Thursday, April 30, 2009

నాకు నచ్హిన కవి - శ్రీ శ్రీ శతజయంతి

సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించి కొత్త వంపులు తెప్పించి విప్లవాన్ని రేకెత్తించిన ఓ మహర్షి నీ శతజయంతి సందర్భంగా ఇదే నా నివాళి. "శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు" అని చాటి చెప్పిన మహనీయా ఇదే నీకు నా నివాళి

"తలవంచుకు వెళ్ళిపొయావా నేస్తం
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి ..."

అంటూ స్నేహితుని తలచుకుంటూ మీరు సాగించిన "మహా ప్రస్థానం " నిజం గా మాకు అలుపు తెప్పించ్హేంత ప్రయాశ ప్రయాణమే ఆయినా మాకు ఆ దారిలో కలిగే అనుభూతులు అనంతం- ఓ మహాత్మా.
"నిన్న వదిలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు !
కావున ఈ నిరాశామయలోకంలో
కధనశంకం పూరిస్తున్నాను ..."
అంటూ మీరు చేసిన శబ్ద తరంగాలు ఇప్పటికీ మా చెవిలో రింగు మంటున్నాయి - ఓ మహాకవి .

" నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను ! "
అని మీరు చెప్పినది, మాకు ఎప్పటికీ స్పూర్తిదాయకమే ! అదే మాలో అవేశానికి అద్యం.
"...సింహములాగూ, సివంగి లాగూ,
ఫిరంగిలాగూ, కురంగి లాగూ,
శంఖములాగూ, సర్పము లాగూ, ..."
అంటూ మాపై ఘర్జించి , తూటాలు పేల్చి, బుసలు కొడితే ఆ భయానికి బీతిచెందాము.
"కుక్కపిల్లా,
అగ్గిపుల్లా,
సబ్బుబిళ్ళా -
హీనం గా చూడకు దేన్నీ !
కవితామయమెనోయ్ అన్నీ !! ..."
అంటూ కవులకీ మీరిచ్హిన ధైర్యం - అది మా అద్రుష్టం
"కూటికోసం, కూలి కోసం
పట్టణంలో బ్రతుకుదామని
బయలుదేరిన బాటసారి ..."
అంటూ మమల్ని కదిల్చి వేసారు ...
"భూతాన్ని,
యఙోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను !
స్మరిస్తే పద్యం
అరిస్తే వాద్యం ..."
ఇంతకన్న పదాలేవి, మిమ్ము స్మరించటానికి ?? ఓ మహాకవి !!
"పొనీ పొనీ పోతే పొనీ ..."
"పతితులారా బ్రష్టులార బాదసర్ప ద్రష్టులార !!! ఏడవకండేడవకండి .."

"కొంత మంది కుర్రవాల్లు పుట్టుకతో వ్రుద్దులు ..."

"పొలాలనన్ని హలాలదున్ని ...."

"మనదీ ఒక బ్రతుకేనా కుక్కలవలే, నక్కలవలే ! ...సందులలో పందులవలే .."
"ఏదేశ చరిత్ర చూచినా ఎమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరయాణత్వం .."
"అంతేలే, పేదల గుండెలు ! అశ్రువులే నిండిన కుండలు ! .."
అంటూ బడుగుల బాధని అర్ధంచేసావు.
ఇలా ఎన్నెనో ..... ఎన్నెనో ..... నన్ను కదిల్చివెసాయి ..ఎన్నో రాత్రులు నన్ను అరిపించాయి ...
ప్రపంచమోక పద్మవ్యుహం !
కవిత్వమోక తీరని దాహం !

13 comments:

Bolloju Baba said...

caalaa baagundi

మురళి said...

బాగుందండి..

Uyyaala said...

శ్రీ శ్రీ ని కీర్తించడానికి
శ్రీ శ్రీ ని స్మరించడానికి
శ్రీ శ్రీ ని విమర్శించడానికి కూడా
మనం శ్రీ శ్రీ మీదే ఆధారపడాల్సిన పరిస్థితి !
చలం అంతటి వాడే శ్రీ శ్రీ ని తూచే రాళ్ళు తనవద్ద లేవన్నాడు.
అంతటి మహా కవిని తెలుగు వాళ్ళు గుర్తించ వలసినంత గుర్తించలేదని,
గౌరవించ వలసినంత గౌరవించలేదని అనిపిస్తుంది.
లేకుంటే సుబ్రమణ్య భారతి లా, రవీంద్రనాథ్ టాగూర్ లా
శ్రీ శ్రీ పేరు ప్రపంచ మంతా కాక పోయినా కనీసం భారత దేశమంతా
మారు మొగి పోతుండేది

పుల్లాయన said...

చాలా బాగుందండీ. చదువుతుంటేనే రోమాలు కదులుతున్నాయి.

Krishna said...

పుల్లాయన గారూ : మాటల స్వరం మారటం , రోమాలు నిక్క పొడుచుకోవటం , మనసు ద్రవించటం , రక్తం ఉరకలెత్తటం, అబ్బో ఇలాంటివి లెక్క లేనన్ని భావాలు పాఠకులను కుదిపేయటమే శ్రీ శ్రీ కవిత్వంలో ప్రత్యేకం.అందుకే అయన నాకు నచ్హిన కవి.
బాబా గారికి మురళి గారికి క్రుతజ్ఞతలు

Krishna said...

ప్రభాకర్ గారూ, అద్బుతంగా చెప్పారండి..
"శ్రీ శ్రీ ని కీర్తించడానికి
శ్రీ శ్రీ ని స్మరించడానికి
శ్రీ శ్రీ ని విమర్శించడానికి కూడా
మనం శ్రీ శ్రీ మీదే ఆధారపడాల్సిన పరిస్థితి !"
నిజంగా మీరన్నట్టే ఎదో తప్పు జరిగింది. అందుకే శ్రీ శ్రీ పేరు ప్రపంచకీర్తి బావుటాలని ఎగురవెయలేదనే చెప్పాలి !గూగుల్ లో శ్రీ శ్రీ మంచి ఫొటో కోసం వెదుకుతున్న నాకు ఈ రోజు నిరాసే ఎదురయ్యింది. కనీసం వికి లో సైతం సరైన విష్యాలు పొందుపరచలేదు . నిజం గా ఇది నా తరం వారి అందరికి ఒక దురద్రుష్టం.

Anonymous said...

వందేళ్ళ కితం పుట్టినా ఈనాటి తరం కన్నా ఇంకా ముందుకు ఆలోచించినవాడు శ్రీ శ్రీ.

తమ చదువులు తప్ప సాహిత్యం సంగతి పట్టని నేటి యువతరం శ్రీ శ్రీ రచనలు చదువుతారా?

శ్రీ శ్రీ చెప్పినట్టు వీళ్ళంతా "కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృధ్ధులు" అంతే.

కొత్త పాళీ said...

అవును. వాళ్ళు తెలుగు వాళ్ళుగా పుట్టడం మన అదృష్టం, వాళ్ళ ఖర్మం.

Krishna said...

కొత్త పాళీ :"వాళ్ళ ఖర్మ" అనేంత తెగువ నాకులేదు కాని, వాళ్ళు కారణజన్ములు అని నాకనిపిస్తుంది తమ కవితాజడిలో మనల్ని తడిపి, తరింపచేటానికే జన్మించారనిపిస్తుంది .
బోనగిరి : నేను శ్రీ శ్రీ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉన్న నాలాంటివారికి (నా తరం వారికి) అది తెలుసుకునే అద్రుష్టం కూడా లేదు అనితెలియచేసుకుంటున్నా!అది మరి మనదురద్రుష్టమే కదండి ? అయాన వందెళ్ళక్రితమే ముందుచూపుతో వెలంగించిన కవితాదివ్వే మనకి వెలుగులు అందించలేక పోవటం నిజంగా మనదురద్రుష్టమే.

మధురవాణి said...

చాలా బాగా గుర్తు చేశారు శ్రీ శ్రీ గారిని.!
"కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృధ్ధులు" -- ఎప్పుడైనా బద్దకంగా కనిపిస్తే మా నాన్నగారు ఎప్పుడూ ఈ మాటే చెప్పేవాళ్ళు.

కాలనేమి said...

"ఈ శతాబ్దం నాది" -- అని చాటుకోగల దమ్మున్న వ్యక్తి శ్రీశ్రీ. అసలు గొప్పదనం ఏమిటంటే, ఈ శతాబ్దం నాది అని చెప్పినా ఎవ్వరూ కాదనలేకపోవడం.

తెలుగునాట మార్క్సిజం/కమ్యూనిజం వల్ల శ్రీశ్రీ కాదు.. శ్రీశ్రీ గారి వల్ల మార్క్సిజం/కమ్యూనిజం :)

Hail SriSri!!

Anonymous said...

కృష్ణ గారు, శ్రీ శ్రీ పుస్తకాలు ఏ బుక్ ఫెస్టివల్ లో వెదికినా దొరుకుతాయి.
నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తెలుగులో ఆయన పాఠం ఉండేది. మరి ఇప్పుడు ఏ క్లాసులోనైనా ఉన్నాయో లేవో తెలియదు.
ఆకలి రాజ్యం సినిమా కూడా చూడండి.

Vinay Chakravarthi.Gogineni said...

baagundi

Post a Comment

వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...