం అంటుంటే, ఎదో మిస్స్ అవుతున్నాం అన్న భాధ.
కాసేపు టీవీ చుద్దాం కదా అని టీవీ పెడితే మన మ్రుత్యుంజయుడు జు. NTR ఇక్కడ సైతం తన ఆరొగ్య పరిస్థితి పూర్తిగా నయం కాకపొయిన, మంచం మీద పడుకుని మరీ అదే ఉత్సాహంతో పిచ్హి పిచ్హి గా ప్రచారం చేస్తూ కనపడుతుంటే, మనకి మన బాధ్యత మరింతగా గుర్తువస్తుంది.మాములు రియాలిటి డాన్సు, పాటల కార్యక్రమాలలో సైతం "మీ ఓటు మీరు వేయండి" అని మరీ గుర్తు చేస్తున్నారు.
ఇంత మదనపడే గుండెకి ఈసారి ఓటు అన్నది ముఖ్యం అని అర్దం అయిపొయింది కాబట్టి ఎలాగయిన నాఓటు వినియోగించుకుని తీరాలి అని గట్టి నిర్ణయానికి వచ్హెసా . శాసన సభ ఓటు - లోక్ సత్తా కి మరియు లోక్ సభ ఓటు తెలుగుదేశం కి అని నిర్ణయించుకున్నా.మరి మీరు ??
5 comments:
మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. కానీ, లోక్ సభకు కూడా లోక్ సత్తా అర్హురాలేమో ఆలోచి౦చ౦డి!
లోక్ సభకి మా ప్రాంతం నుండి లోక్ సత్తా అభ్యర్ధి ఎవ్వరూలేరని తెలిసి ఆ నిర్ణయానికి వచాను పెదరాయ్డు గారు.క్రుతజ్ఞతలు !
కృష్ణ గారు,
"కృ" రాయాలంటే kR టైప్ చేయాలి లేఖినిలో!(small k, and capital R)
కృ - అని రాయటానికి చాలా విఫల ప్రయత్నాలే చేసాను మొత్తానికి మీ ద్వార తెలిసింది. సుజాత గారు చాల థాంక్స్ అండి!
Well said. Nice post. Keep posting. Also add a bit of humor. That will give completeness.
Visit...
http://thinkquisistor.blogspot.com/2009/04/1.html
Post a Comment
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...